BusinessNRI-NRT

ఖండాంతరాలు దాటిన బావర్చి రుచులు – ఆస్ట్రేలియాలో తొలిశాఖ

bawarchi biryanis in australia


అమెరికా కెనడా దేశాల్లో అద్భుతమైన బిర్యానీలు, భారతీయ వంటకాలకు పెట్టింది పేరైన బావర్చి బిరియానీస్ సంస్థ ఉత్తర అమెరికా ఖండాన్ని దాటుకుని మంగళవారం నాడు ఆస్ట్రేలియా దేశంలోని విక్టోరియా నగరంలో తమ తొలిశాఖను ఏర్పాటు చేసింది. తమ సంస్థ పట్ల, తాము అందించే రుచుల పట్ల వినియోగదారులకు ఉన్న చెరగని నమ్మకాన్ని తాము కాపాడుకుంటున్నామని, అందుకే ఇటువంటి విజయాలు అందుకోగలుగుతున్నామని బావర్చి బిర్యానీస్ వ్యవస్థాపకులు కంచర్ల కిషోర్ తెలిపారు.