Business

మజ్జారే జెట్‌కు ఎన్ని కష్టాలు!

jet air down

రుణ సంక్షోభంలో చిక్కుకుపోయిన జెట్‌ ఎయిర్‌వేస్‌కు యాజమాన్యం మారినా సంస్థ పరిస్థితి మాత్రం ఇంకా మెరుగుపడట్లేదు. ఒకప్పుడు 100కు పైగా విమానాలు నడిపిన ‘జెట్‌’.. ఇప్పుడు కనీసం 15 విమానాలు కూడా నడపలేకపోతోంది. జెట్‌ ఎయిర్‌వేస్‌ తాజా పరిస్థితిపై పౌర విమానయాన శాఖ సెక్రటరీ పీఎస్‌ ఖరోలా బుధవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జెట్‌ వద్ద ప్రస్తుతం ఎన్ని విమానాలు అందుబాటులో ఉన్నాయని అడగగా.. ‘నిన్నటి వరకు 28 విమానాలను జెట్‌ నడిపింది. మంగళవారం సాయంత్రం స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు అందించిన సమాచారం ప్రకారం.. మరో 15 విమానాలను నిలిపివేసింది. అంటే ప్రస్తుత విమానాల సంఖ్య 15 కంటే తక్కువే ఉండొచ్చు’ అని ఖరోలా వెల్లడించారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ విమనాలు నడిపే అర్హత జెట్‌ ఎయిర్‌వేస్‌కు ఉందా లేదా అన్న అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.