DailyDose

చింతమనేని నువ్వు మనిషివేనా?–రాజకీయ-04/03

sharmila slams chinthamaneni

????????????☘?????????☘???????????????☘????????????
* దెందులూరు ఎమ్మెల్యే, టీడీపీ నేత చింతమనేని అక్రమాలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబే కారణమని వైసీపీ నేత వైఎస్ షర్మిల ఆరోపించారు. అలాంటి వ్యక్తికి మరోసారి టీడీపీ తరఫున టికెట్ ఇవ్వడం దారుణమని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో చింతమనేని ప్రభాకర్ కు బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 38 రౌడీషీట్ కేసులున్న చింతమనేనిని ఓడిస్తే, జగన్ అన్న అతనికి బుద్ధి వచ్చేట్లు చేస్తాడన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నడిపల్లిలో ఈరోజు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో షర్మిల మాట్లాడారు.ఇసుక క్వారీల వద్ద తనిఖీలకు వెళ్లిన ఎమ్మార్వో వనజాక్షిని జుట్టుపట్టుకుని రోడ్డుపై ఈడ్చుకెళ్లిన చింతమనేనికి మళ్లీ చంద్రబాబు టికెట్ ఇవ్వడం దారుణమని షర్మిల మండిపడ్డారు. చింతమనేని అక్రమాలు ఒక్కొక్కటీ వింటుంటే అతను అసలు మనిషేనా? అని అనుమానం వస్తోందని దుయ్యబట్టారు.
*అంబిక కృష్ణకు పీతల సుజత వార్నింగ్
మాజీమంత్రి, టీడీపీ మహిళా నేత పీతల సుజాత మీడియా సాక్షిగా కంటతడి పెట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జంగారెడ్డిగూడెంలో టీడీపీ ఆర్యవైశ్య సభలో ఆ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌ అంబికా కృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. తనపై అంబికా కృష్ణ తప్పుడు ప్రచారం చేశారంటూ… బుధవారమిక్కడ ఆమె కన్నీరు పెట్టుకున్నారు. ‘బుద్ధిన్నవాళ్లు ఎవరూ అలా మాట్లాడరని, మంత్రి పదవి లేకున్నా… పార్టీని బలోపేతం చేస్తూంటే …మీకు నాలో పొగరు కనిపిస్తుందా?. నన్ను అవమానించడానికా?. పార్టీని అవమానించడానికా ఈ వ్యాఖ్యలు. ప్రతి నియోజకవర్గంలోను నాయకులకు నాయకులకు మధ్య ఉన్న సమస్యలు స్థానిక ఎమ్మెల్యేకే అంటకడతారు. అలాగే కారణం ఏదైనా నాకు టికెట్ రాలేదు అన్న విషయం అందరికి తెలిసిందే.
*పవన్ పార్టీకి రజనీకాంత్ మద్దతు
తమిళనాడు రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. కమలహాసన్ పార్టీకి రజనీకాంత్ మద్దతు ప్రకటించారు. ఈ విషయాన్ని కమలహాసన్ స్వయంగా వెల్లడించారు. గతంలో తన పార్టీ కేంద్ర కార్యాలయంలో భేటీ సందర్భంగా రజనీ మద్దతును తాను కోరానని… ఆయన సరేనన్నారని చెప్పారు. ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించాలని రజనీ ఆకాంక్షించారని… రేపటి రోజు మనదేనని చెప్పారని తెలిపారు. బీజేపీకి తమ పార్టీ బీ-టీమ్ కాదని చెప్పారు. 39 లోక్ సభ స్థానాలతో పాటు… ఉపఎన్నికలు జరుగుతున్న 18 అసెంబ్లీ స్థానాల్లో కమల్ పార్టీ మక్కల్ నీధి మయ్యమ్ పోటీ చేస్తోంది. అయితే, కమల్ మాత్రం పోటీకి దూరంగా ఉన్నారు.
*నేను ఓడిపోతే కుటుంబంతో గడుపుతా.
ఈ ఎన్నికల్లో తాను ఓడిపోతే భార్య, కుమారుడు, మనవడితో గడుపుతానని, మరి నరేంద్ర మోదీ ఓడిపోతే ఎవరితో కాలం గడుపుతారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. నిన్న రాత్రి చిత్తూరు జిల్లా మదనపల్లిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ, కుటుంబ వ్యవస్థంటే ఏంటో మోదీకి తెలియదని ఆరోపించారు.
తన చేతికి బంగారపు ఉంగరాలు, మెడలో గొలుసులు లేవని, అటువంటి వాటిపై తనకు ఆశ కూడా లేదని, కేవలం ప్రజలకు సేవ చేయాలన్నది మాత్రమే తన అభిమతమని చంద్రబాబు స్పష్టం చేశారు. తాను శాకాహారం మాత్రమే తింటానని, అది కూడా తక్కువేనని అన్నారు. జగన్ పార్టీలో పనిచేయడానికి వచ్చిన సినీ కళాకారులు అలీ, జయసుధ వంటివారు, తిత్లీ, హుద్‌ హుద్‌ తుపాన్లు వచ్చిన సమయంలో ఎక్కడున్నారని ప్రశ్నించారు. వీరి సినిమా టికెట్లు కొన్న ప్రజలు, వీరిని కోటీశ్వరులను చేశారని, వీరిలో మాత్రం కనీస మానవత్వం లేకుండా పోయిందని అన్నారు.
*చంద్రబాబు… తధాస్తు దేవతలు ఉన్నారు.
చంద్రబాబు కోరికను తథాస్తు దేవతలు విన్నారని, ఆయన శాశ్వతంగా మనవడితో ఆడుకునే అవకాశాన్ని ఇవ్వబోతున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. నిన్న ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు మాట్లాడుతూ, తనకు పదవిపోతే, భార్య, కుమారుడు, మనవడు ఉన్నారని, మోదీకి ఎవరున్నారని ప్రశ్నించిన సంగతి తెలిసిందే.బాబు వ్యాఖ్యలపై సెటైర్ వేసిన కన్నా, “అదిరిందయ్య చంద్రం..! ఇన్నాళ్లకు మీ 40 ఏళ్ల అనుభవంతో మీ భవిష్యత్తుని సరిగ్గా అంచనా వేసుకున్నారు.. తథాస్తు దేవతలు తప్పక మీ కోరిక నెరవేరుస్తారు. మీ విషయంలో ప్రజలు కూడా అదే భావనతో ఉన్నారు.. మరో వారం తరవాత శాశ్వతంగా మీరు మనవడితో పూర్తి సమయం ఆడుకునే అవకాశం ఇవ్వబోతున్నారు” అని అన్నారు.
