‘జీతాలు పెంచండని గళమెత్తిన హోంగార్డులు, అంగన్‌వాడీ, ఆశావర్కర్లను టీడీపీ సర్కార్ అరెస్టులు చేయించింది. ఎన్నికలకు 6 నెలల ముందు నామమాత్రంగా జీతాలు పెంచి మరోసారి మోసం చేయాలని చూస్తోంది. కనీసం పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఇచ్చే జీతాలన్న ఇవ్వడం లేదు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ మెరుగైన జీతాలిస్తాం.. తెలంగాణలో కంటే వెయ్యి రూపాయలు ఎక్కువే అందిస్తాం. ఆర్టీసీలో పనిచేస్తున్న 65 వేలమంది కార్మిక సోదరులను ప్రభుత్వంలో విలీనం చేస్తాం’అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హామినిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ జగన్ జిల్లాలోని కళ్యాణదుర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు.
పక్కరాష్ట్రాల కన్నా ఎక్కువ జీతాలు ఇస్తాం
Related tags :