DailyDose

ఏపీలో డమ్మీ ఈవీఎంల పట్టివేత–నేరవార్తలు–04/03

20dummy evms caught in andhra

????????????☘?????????☘???????????????☘????????????
*సరైన బిల్లులు లేకుండా తరలిస్తున్న 2400 డమ్మీ ఈవీఎంలను కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు తుమ్మలపాలెం చెక్ పోస్టు వద్ద మంగళవారం తెల్లవారుజామున స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి పీ. రామాంజనేయులుకు చెందిన వ్యక్తులు వీటిని తరలుస్తుండగా తనిఖీల్లో పట్టుకున్నారు. విషయాన్నీ మండల ఎన్నికల నియమావళి అధికారు ఎంపీడీవో రామప్రసన్న ద్రుష్టి కి తీసుకెళ్ళారు.
* గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో వైకాపా అధినేత జగన్‌ ఎన్నికల ప్రచారసభలో అపశ్రుతి చోటు చేసుకుంది. విద్యుదాఘాతంతో ఒకరు మృతి చెందగా.. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పిడుగురాళ్ల పట్టణంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో జగన్‌ ప్రసంగించిన అనంతరం జనరేటర్‌ వద్ద విద్యుత్ షార్ట్‌ సర్క్యూట్ అయింది. దీంతో సమీపంలో ఉన్న ఆర్టీసీ కండక్టర్‌ సోమిరెడ్డి (45) అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో మాచవరం మండలం మోర్జంపాడు గ్రామానికి చెందిన వృద్ధురాలు కృష్ణమ్మ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఓ బాలుడి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. మిగిలిన క్షతగాత్రులకు పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
* కాల్‌సెంటర్‌ కుంభకోణంలో నిషిత్‌కుమార్‌ పటేల్‌(31) అనే భారతీయుడికి అమెరికాలోని ఫ్లోరిడా కోర్టు ఎనిమిదేళ్ల తొమ్మిది నెలల జైలు శిక్ష విధించింది.
*తమిళనాడులో మంత్రి సన్నిహితుడి ఇంట్లో రూ.15 కోట్ల నగదు పట్టుబడిన వ్యవహారం ఆలస్యంగా వెలుగుచూసింది. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ సవాలు విసిరిన తర్వాత ఆ సోదాలకు సంబంధించిన వీడియోను ఐటీ అధికారులు విడుదల చేయడం గమనార్హం.
*లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో రూ.27,81,23,556 విలువైన మద్యం, నగదు, ఇతరవాటిని స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం రోజువారీ నివేదిక వెల్లడించింది. స్వాధీనమైన వాటిల్లో ఇతర మాదక ద్రవ్యాలతో పాటు బంగారు, వెండి ఆభరణాలు ఉన్నాయని పేర్కొంది.
*వైస్రాయ్‌ హోటల్స్‌కు చెందిన రూ.315 కోట్ల విలువైన ఆస్తులను పీఎంఎల్‌ఏ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీలాండరింగ్‌ యాక్ట్‌) చట్టం కింద ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జప్తు చేసింది. బెస్ట్‌ అండ్‌ క్రాంప్టన్‌ ఇంజినీరింగ్‌ ప్రైవేటు లిమిటెడ్‌ అనే కంపెనీపై బెంగళూరు సీబీఐ బీఎస్‌ అండ్‌ ఎఫ్‌సీ విభాగం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టగా వెల్లడైన అంశాల ఆధారంగా ఈడీ ఈ చర్య తీసుకుంది.
*ప్రముఖ వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్యకేసులో ప్రధాన నిందితుడు రాకేష్‌రెడ్డితో అంటకాగిన పోలీసు అధికారులపై వేటు పడింది. ఏసీపీ మల్లారెడ్డి, ఇన్‌స్పెక్టర్లు రాంబాబు, శ్రీనివాస్‌లను సస్పెండ్‌ చేస్తూ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.
*పదోతరగతి పరీక్షలు రాస్తున్న కుమారుడు సెల్‌ఫోన్లో ‘పబ్‌జీ’ ఆడుతూ సమయం వృథా చేసుకుంటున్నాడని ఆ తల్లి మందలించింది.
*పెళ్లయిన 40 రోజులకే ఓ నవ వధువు.. ఊరి చివర అడవిలో కాలి, బూడిదగా మారింది! ఆమెను అంతం చేశాడంటూ భర్తను, అతడితో చేతులు కలిపినట్లు తేలడంతో మరో ఇద్దరిని పోలీసులు అరెస్టుచేశారు. ఈ దారుణ హత్యోదంతం కుమురం భీం జిల్లాలోని జైనూరు మండలం భూసిమెట్ట ప్రాంతంలో మంగళవారం తీవ్ర కలకలం రేపింది.
*భారత వైమానిక దళానికి చెందిన మిగ్‌-27 యుద్ధ విమానం ఆదివారం రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌ వద్ద కూలిపోయింది. పైలట్‌ పారాచూట్‌ సాయంతో తప్పించుకొని, గాయాలతో బయటపడ్డారు. రోజువారీ విధుల్లో భాగంగా ఈ యుద్ధవిమానం ఉత్తర్‌లాయి వైమానిక స్థావరం నుంచి నింగిలోకి లేచింది. కొద్దిసేపటికే ఇంజిన్‌లో సమస్యలు తలెత్తాయి. దీంతో ఉదయం 11.45 గంటలకు జోధ్‌పుర్‌కు దక్షిణాన 120 కి.మీ.ల దూరంలోని సిరోహి జిల్లాలో యుద్ధవిమానం కూలిపోయిందని అధికారులు తెలిపారు.