*ఏపీ ప్రజలు చంద్రబాబు, జగన్‌ వలలో పడవద్దు
ఎపి ప్రజలు కొత్త తరం నేతలను కోరుకుంటున్నారని మాయావతి పేర్కొన్నారు. బుధవారం జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ – బిఎస్‌పి అధినేత్రి మాయావతి లు విశాఖలో సంయుక్త మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ… బిఎస్‌పి తో కలిసి పని చేయడం ఆనందంగా ఉందన్నారు. దళితులను సిఎం చేస్తామనే హామీతో తెలంగాణ ఉద్యమం ప్రారంభమయ్యిందని తెలిపారు. దశాబ్ధ కాలంగా బిఎస్‌పి నేతలతో సంప్రదింపులు జరుగుతున్నాయని తెలిపారు. 2014 లో అప్పటి పరిస్థితులను బట్టి బిజెపి, టిడిపి తో కలిశామని పవన్‌ పేర్కొన్నారు. అనంతరం మాయావతి మాట్లాడుతూ.. ఉమ్మడి ఎపి ని కాంగ్రెస్‌ అభివృద్ధి చేయలేదని చెప్పారు. అభివృద్ధి చేసి ఉంటే విభజన జరిగేది కాదన్నారు. విభజన తర్వాత కూడా ప్రాంతీయ పార్టీల పాలనలో మార్పు లేదని మాయావతి పేర్కొన్నారు. ఎపి ప్రజలు కొత్త తరం నేతలను కోరుకుంటున్నారన్నారు. ఎపి ప్రజలు చంద్రబాబు, జగన్‌ వలలో పడకూడదని మాయావతి సూచించారు. ప్రత్యేక హోదా హామీని కూడా నెరవేర్చలేకపోయారని ఎద్దేవా చేశారు. పవన్‌తో పాటు బిఎస్‌పి, వామపక్షాలు కలిసి పని చేస్తున్నాయన్నారు. ప్రత్యేక హోదాపై పవన్‌ పోరాడుతున్నారని, మంచి పాలన అందించాలనే ఉద్దేశంతోనే జనసేనతో బిఎస్‌పి పొత్తు పెట్టుకుందని మాయావతి వ్యాఖ్యానించారు.
*నిహారిక ప్రచారం
ఎప్పుడూ సినిమాలు, యూట్యూబ్ సీరీస్ లతో బిజీగా ఉండే కొణిదెల నిహారిక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తన తండ్రి నాగబాబు జనసేన తరపున పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎంపీగా పోటీ చేస్తున్నారు. పవన్ భీమవరం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. వీరిద్దరి తరపున మంగళవారం నిహారిక ప్రచారం చేశారు. తండ్రికి మద్దతుగా ప్రచారం గెలిపిస్తారన్న నమ్మకం ఉందన్నారు.
* తెలంగాణలో పోటీ చేయాలని రాహుల్‌ను కోరాం
రాహుల్‌ గాంధీ అమేఠీ, వాయ్‌నాడ్‌ రెండు చోట్లా గెలవడం ఖాయమని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు ఆర్‌సీ కుంతియా అన్నారు. మోదీ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేస్తేనేమో సరైందా..? రాహుల్ పోటీ చేస్తేనేమో భయపడినట్లా? అని నిలదీశారు. రాహుల్‌ను తెలంగాణలో పోటీ చేయాలని కోరామని, ఆయన కేరళకు వైపు మొగ్గు చూపారని తెలిపారు. ఈ మేరకు ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.
* 20 హైదరాబాద్‌లు తయారు చేస్తా-ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు
2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు ఏపీలో ఉద్యోగులకు కనీసం జీతాలు వస్తాయా? వృద్ధులకు పింఛన్లు వస్తాయా? అనే అనుమానం ప్రజల్లో కలిగిందని, కానీ ఐదేళ్లలో రాష్ట్ర రూపురేఖలు మార్చగలిగామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అమలు చేయడమే కాకుండా రాష్ట్రంలో అభివృద్ధి పనులు భారీగా చేశామని తెలిపారు. మొదటి పదేళ్లు హైదరాబాద్‌లో ఉండొచ్చనే వెసులుబాటు ఉన్నా కేసీఆర్‌ చులకన ప్రవర్తన వల్ల ఏపీకి వచ్చేశామని గుర్తు చేశారు. ఒక్క హైదరాబాద్‌ పోయినా పర్లేదని మరో 20 హైదరాబాద్‌లు తయారు చేసే సత్తా తనలో ఉందని ఉద్ఘాటించారు. కానీ గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో మూడు సీట్లు మాత్రమే గెలిపించినందుకు ముఖ్యమంత్రి నిరాశాభావం వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో అన్ని సీట్లు గెలిపించినట్లే నెల్లూరులోనూ గెలిపించాలని అభ్యర్థించారు. పట్టిసీమ ద్వారా నెల్లూరు జిల్లాకు కూడా సాగునీళ్లిచ్చానని గుర్తు చేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు.
* నన్ను ఓడించేందుకు అద్దె తారలు: లోకేశ్‌
గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి బరిలో దిగిన తనను ఓడించేందుకు వైకాపా అద్దె తారలను ప్రచారంలోకి దింపుతోందని తెదేపా అభ్యర్థి, మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. మంగళగిరికి చెందిన తాడిబోయిన ఉమా యాదవ్ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో ఆయన అనుచరులు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. ప్రజలను ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడమే నిజమైన అభివృద్ధి అన్నారు. రూ.10 వేల కోట్లతో బీసీ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 2024 నాటికి పేదరికం లేకుండా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు చెప్పారు.
* ఉల్లిపాయ మీద పొట్టు కూడా తీయలేవు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. పవన్ కల్యాణ్ అమ్ముడుపోయిన వ్యక్తి అని విమర్శించారు. అమాయకుల అభిమానాన్ని తాకట్టు పెట్టి నాలుగు రాళ్లు సంపాదించుకునేందుకు పవన్ కల్యాణ్ వచ్చాడని ఎద్దేవా చేశారు. ఉల్లిపాయ మీద పొట్టును కూడా తీయని పవన్ కల్యాణ్ తాటలు తీయడం కూడానా? అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.ఈరోజు ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి స్పందిస్తూ..‘నువ్వొక అమ్ముడు పోయిన వ్యక్తివి. ఉల్లిపాయ మీద పొట్టు కూడా తీయలేవు పవన్ కళ్యాణ్. అమాయకుల అభిమానాన్ని తాకట్టు పెట్టి నాలుగు రాళ్లు సంపాదించుకునేందుకు వచ్చినోడివి. ఏప్రిల్‌ 11 వరకు గంతులేసి వెళ్లు. నీ బతుక్కు తాటలు తీయడమొకటా? నీ యజమాని చంద్రబాబే అన్నీ సర్ధుకుంటున్నాడు’ అని ట్వీట్ చేశారు.
* అలాంటి వారితో జగన్‌ కలుస్తారా?: కనకమేడల
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని, ఆంధ్రాలో కూడా అదే కుట్రతో అధికారం చేజిక్కించుకోవాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్‌ ఆరోపించారు. అమరావతిలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటరీ, ముచ్చుమర్రి ప్రాజెక్టులు మూసేయాలని తెలంగాణ డిమాండ్‌ చేస్తోందన్నారు. శ్రీశైలం జలాశయం నుంచి రాయలసీమకు నీరందించేందుకు పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటరీనే ప్రధానమని వివరించారు.
*చింతమనేని బెదిరింపులకు భయపడొద్దు
ఇసుక తనిఖీలకు వెళ్ళిన మహిళా ఎమ్మార్వో వనజాక్షిని జుట్టు పట్టుకుని రోడ్డు పై ఈడ్చుకుంటూ వెళ్ళిన తెదేపా ఎమ్మెల్యే అభ్యర్ధి చింతమనేని ప్రభాకర్ అసలు మనిషేనా? ఆయన ఒక తల్లికి పుట్టలేదా? ఆమె మహిళా కదా? ఆయన భార్య మహిళా కాదా? మహిళల పై గౌరవం లేని ఇలాంటి దుర్మర్గుడికి మళ్ళీ ఎమ్మెల్యే సీటు ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఇంకెంత దుర్మార్గుడో ఆలోచించండి. చింతమనేని బెదిరింపులకి భయపడవద్దు. ఈ ఎన్నికలే మీకు ఆయుధం. మీ ఓటుతో చింతమనేనికి గట్టిగా బుద్ది చెప్పండి అని వైకాపా అద్యక్షుడు ప్రతిపక్ష నేత జగన్ సోదరి షర్మిల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బస్సుయాత్ర నిర్వహిస్తున్న షర్మిల బుధవారం పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు.
