MoviesVideos

ఐటెం పాటలో పాయల్

payal sita item song

‘ఆర్‌ఎక్స్‌ 100’తో తెలుగు తెరకు పరిచయమైన పంజాబీ కుడి పాయల్‌ రాజ్‌పుత్‌. తొలి చిత్రంలోనే ‘ఆర్‌ఎక్స్‌ 100’ బండి నడిపారు. మరోసారి మళ్లీ బండి ఎక్కారు. ఈసారి బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా నటించిన ‘సీత’ చిత్రంలోని ప్రత్యేక గీతం కోసం! ‘బుల్లెట్‌ మీద వచ్చె బుల్‌రెడ్డి…’ అంటూ సాగే ఈ గీతాన్ని బుధవారం ఉదయం విడుదల చేస్తున్నారు. తేజ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, కాజల్‌ అగర్వాల్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘సీత’. మన్నార్‌ చోప్రా మరో నాయిక. కీలక పాత్రలో సోనూ సూద్‌ నటించగా, ప్రత్యేక గీతంలో పాయల్‌ నర్తించారు. ‘‘ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కి మంచి స్పందన లభిస్తోంది. కథానుసారం కీలక సమయంలో వచ్చే పెప్పీ మాస్‌ సాంగ్‌ ‘బుల్‌రెడ్డి…’ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది’’ అని నిర్మాత రామబ్రహ్మం సుంకర అన్నారు. ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీత దర్శకుడు.