Sports

ఆటగాళ్లకు నంబర్లు కేటాయించడం ఏంటి?

kapil dev questions numbering players

????????????☘?????????☘???????????????☘????????????
ఐపీఎల్‌ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పుడు అందరి చూపూ యువ బ్యాట్స్‌మెన్‌పైనే.. రాబోయే ప్రపంచకప్‌లో భారత జట్టు తరఫున నాలుగో స్థానంలో ఏ బ్యాట్స్‌మెన్‌ ఎంపికవుతాడో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఆ స్థానంపై భారత మాజీ క్రికెట్‌ దిగ్గజం కపిల్‌దేవ్‌ స్పష్టతనిచ్చారు. జట్టులో ఆటగాళ్లకు నంబర్లు కేటాయించడం ఏంటి. ఏ ఆటగాడైనా.. జట్టు పరిస్థితులను బట్టి ఏ స్థానంలోనైనా ఆడేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. అవసరాలను దృష్టిలో పెట్టుకొని బ్యాటింగ్‌ స్థానాలను నిర్ణయించాలన్నారు. అనవసరంగా ఈ ఆలోచనతో జట్టు ఆయోమయానికి గురికావొద్దని సూచించారు. అంతా కలిసి ఒక జట్టులాగా ఆడాలి.. కానీ నంబర్ల గురించి మాట్లాడటం మంచిదికాదన్నారు. యువ క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌ గురించి మాట్లాడుతూ.. పంత్‌ ఇంకా నిరూపించుకోవాల్సింది చాలా ఉందని, రాబోయే తరాల ఆటగాళ్లు ధోనీ స్థాయిలో ఆడేందుకు ప్రయత్నించాలని సూచించారు. ధోనీని అందుకునే సత్తా పంత్‌కు ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. మీకు నచ్చిన ఆల్‌రౌండర్లు ఎవరూ అని ప్రశ్నించగా.. ఆయన విచిత్రమైన సమాధానం ఇచ్చారు. నాకు నచ్చిన ఆల్‌రౌండర్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ అన్నారు. బౌలింగ్‌, బ్యాటింగ్‌ చేసేవాళ్లే ఆల్‌రౌండర్లా..? అని ఆయన నవ్వుతూ ప్రశ్నించారు. టెస్ట్‌ క్రికెట్‌లో రవిచంద్రన్‌ అశ్విన్‌ మంచి ఆల్‌రౌండర్‌ అని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న ఆల్‌రౌండర్లలో ఉత్తమం ఎవరంటే.. బెన్‌స్టోక్స్‌ పేరు చెప్తా అన్నారు. కపిల్‌ దేవ్‌ 1983లో భారత్‌కు తొలిసారి ప్రపంచకప్‌ అందించిన జట్టు కెప్టెన్‌.