* ‘నందమూరి బ్రదర్స్’ ఈ అంతర్మథనం ఎందులకు?
తెలుగుదేశం…తెలుగు ప్రజల ఆరాధ్యదైవం, అన్న నందమూరి తారకరామారావు గారిచే స్థాపించబడిన పార్టీ. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీ పగ్గాలు కాస్త ‘నారా’ వారి చేతికి వెళ్లాయి. పార్టీని ఆదరించడానికి, 9 నెలల్లో అధికారంలోకి రావడానికి అన్న ఎన్టీఆర్ కారణమైనా…ఇంత కాలం పార్టీ బలంగా నిలబడటానికి, నెగ్గుకురావడానికి చంద్రబాబు కారణమనేది పార్టీ కార్యకర్తల్లో బలంగా వినిపించే మాట.కానీ కొద్దిమంది కార్యకర్తల్లు మాత్రం పార్టీ ‘నారా’ వారి చేతుల్లోకి వెళ్లడం జీర్ణించుకోలేకపోతున్నారు. పగ్గాలు ఎన్టీఆర్ ఫ్యామిలీ చేతుల్లోనే ఉండాలనేది వారి వాదన. ఎలక్షన్స్ అప్పుడు, దివంగత ఎన్టీఆర్ జయంతి, వర్థంతి కార్యక్రామాల్లో వారి యెక్క నిరసనను తెలపడం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ గ్యాప్ కార్యకర్తల్లోనే ఉందా? ఫ్యామిలీల వరకు పాకిందా అంటే…కుటుంబాల మధ్య కూడా కాస్త గ్యాప్ నడుస్తుందనేది పొలిటికల్ వర్గాల భోగట్టా. ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు పార్టీని టేక్ ఓవర్ చేసుకున్న సందర్భంలో హరికృష్ణకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తానని హామి ఇచ్చి..చంద్రబాబు దాన్ని విస్మరించారనేది హరికృష్ణ వర్గం నుంచి వచ్చే టాక్. ఆ తర్వాత ఆయనను పొలిట్ బ్యూరో సభ్యున్ని చేసినా, రాజ్యసభ సభ్యున్ని చేసినా ఆయన అసంతృప్తి చల్లారలేదనేది పార్టీలో ఇన్ సైడ్ వినిపించే మాట. ఇక ఇదే విషయంపై హరికృష్ణ చాలా సార్లు బాహటంగానే తన అసంతృప్తిని వ్యక్తపరిచారు. ఈ సమయంలోనే తన సోదరుడైన హీరో నందమూరి బాలకృష్ణతో కూడా గ్యాప్ మెయింటేన్ చేస్తూ వచ్చారు హరికృష్ణ. తన ఇద్దరి కుమారులు, సినిమా హీరోలైన నందమూరి తారక రామారావు, నందమూరి కళ్యాణ్ రామ్‌లను ఒక జట్టుగా ఉంచే ప్రయత్నం చేశారు. పలు వేడుకలకు, ఫంక్షన్స్‌ కు తన కొడుకులతో కలిసి వెళ్తూ..పార్టీ కార్యక్రమాల నుంచి కాస్త దూరం పాటించారు.మళ్లీ విబేదాలు పక్కన పెట్టి 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జానియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు ప్రచారం చేశారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల మళ్లీ గ్యాప్ వచ్చింది. హరికృష్ణ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు కొడాలి నాని పార్టీ మారిన విషయంలో కావచ్చు, మరి కొన్ని వివాదాలు ముసురుకున్నప్పుడు కావచ్చు తాను ఆఖరి శ్వాస వరకు టీడీపీలో ఉంటా అని చెప్పిన ఎన్టీఆర్..పార్టీ వ్యవహారాల్లో, ప్రచార కార్యక్రమాల్లో మాత్రం అంటీ ముట్టనట్టు వ్యవరిస్తూ వస్తున్నారు. అయితే హరికృష్ణ మరణాంతరం విభేదాలు మళ్లీ సద్దుమణిగినట్టే కనిపించాయి. హరికృష్ణ అంత్యక్రియల్లో కూడా చంద్రబాబు ఇంటి పెద్దగా వ్యవహరిస్తూ అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అన్ని కార్యక్రమాల్లో కుటుంబ సభ్యలందరూ ఒకే చోట కనిపించడంతో అభిమానులు, కార్యకర్తలు హ్యపీ ఫీల్ అయ్యారు. సరిగ్గా ఇదే టైంలో తెలంగాణలో ఎన్నికలు వచ్చాయి. పొత్తుల్లో భాగంగా కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థిగా నందమూరి హరికృష్ణ కూతురైన సుహాసినిని బరిలోకి దించారు ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు. ఇక అక్క కోసం నందమూరి బ్రదర్స్ ప్రచారం పక్కా అనుకున్నారు అందరూ. అయితే అనూహ్యంగా అక్కకు మా మద్ధతు అంటూ ఒక ప్రకటన రిలీజ్ చేసిన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ప్రచారంవైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. దీంతో పార్టీ వర్గాల్లో చంద్రబాాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పర్యటనకు వచ్చిన సందర్భంగా తెలంగాణ పార్టీ భాధ్యతను జూనియర్ ఎన్టీఆర్‌కు అప్పగించాలంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సమయంలో చంద్రబాబు పార్టీ ఎవరికి కావాలంటే వారు పార్టీలోనే ఉంటారని.. ఏ టైంలో ఏం చేయాలో నేను చూసుకుంటానంటూ చెప్పారు. బాలకృష్ణ కూడా పార్టీని కావాలనుకుంటే వారే ప్రచారానికి వస్తారంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో జానియర్ ఎన్టీఆర్‌కు, పార్టీకి గ్యాప్ అలానే ఉందా అనే టాక్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వినిపించింది.అయితే మరో వారం రోజుల్లో ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ప్రచారం ఇంకో ఆరు రోజుల్లో ముగియనుంది. ఈ టైం వరకు ప్రచారానికి ఇద్దరు నందమూరి హీరోలు అటెండ్ అవ్వలేదు. మరోవైపు వైసీపీలో రోజురోజుకూ సినీ గ్లామర్ యాడ్ అవుతూ పోతుంది. ఇప్పటికే రాజశేఖర్, మోహన్ బాబు, అలీ, జయసుధ లాంటి అగ్రస్థాయి నటులు ప్రచారంలో భాగమవుతున్నారు. తెలుగు తెర ఇలవేల్పు, అన్న ఎన్టీఆర్ పెట్టిన పార్టీకి సినీ గ్లామర్ లేకపోవడం నిజంగా టీడీపీకి కాస్త ఇబ్బందికర విషయమే. జూనియర్ ఎన్టీఆర్‌ను ప్రచారానికి పిలిచే విషంలోనూ టీడీపీ అధినాయకత్వం ఆచి, తూచి పావులు కదుపుతుంది. ఇక ప్రచారంలో పాల్గొనే విషయంపై జూనియర్ కూడా ఆలోచనలో పడుతున్నారు. ఇక వారం రోజుల్లో నందమూరి బ్రదర్స్ ఎటువైపు అడుగులు వేస్తారో చూడాలి?