*జమ్మూకశ్మీర్‌లోని రజౌరీ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దరాల్‌ ప్రాంతంలోని ఉజ్జాన్‌-దండ్‌కోట్‌ వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రయివేటు బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. *విద్యాబుద్ధులు నేర్పి ప్రయోజకుల్ని చేయాల్సిన పాఠశాలలే విద్యార్థుల పట్ల కర్కషంగా ప్రవర్తిస్తున్నాయి. తాజాగా.. ఫీజు కట్టలేదని ఇద్దరు విద్యార్థులను ఎండలో నిలబెట్టిన ఘటన తిరువనంతపురంలోని ఓ పాఠశాలలో చోటుచేసుకుంది. అందులో ఒకరు అంధ విద్యార్థి కావడం గమనార్హం.
*దేశంలో పరువు హత్యలు జరగకుండా ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఇంకా ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయి. తన కూతురు ఒక అబ్బాయికి తరచూ చరవాణిలో సందేశాలు పంపుతుందని ఏకంగా కూతురిని చంపేశాడు ఓ కసాయి తండ్రి. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది.
*విశాఖ తూర్పు నియోజకవర్గ పరిధి చినవాల్తేరులో శనివారం సాయంత్రం తెదేపా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో అపశ్రుతి చోటుచేసుకుంది. తెదేపా అభ్యర్థి, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు గ్యాస్‌ బెలూన్లు ఎగరవేయడానికి ప్రయత్నించారు.
*యమావళిని ఉల్లంఘించినందుకు చిత్తూరు జిల్లా వి.కోట మండలంలో మూడు మద్యం దుకాణాలను ఎక్సైజ్‌ శాఖ అధికారులు సీజ్‌ చేశారు. రూ.20 లక్షల సరకును స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్‌ సీఐ జవహర్‌బాబు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.
*పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంతో కర్నూలు జిల్లాలో కలకలం రేగింది. పరీక్ష ప్రారంభమైన అరగంటకే ప్రశ్నపత్రం వాట్సాప్‌లో చక్కర్లు కొట్టింది. జిల్లా విద్యాధికారులు దీనిని గుర్తించి అప్రమత్తమై ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు.
*పదోతరగతి పరీక్షలు రాస్తున్న కుమారుడు సెల్‌ఫోన్లో ‘పబ్‌జీ’ ఆడుతూ సమయం వృథా చేసుకుంటున్నాడని ఆ తల్లి మందలించింది. అమ్మపై అలిగిన ఆ బాలుడు ఆవేశంతో వెంటనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
*ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ట్రం వారణాసిలోని బనారస్‌ హిందూ యూనివర్సిటీలో ప్రత్యర్థులు జరిపిన కాల్పుల్లో గాయపడిన ఎంసీఏ విద్యార్థి గౌరవ్‌ సింగ్‌ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
*పారిశ్రామికవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసులో నిందితులకు సహకరించిన ముగ్గురు పోలీసు అధికారులపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఏసీపీ మల్లారెడ్డి, ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాస్‌, రాంబాబులను సస్పెండ్‌ చేస్తూ తెలంగాణ డీజీపీ మహేందర్‌ రెడ్డి మంగళవారం రాత్రి ఆదేశాలు జారీచేశారు. జయరాం హత్య జరిగిన రెండు నెలల తర్వాత ఎట్టకేలకు ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారులపై చర్యలు తీసుకున్నారు.
*ఐపీఎల్‌ బెట్టింగ్‌ కేసులో క్రికెట్‌ మాజీ కోచ్‌ తుషార్‌ అరోఠే అరెస్టయ్యారు. దిల్లీ క్యాపిటల్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ ఎలెవెన్‌ మధ్య సోమవారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌పై వడోదరలో బెట్టింగ్‌లో పాల్గొన్న అరోఠేతో పాటు 18 మందిని అరెస్టు చేశారు.
*సినీ నటుడు, వైకాపా నేత మోహన్‌బాబుకు హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌ కోర్టు ఏడాది జైలుశిక్ష విధించింది. రూ.40లక్షల చెక్‌బౌన్స్‌కు సంబంధించి 2010లో సినీ దర్శకుడు వైవీఎస్‌ చౌదరి కోర్టును ఆశ్రయించారు.
*ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ట్రం వారణాసిలోని బనారస్‌ హిందూ యూనివర్సిటీలో ప్రత్యర్థులు జరిపిన కాల్పుల్లో గాయపడిన ఎంసీఏ విద్యార్థి గౌరవ్‌ సింగ్‌ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మంగళవారం రాత్రి యూనివర్సిటీలోని బిర్లా హాస్టల్‌ ఎదుట స్నేహితులతో మాట్లాడుతుండగా గౌరవ్‌సింగ్‌పై నలుగురు వ్యక్తులు కాల్పులు జరిపారు.