* రేపటి నుంచి ఏపీలో నటి రేవతి ప్రచారం
సార్వత్రిక ఎన్నికల వేళ టీడీపీ ఎన్నికల ప్రచారం స్టార్‌ క్యాంపైన్‌లో భాగంగా ఒకప్పటి ప్రముఖ సినీ నటి రేవతి ఈ నెల 4వ తేదీ ఉదయం 9 గంటలకు ఏలూరు నియోజకవర్గంలోని 49వ డివిజన్‌లో, సాయంత్రం 4 గంటలకు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తారు. అనంతరం పాలకొల్లులో బస చేస్తారు. 5వ తేదీ ఉదయం 9 గంటలకు పాలకొల్లు, సాయంత్రం 4 గంటలకు నరసాపురం నియోజకవర్గాల్లో రేవతి ప్రచారం నిర్వహించ‌నున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర హస్త కళల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ పాలి ప్రసాద్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు పాల్గొని విజయంతం చేయాలని ప్రసాద్‌ సూచించారు.
*ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిన్చినట్లే
నరేంద్ర మోడీ మళ్ళీ ప్రధాని కావాలని పేర్కొంటూ రాజస్థాన్ గవర్నర్ కళ్యాణ్ సింగ్ వ్యాఖ్యానించడం ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించడమేనని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ధారణకు వచ్చింది. ఆయన ఒక రాజ్యంగా పదవిలో ఉన్నందున ఈ విషయ తీవ్రతను రాష్ట్రపాటి రాం నాద్ కోవిండ్ దృష్టికి తీసుకువేల్లనని భావిస్తున్నట్లు సంబంధిత ఈసీ వర్గాలు తెలిపాయి. గత నెలలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో గవర్నర్ కళ్యాణ్ సింగ్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో భాజపా విజయం సాధించాలి మళ్ళీ మోడీనే ప్రధాని పదవిని అధిస్తించాల్సిన అవసరం ఉంది అని వ్యాఖ్యానించిన విషయం విదితమే.
*పాకిస్తాన్ వెళ్ళిపొండి
జమ్మూ కాశ్మీర్ కు సదర్ ఎ రియాసన్ వజీర్ ఎ ఆజం పదవుల పునరుద్దరణకు రానా పార్టీ ప్రయత్నిస్తుందని ఆ రాష్ట్ర మాజీ సిఎం నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా సెహ్సిన వ్యాఖ్యల పై మాజీ క్రికెటర్ భాజపా నాయకుడు గౌతమ్ గంభీర్ మండిపడ్డారు. ఒమర్ పాకిస్తాన్ కు వలస వెళ్ళాలని ట్విట్టర్లో సూచించారు. ఒమర్ కు కొంచెం నిద్ర, చిక్కటి కాఫీ అవసరం అప్పటికే విషయం అర్ధం కాకుంటే ఆయనకు పాకిస్తాన్ అవసరం అని ఎద్దేవా చేశారు. గంభీర్ వ్యాఖ్యలను ఒమర్ తిప్పికొట్టారు. నేను పెద్దగా క్రికెట్ ఆడలేదు. అందులో నాకు పెద్దగా నైపుణ్యం లేదని తెలుసు. జమ్మూ కాశ్మీర్ దాని చరిత్ర అ చరిత్రను తీర్చిద్దిడంలో నేషనల్ కాన్ఫరెన్స్ పాత్ర గురించి మీకు పెద్దగా తెలియదు అని గంభీర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
* నా తల్లి నేర్పిన సంస్కారం వల్లే మోదీపై వ్యక్తిగత విమర్శలు చేయను: పవార్‌
తన తల్లి నేర్పిన సంస్కారం వల్లే తాను ప్రధాని మోదీపై వ్యక్తిగత విమర్శలు చేయబోనని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ) అధినేత శరద్‌ పవార్‌ మంగళవారం వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర వార్ధాలో నిర్వహించిన బహిరంగ సభలో మోదీ సోమవారం పవార్‌పై విమర్శలు చేశారు. ‘‘పరిస్థితులు అనుకూలంగా లేవని గ్రహించడం వల్లే శరద్‌ పవార్‌ ఈసారి పోటీ చేయడం లేదు. సమీప బంధువు కారణంగా కుటుంబ తగాదాలతో ఎన్‌సీపీపై పవార్‌ పట్టు కోల్పోయారు.’’ అని మోదీ విమర్శించారు. దీనిపై శరద్‌ పవార్‌ స్పందించారు. కొల్హాపుర్‌లో నిర్వహించిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘‘మోదీ ఎక్కడికి వెళ్లినా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. నేను అలా చేయను. అది మన సంస్కృతి కాదు.’’ అని వ్యాఖ్యానించారు.
* ఏపీలో బీజేపీ వెంటిలేటర్ మీద ఉన్న పార్టీ: గంటా
ప్రధాని మోదీ, అమిత్ షా ఏ మొహం పెట్టుకుని ఏపీకి వస్తున్నారని మంత్రి గంటా శ్రీనివాస్ మండిపడ్డారు. ఏపీకి ఏం చేశారో బీజేపీ ఇప్పటికైనా చెప్పాలని ప్రశ్నించారు. బీజేపీ వెంటిలేటర్ మీద ఉన్న పార్టీ అని, ఏపీలో ఆ పార్టీకి భవిష్యత్ లేదని అన్నారు. బుధవారం విశాఖ నగరంలో మంత్రి గంటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వాసుదేవనగర్‌లో యువకులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 2014లో తెలుగు ప్రజలు కాంగ్రెస్‌ను ఏ విధంగా భూస్థాపితం చేశారో.. అదే విధంగా 2019 ఎన్నికల్లో బీజేపీని కూడా ఏపీలో పూర్తిగా భూస్థాపితం కాబోతోందని మంత్రి జోస్యం చెప్పారు.
* ఉత్తమ్ ఓటమి ఖాయం: వేమిరెడ్డి
ఉత్తమ్ ఓటమి ఖాయం అని నల్గొండ లోక్‌సభ టీఆర్ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహా రెడ్డి అన్నారు. హుజూర్‌నగర్‌లో జరిగిన రాహుల్ సభనే దీనికి నిదర్శనం అని పేర్కొన్నారు. ఈ ఎన్నికల తర్వాత గాంధీభవన్‌కు తాళాలు వేయడం తప్పదని వ్యాఖ్యానించారు. బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన వేమిరెడ్డి.. దేశం యావత్తు సీఎం కేసీఆర్ నాయకత్వం వైపు చూస్తోందన్నారు. ఓటమి భయంతోనే ఉత్తమ్ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. హౌసింగ్ స్కాంలో ఉన్న ఉత్తమ్.. తనపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నల్గొండ ఎంపీగా భారీ మెజారిటీతో తన విజయం ఖాయం అని అన్నారు.
* టీడీపీ ప్రజల కళ్లలో మట్టి కొట్టింది- రాజ్‌నాథ్
ఐదేళ్లు అధికారంలో ఉన్న టీడీపీ.. ప్రజల కళ్లలో మట్టి కొట్టిందని కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్‌‌సింగ్ విమర్శించారు. అవనిగడ్డలో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా… ప్రత్యేక దృష్టితో చూస్తున్నామని తెలిపారు. మోదీ హయాంలో రైతుల కనీస మద్దతు ఒకటిన్నరరెట్లు పెరిగిందని స్పష్టంచేశారు. ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తే రైతుల ఆదాయం రెండింతలు చేస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ అధికారంలోకి రాగానే బందరు పోర్టుకు తొలి సంతకం చేస్తామని వెల్లడించారు. అగ్రవర్ణాల్లోని పేదలకు 10శాతం రిజర్వేషన్లు ఇస్తున్నామన్నారు. 2022 నాటికి మూడు అగ్రదేశాల్లో భారత్‌ ఉంటుందని పేర్కొన్నారు.
* ఫెడరల్ ఫ్రంట్‌కు నామరూపాలు లేవు: దత్తాత్రేయ
కేసీఆర్ తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని కేంద్ర మాజీ మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ దత్తాత్రేయ ధ్వజమెత్తారు. ఇన్ని రోజులు మోదీ విధానాలను సమర్ధించి ఇప్పుడు విమర్శించడమేంటి? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. మోదీపై కేసీఆర్ వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదన్నారు. కేసీఆర్ మోదీకి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కేసీఆర్ కుటుంబానికి గులాం చేస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ మంత్రులంతా గజగజ వణికిపోతున్నారని ఆరోపించారు. ఫెడరల్ ఫ్రంట్‌కు నామరూపాలు లేవన్నారు. మోదీ మళ్లీ ప్రధాని అయితే కేసీఆర్, కేటీఆర్ రాజకీయ సన్యాసం తీసుకోవడానికి రేడినా ? అడిగారు. కేసీఆర్ మాటలు అరిగిపోయిన రికార్డర్ లాగే ఉన్నాయని ఎద్దేవా చేశారు. రామమందిరం విషయంలో టీఆర్ఎస్ స్టాండ్ ఏంటి? ఏ లెక్కలపైనైనా, ఏ చౌరస్తాలోనైనా టీఆర్ఎస్‌తో చర్చించడానికి సిద్ధమని సవాల్ విసిరారు.
*ధైర్యం ఉంటె ఆ చిత్రాన్ని విడుదల చేయండి: లక్ష్మి పార్వతి
బాంబులకు, ప్రధాన మంటి నరేంద్ర మోడీకి భయపడనని చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్మీస్ ఎన్టీఅర్ చిత్రాన్ని ఏపీలో విడుదల చేయకుండా ఎందుకు అడ్డుపడుతున్నారని ధైర్యం ఉంటే విడుదల చేయాలనీ వైకాపా నాయకురాలు లక్ష్మీపార్వతి డిమాండ్ చేశారు. మంగళవారం విజయవాలోని వైకపా రాష్ట్ర కార్యాలయంలో ఆమె మాట్లాడారు. ఈ చిత్రం చూస్తె చంద్రబాబు నిజమైన ప్రవర్తన ప్రతి కార్యకర్తకు తెలుస్తుందని అన్నారు. సుప్రీం కోర్టు ద్వారా చిత్రం విడుదల చేయకుండా ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇందులో ఎటువంటి కల్పితాలు లేవన్నారు. వైకాపాకి ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తోందని పేర్కొన్నారు.
*టీ స్టాళ్ళలో జనసేన గ్లాసులు
ఎన్నికల ప్రచారం వేడెక్కింది. ఓట్ల వేటలో అభ్యర్ధుల తలమునకలై ఉన్నారు. జనసేన పార్టీ అభ్యర్ధులు తమ ఎన్నికల గుర్తును పరిచయం చేసేందుకు ఎ చిన్న అవకాశాన్ని వదులుకోవడంలేదు. జనసేన, చిహ్నం, పార్టీ అద్యక్షుడు పవన్, కళ్యాణ్ చిత్రాలు ముద్రించిన గ్లాసులను టీ దుకాణాలకు పంపిణీ చేశారు. కర్నూలు జిల్లా నంద్యాల, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని కంబాల చెరువు వద్ద టీ దుకాణాల్లో జనసేన టీ గ్లాసులు కనిపించాయి.
*అందుకే నేను పెళ్లి చేసుకోలేదు: మాయావతి
బహుజన్‌ సమాజ్‌ పార్టీ అధినేత్రి మాయావతి ఇంతవరకు వివాహం చేసుకోలేదు. అయితే ఆమె తన వ్యక్తిగత జీవితం గురించి బయటకు చెప్పడానికి దాదాపుగా ఇష్టపడరు. కానీ మంగళవారం సుప్రీం కోర్టు దాఖలు చేసిన అఫిడవిట్‌లో మాత్రం దీని గురించి ప్రస్తావించారు. అమె ఎందుకు వివాహానికి దూరంగా ఉన్నారో వివరించారు. మాయా యూపీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆమె విగ్రహాలు, బీఎస్పీ గుర్తయిన ఏనుగు విగ్రహాలను అక్కడక్కడా ఏర్పాటు చేశారు. అయితే వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ మయావతి తన విగ్రహాలు కట్టించుకున్నారని ఆరోపిస్తూ ఓ న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే దీనిపై మాయా స్పందిస్తూ కోర్టులో నేడు అఫిడవిట్‌ దాఖలు చేశారు.‘అధికారం చెలాయించే వారి చెర నుంచి ప్రజలకు విముక్తి కలిగించాలని నేను ఎన్నో ఏళ్ల కిందట నిర్ణయించుకున్నాను .వారి అభ్యున్నతి కోసం నాజీవితాన్ని త్యాగం చేశాను. అందుకే నేను పెళ్లి చేసుకోలేదు. నిరుపేదల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ఓ దళిత మహిళ గౌరవార్థం ప్రజలే విగ్రహాలు ఏర్పాటు చేయాలని కోరారు’ అని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
*తనయుడికి ములాయం రూ. 2.13 కోట్లు బాకీ!
సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్‌ తన కుమారుడు, పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌కు రూ. 2.13 కోట్లకు పైగా బాకీ పడ్డారు. గత ఐదేళ్లలో ములాయం ఆస్తులు రూ. 3.20 కోట్ల మేర తగ్గాయి. యూపీలోని మెయిన్‌పురి లోక్‌సభ స్థానానికి సోమవారం నామినేషన్‌ దాఖలు చేసిన ఆయన సమర్పించిన ప్రమాణపత్రం (అఫిడవిట్‌)లో పలు అంశాలను వెల్లడించారు. దీని ప్రకారం ములాయం స్థిర, చరాస్తుల విలువ రూ. 16.52 కోట్లు. ఆయనపై ఓ కేసు కూడా ఉంది. ములాయం, ఆయన భార్య సాధన యాదవ్‌ల వార్షికాదాయం వరుసగా రూ. 32.02 లక్షలు, రూ. 25.61 లక్షలుగా ప్రమాణపత్రంలో పేర్కొన్నారు. సాధనకు రూ. 5.06 కోట్ల ఆస్తులున్నాయి. ములాయంకు సొంతంగా కారు లేదు.
*ప్రధాని కావాలనే కోరిక లేదు
దేశంలో అనేక సమస్యలను వదిలేసి మోదీ… నేను జ్యోతిషం నమ్ముతానని చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. సర్పంచి స్థాయికి దిగజారి మాట్లాడడం ఎంతవరకు సబబు? అయినా నాకు ప్రధానమంత్రి కావాలని కోరిక లేదు. నేను మొదటి నుంచీ చెబుతున్నది ఒక్కటే.. ఎన్నికలు వచ్చాయంటే గెలవాల్సింది నాయకులు కాదు, ప్రజలు. ప్రజల ఆకాంక్షలు, అభీష్టం గెలవాలి. అందుకోసమే నేను పనిచేస్తున్నా.
*మాట నిలబెట్టుకుంటాం
ఏడాది క్రితం మేనిఫెస్టో రూపకల్పన ప్రక్రియ మొదలుపెట్టినప్పుడు నాలుగు గోడల మధ్య కాకుండా ప్రజలతో చర్చించి వారి ఆకాంక్షలకు స్థానం కల్పించాలని చిదంబరం, రాజీవ్‌గౌడలకు సూచించాను. ఈ రోజుల్లో ప్రధాని నోట ప్రతి రోజూ అబద్ధాలు వింటున్నాం. అలా కాకుండా మన మేనిఫెస్టోలో ప్రతిదీ వాస్తవంగా ఉండాలని, ఒక్క అబద్ధమూ ఉండరాదని స్పష్టంగా నిర్దేశించాను. మోదీ ఇదివరకు పేదల ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామన్నారు. అలాంటి అబద్ధాల జోలికి వెళ్లకుండా వాస్తవంగా ఎంత డబ్బు వేయగలమో పరిశోధించి చెప్పాలని సూచించాను. వాళ్లు రూ.72 వేలు వేయగలమని స్పష్టంచేశారు. అందుకే ‘గరీబీ పర్‌ వార్‌ 72 హజార్‌’.. ఇప్పుడు మా నినాదం అయింది.
*7 రోజులు 17 స్థానాలు
రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల ప్రచారం వేగం పుంజుకుంది.. సరిగ్గా మరో వారం రోజుల్లో ప్రచారం ముగియనుంది. ఎన్నికల కోసం అన్ని పార్టీలు తమ బలగాలను పూర్తి స్థాయిలో మోహరిస్తున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌, కేంద్రమంత్రులు, మంత్రులు, ఇతర ముఖ్యనేతల సభలు, సమావేశాలు పోటాపోటీగా సాగుతున్నాయి. చివరి వారం రోజులు అన్ని పార్టీలకు కీలకం కావడంతో ప్రచారం ఊపందుకుంది.
*కారు స్పీడుకు పార్టీల గల్లంతు
కారుకు…బేకారుకు మధ్య జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల బరిలో కారు స్పీడుకు పార్టీలన్నీ కొట్టుకుపోయి గల్లంతవ్వడం తథ్యమని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. మంగళవారం నాచారం హెచ్‌ఎంటీ నగర్‌ బస్సు కూడలి చౌరస్తాలో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడుతూ.. విద్యావేత్త అయిన తెరాస అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డిని ఆశీర్వదించాలని కోరారు. ప్రధాని మోదీ ఐదేళ్లలో తెలంగాణకు చేసింది శూన్యమన్నారు. ఏడు దశాబ్దాల కాంగ్రెస్‌, భాజపా పాలనపై ప్రజలు విరక్తి చెందారని చెప్పారు. ఉప్పల్‌ ప్రాంత అభివృద్ధిపై తెరాసకు స్పష్టమైన ప్రణాళిక ఉందని, రూ.1,400 కోట్లతో ఉప్పల్‌-నారపల్లి స్కైవే, శిల్పారామం, రోడ్డు వంతెన పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఉప్పల్‌ నియోజకవర్గంలోని 10,500 రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ పనులు మరో ఆర్నెల్లలో పూర్తిచేస్తామన్నారు. మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే బేతి సుభాశ్‌రెడ్డి, అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డిలు ప్రసంగించారు.
*మహానగరంలో మళ్లీ పాగా
లోక్‌సభ ఎన్నికల్లో రాజధాని మహానగరం తెరాసకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. గతంలో జీహెచ్‌ఎంసీ.. శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తెరాస ఇప్పుడు పార్లమెంటు పోరులోనూ పట్టు మరింత బిగించేలా వ్యూహాన్ని సిద్ధం చేసింది. సికింద్రాబాద్‌, మల్కాజిగిరి, చేవెళ్ల స్థానాల్లో భారీ విజయాలు నమోదు లక్ష్యంగా చేసుకొని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ప్రత్యేక కార్యాచరణతో రంగంలోకి దిగుతున్నారు.
*ఎన్నడూ సెలవు తీసుకోలేదు
ప్రజా సంక్షేమానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నానని ప్రధాని మోదీ అన్నారు. ఒడిశాలోని కలహండి జిల్లా ప్రధానకేంద్రం భవానీపట్నలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ ‘‘నాపై నమ్మకం ఉంచి మీరు పాలకునిగా దిల్లీలో కూర్చొపెట్టారు. ఈ అయిదేళ్ల కాలంలో మీ సేవకుడు ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు. విరామం లేని సేవలతో ఈ దేశాభివృద్ధికి అంకితమయ్యా’’ అని పేర్కొన్నారు.
*‘లోటస్‌’పాండ్‌లో గూడుపుఠాణి
ఏదైనా పండగ వస్తేనో.. ఎన్నికలు వస్తేనో.. మోదీకి తన తల్లి గుర్తుకొస్తారు. ఆమె దగ్గరకు వెళ్తారు. ఫొటోలకు ఫోజులిస్తారు. ఓట్లు వేయించుకుంటారు. తర్వాత ఆమె ముఖం కూడా చూడరు. దేశంలో మోదీ తల్లి లాంటి వృద్ధులెందరో కన్నబిడ్డలు పట్టించుకోకుండా, ఏ ఆసరా లేకుండా బతుకుతున్నారు. రాష్ట్రంలో అలాంటి వారందరికీ నేను పెద్ద కుమారుడిగా నెలకు రూ.2వేల పింఛను ఇస్తున్నా. భవిష్యత్తులో రూ.3వేలు ఇస్తా
*నా ఓటమికి వందకోట్ల వ్యయం
‘వారందరికీ బాధేంటంటే నేను ఎమ్మెల్యే కాకూడదని. ఎమ్మెల్యే అయితే వీడు మా తాట తీస్తాడనే భయంతో నన్ను ఓడించడానికి రూ.100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. మీరు ఎన్ని వందల కోట్లయినా ఖర్చుచేయండి. నేను అసెంబ్లీలో అడుగుపెట్టి తీరతా. ఇది నా ఛాలెంజ్‌. మార్పు తథ్యమ’ని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. మంగళవారం విశాఖ జిల్లా ఎలమంచిలి ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రభుత్వ, ప్రతిపక్ష నేతల తీరును ఎండగట్టారు.
*రాజకీయాలను భ్రష్టుపట్టించిన తెరాస
రాష్ట్రంలో తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాలను భ్రష్టుపట్టించిందని టీపీసీసీ అధ్యక్షుడు, నల్గొండ లోక్‌సభ స్థానం కాంగ్రెస్‌ అభ్యర్థి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజలు అసహ్యించుకునే స్థితికి రాజకీయాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిగజార్చారని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లు ఆత్మప్రబోధానుసారం ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.
*తెరాసలో టికెట్లు అమ్ముకునే సంస్కృతి
తెరాసలో టికెట్లను అమ్ముకునే సంస్కృతికి తెరలేపారని మహబూబ్‌నగర్‌ ఎంపీ జితేందర్‌రెడ్డి ఆరోపించారు. రూ.వందల కోట్లు ఇచ్చిన వారికే టికెట్లు ఇస్తున్నారని విమర్శించారు. మంగళవారం వనపర్తి జిల్లా కొత్తకోటలో మహబూబ్‌నగర్‌ భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ తరఫున రోడ్‌షోలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. పార్లమెంటులో తెలంగాణ వాదాన్ని వినిపించినందుకే కేసీఆర్‌ ఈ ఎన్నికల్లో తనకు అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ తీరులో తీవ్ర మార్పులు చోటు చేసుకున్నాయన్నారు.
*ఓట్ల కోసం భాజపా అసత్య ప్రచారం
లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల కోసం భాజపా అబద్ధాలను ప్రచారం చేస్తోందని నిజామాబాద్‌ ఎంపీ కవిత విమర్శించారు. అసత్యాలు చెబుతూ భారతీయ ఝూటా పార్టీగా పేరు పొందుతోందన్నారు. మంగళవారం నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో ఎన్నికల ప్రచార సభలో ఆమె ప్రసంగించారు. రాష్ట్ర సర్కారు 48 లక్షల మందికి ప్రతి నెలా ఆసరా పింఛన్లు అందిస్తూ ఏటా రూ.11 వేల కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. అందులో ఆరు లక్షల మందికి కేంద్ర ప్రభుత్వం నెలకు రూ.200 చొప్పున సామాజిక భద్రత పథకం కింద రూ.200 కోట్లు వెచ్చిస్తోందన్నారు. తాము ఇస్తున్న రూ.వెయ్యి పింఛనులో రూ.800 కేంద్రానివని చెప్పడం హాస్యాస్పదమన్నారు.
*భాజపావి విద్వేష రాజకీయాలు
పాకిస్థాన్‌ పేరు చెప్పి ఓట్లు అడుగుతున్న ప్రధాని నరేంద్ర మోదీని చిత్తుగా ఓడించాలని సీపీఎం పోలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారాట్‌ విజ్ఞప్తి చేశారు. నల్గొండలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో మోదీ విఫలమయ్యారని ఆరోపించారు. భాజపా, ఆరెస్సెస్‌ శ్రేణులు ప్రజల మధ్య విద్వేషాలు రగిలిస్తున్నాయని విమర్శించారు.
*మోదీ తెలంగాణకు చేసిందేమీ లేదు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణకు చేసిందేమీ లేదని, వాస్తవాలను కప్పిపుచ్చి, దిగజారి మాట్లాడుతున్నారని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అవినీతికి పుట్టినిల్లని, ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అవినీతి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని చెప్పారు. మంగళవారం తెలంగాణభవన్‌లో, ముషీరాబాద్‌ ఆర్యవైశ్య హాస్టల్‌ ట్రస్టు భవన్‌లో వేర్వేరుగా ఆయన విలేకరులతో మాట్లాడారు.
*కేంద్రానివి ఫాసిస్ట్‌ తరహా విధానాలు
కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ఫాసిస్ట్‌, మతోన్మాద, కార్పొరేట్‌ తరహాలో పని చేస్తోందని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శించారు. దేశంలో మైనార్టీలు, దళితులు అభద్రతా భావంతో బతుకుతున్నారని వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వం హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. మంగళవారం మహబూబాబాద్‌లో.. ఆ లోక్‌సభ నియోజకవర్గ సీపీఐ అభ్యర్థి కల్లూరి వెంకటేశ్వరరావు గెలుపు కోరుతూ ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో సురవరం మాట్లాడారు.
*నా తల్లి నేర్పిన సంస్కారం వల్లే
తన తల్లి నేర్పిన సంస్కారం వల్లే తాను ప్రధాని మోదీపై వ్యక్తిగత విమర్శలు చేయబోనని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ) అధినేత శరద్‌ పవార్‌ మంగళవారం వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర వార్ధాలో నిర్వహించిన బహిరంగ సభలో మోదీ సోమవారం పవార్‌పై విమర్శలు చేశారు. ‘‘పరిస్థితులు అనుకూలంగా లేవని గ్రహించడం వల్లే శరద్‌ పవార్‌ ఈసారి పోటీ చేయడం లేదు. సమీప బంధువు కారణంగా కుటుంబ తగాదాలతో ఎన్‌సీపీపై పవార్‌ పట్టు కోల్పోయారు.’’ అని మోదీ విమర్శించారు. దీనిపై శరద్‌ పవార్‌ స్పందించారు. కొల్హాపుర్‌లో నిర్వహించిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘‘మోదీ ఎక్కడికి వెళ్లినా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. నేను అలా చేయను. అది మన సంస్కృతి కాదు.’’ అని వ్యాఖ్యానించారు.
*ఉద్యమకారులకు టికెట్లివ్వకుండా అన్యాయం: దాసోజు శ్రవణ్‌
తెలంగాణ ద్రోహులు, భూ కబ్జాదారులు, రూ.కోట్లు ఇచ్చిన వారికే అధికార పార్టీ తెరాస ఎంపీ టికెట్లు ఇచ్చిందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన వారికి, మొదటి నుంచీ తెరాసలో కష్టపడి పనిచేసిన నేతలకు సీఎం కేసీఆర్‌ టికెట్‌ ఇవ్వకుండా అన్యాయం చేశారని విమర్శించారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో మాట్లాడారు. ఇప్పటికే 15 మంది ఎంపీలున్నా, తెరాస రాష్ట్ర విభజన హామీలు సాధించలేకపోయింది.. ఇప్పుడు 16 మంది ఎంపీలతో ఏం సాధిస్తుందని ప్రశ్నించారు. పలువురు తెరాస అభ్యర్థులపై వివిధ రకాల కేసులున్నా.. వాటిని అఫిడవిట్‌లో పేర్కొనలేదన్నారు. భూకబ్జాలపై ప్రభుత్వ ప్రధాని కార్యదర్శికి లేఖ రాసినా ఇప్పటివరకు దానిపై స్పందించలేదని చెప్పారు. పేదరిక నిర్మూలన కోసమే ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కనీస ఆదాయ పథకాన్ని మేనిఫెస్టోలో చేర్చారని తెలిపారు.
*జగన్‌తోనే రాజన్న పాలన: విజయమ్మ
జగన్‌ అధికారంలోకి వస్తేనే రాజశేఖరరెడ్డి పాలన తిరిగి వస్తుందని వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పేర్కొన్నారు. తెదేపా హయాంలో కుంభకోణాలు, అవినీతి తప్ప అభివృద్ధి జరగలేదన్నారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం, విజయనగరం జిల్లా తెర్లాంలలో ఆమె ప్రచారం నిర్వహించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.45 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. రాష్ట్రానికి హోదా ఇచ్చే ఏ పార్టీకైనా మద్దతిస్తామని, రాష్ట్రంలో 25 ఎంపీ స్థానాల్లో వైకాపా అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రైతుల బాధలు తెలిసిన రాజశేఖరరెడ్డి కుమారుడిగా మీ ముందుకు జగన్‌ వచ్చారని, మీరంతా ఆశీర్వదించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
*తెదేపా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేదు: రాంమాధవ్‌
రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను తెదేపా ప్రభుత్వం వమ్ము చేసింది.. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పనిచేయలేదని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ ఆరోపించారు. నవ్యాంధ్ర రాజధాని, పోలవరం నిర్మాణాలకు కేంద్రం ఆర్థిక సాయం చేసిందని.. వాటితో కనీసం రాజధానికి ఒక్క అప్రోచ్‌ రోడ్డు కూడా వేయలేదని, ఒక్క శాశ్వత భవనం నిర్మించలేదని ఆయన విమర్శించారు. మంగళవారం ఆయన గుంటూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఐదేళ్ల తెదేపా పాలనలో ప్రజలకు ఒరిగింది శూన్యమన్నారు.
*వికారాబాద్‌కు అగ్రనేతలు
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపీయే ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ ఈ నెల 8న వికారాబాద్‌ జిల్లా మన్నెగూడలో నిర్వహించే సమావేశానికి హాజరు కానున్నారని కాంగ్రెస్‌ నాయకులు తెలిపారు. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అదే రోజున ముఖ్యమంత్రి కేసీఆర్‌ వికారాబాద్‌ పట్టణానికి దగ్గరలో ఉన్న కొత్రేపల్లి వద్ద భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. భాజపా తరఫున ప్రచారం చేసేందుకు ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ వస్తున్నారని ఆ పార్టీ నాయకులు తెలిపారు. ఈ నెల 5న వికారాబాద్‌లో నిర్వహించే బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
*వైకాపా వ్యాజ్యం ధర్మాసనానికి బదిలీ
నిఘా విభాగం డీజీ బాధ్యతల నుంచి ఏబీ వెంకటేశ్వరరావును ఎన్నికల సంఘం.. బదిలీ చేసినా నిఘా విభాగం (ఇంటెలిజెన్స్‌) అధికారులు ఇప్పటికీ ఆయనకే రిపోర్ట్‌ చేస్తున్నారని ఆరోపిస్తూ వైకాపా ప్రధాన కార్యదర్శి ఎం.వీ.ఎస్‌.నాగిరెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యం ధర్మాసనం ముందుకు బదిలీ అయ్యింది. మంగళవారం ఈ వ్యాజ్యం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.విజయలక్ష్మి వద్దకు విచారణకు రాగా ధర్మాసనం వద్దకు బదిలీ చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించారు. వెంకటేశ్వరరావుకు అధికారులు రిపోర్టు చేయకుండా తగిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని పిటిషనర్‌ అభ్యర్థించిన విషయం తెలిసిందే.
*జగన్‌తోనే రాజన్న పాలన: విజయమ్మ
జగన్‌ అధికారంలోకి వస్తేనే రాజశేఖరరెడ్డి పాలన తిరిగి వస్తుందని వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పేర్కొన్నారు. తెదేపా హయాంలో కుంభకోణాలు, అవినీతి తప్ప అభివృద్ధి జరగలేదన్నారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం, విజయనగరం జిల్లా తెర్లాంలలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.45 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించారు.
*ధైర్యం ఉంటే ఆ చిత్రాన్ని విడుదల చేయండి: లక్ష్మీపార్వతి
బాంబులకు, ప్రధానమంత్రి నరేంద్రమోదీకి భయపడనని చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబు..‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రాన్ని ఏపీలో విడుదల చేయకుండా ఎందుకు అడ్డుపడుతున్నారని.. ధైర్యం ఉంటే విడుదల చేయాలని వైకాపా నాయకురాలు లక్ష్మీపార్వతి డిమాండ్‌ చేశారు. మంగళవారం విజయవాడలోని వైకాపా రాష్ట్ర కార్యాలయంలో ఆమె మాట్లాడారు.
*అసెంబ్లీకి రాని వారికి జీతాలెందుకు?: అయ్యన్న
అసెంబ్లీకి హాజరుకాని వైకాపా ఎమ్మెల్యేలు జీతాలు మాత్రం తీసుకుంటున్నారని నర్సీపట్నం నియోజకవర్గ తెదేపా అభ్యర్థి అయ్యన్నపాత్రుడు విమర్శించారు. మంగళవారం విశాఖపట్నం జిల్లా నాతవరం మండలం వెదురుపల్లి, గుమ్ముడుగొండ, మాధవనగరం గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. జైలుజీవితం గడిపిన వ్యక్తి నిజాయతీ కబుర్లు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు
*ఆర్‌.కృష్ణయ్యను జాతీయ అధ్యక్షుడిగా గుర్తించడం లేదు: కేసన
పార్టీలకు అతీతంగా బీసీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాల్సింది పోయి ఆర్‌.కృష్ణయ్య ఒక పార్టీకి కొమ్ముకాయటం సరైంది కాదని, జాతీయ అధ్యక్షుడిగా ఆయనను తాము గుర్తించటం లేదని ఆంధ్రప్రదేశ్‌ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకరరావు తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలిలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. పార్టీలకు అతీతంగా బీసీ అభ్యర్థులు పోటీ ఉన్నచోట వారికే మద్దతు తెలపాలని బీసీలకు పిలుపునిచ్చారు.
*అసెంబ్లీకి వెళ్లింది 24 సార్లే.. కేసులు 31
ప్రతిపక్ష నేత జగన్‌ 31 కేసులున్న నేరస్తుడని కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు వ్యాఖ్యానించారు. 240 సార్లు న్యాయస్థానానికి వెళ్లిన ఆయన ఎమ్మెల్యేగా ఐదేళ్లలో 24 సార్లే శాసనసభకు హాజరయ్యారని చెప్పారు. విజయనగరంలోని గాజులరేగలో మంగళవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. వైకాపాలో 60 శాతం మంది అసెంబ్లీ, 50 శాతం మంది పార్లమెంటు అభ్యర్థులపై క్రిమినల్‌ రికార్డులున్నాయని ఆరోపించారు. ఇలాంటి దొంగల ముఠాను అధికారంలోకి తెస్తే బాగు పడగలమా? మీరే ఆలోచించాలని ప్రజలకు సూచించారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి రావాల్సిన వోక్స్‌వ్యాగన్‌ మహారాష్ట్రకు వెళ్లి పోయిందన్నారు.
*సీఎం పదవేమన్నా సినిమా అవకాశమా?
తల్లి, చెల్లి అడగ్గానే ఇవ్వడానికి ముఖ్యమంత్రి పదవేమీ సినిమా అవకాశం కాదని ఆర్టీసీ ఛైర్మన్‌ వర్లరామయ్య అన్నారు. జగన్‌కు అవకాశం ఇవ్వడమంటే కడివెడు పాలల్లో విషపు చుక్క వేసినట్లేనన్నారు. అవినీతిలో అగ్రగణ్యుడు జగన్‌కు అవకాశమిస్తే రాష్ట్రం అథోగతి పాలవుతుందని చెప్పారు. ఉండవల్లిలోని ప్రజావేదిక వద్ద మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
*పసుపు-కుంకుమ’ను అడ్డుకుంటే మహిళల ఆగ్రహానికి గురికాక తప్పదు: యామిని
‘పసుపు-కుంకుమ’ కార్యక్రమాన్ని అడ్డుకుంటే వైకాపా నేతలు మహిళల ఆగ్రహానికి గురికాక తప్పదని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి యామినీ శర్మ హెచ్చరించారు. ‘పసుపు-కుంకుమ’ తుడిచే ఆ పార్టీ నాయకులకు దాని విలువ ఏం తెలుస్తుందని మండిపడ్డారు. గుంటూరులోని తెదేపా రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆమె మాట్లాడారు. ఈ పథకాన్ని అడ్డుకునేందుకు గుంటూరుకు చెందిన బూరగడ్డ అనిల్‌తో కోర్టులో కేసులు వేయించారని విమర్శించారు.