Movies

వెనక్కి తిరిగి చూసుకునే తీరిక లేదు

kajal is very busy

దాదాపు అగ్ర కథానాయకులందరితోనూ నటించేసింది కాజల్‌. నెంబర్‌ గేమ్‌లో ఎప్పుడూ ముందుండే కాజల్‌ ఇప్పుడిప్పుడే నాయికా ప్రాధాన్యం ఉన్న కథలవైపు దృష్టి పెడుతోంది. ‘‘నా కెరీర్‌ చాలా సంతృప్తిగా గడిచింది. తొలి సినిమాతోనే అగ్ర దర్శకులు, కథా నాయకుల దృష్టిలో పడడం నా అదృష్టం. వాళ్లతో పనిచేయడం వల్లే త్వరగా ఎదిగాను. ‘పరిశ్రమలో నేను ఇమడగలనా’ అనే భయాలెప్పుడూ కలగలేదు. ఎందుకంటే.. నిజంగానే నాకు అంత సమయం లేకుండా పోయింది. కొన్ని రోజులు తీరిగ్గా కూర్చుని నా సినీ జీవితంపై సమీక్షించుకునే అవకాశమే కలగలేదు. మంచో, చెడో నేను తీసుకున్న నిర్ణయాలు ఫలితాన్ని ఇచ్చాయి. లెక్కలేవీ వేసుకోకుండా కొన్ని సినిమాలు ఒప్పుకున్నాను. అవి కూడా నన్ను నటిగా నిలబెట్టాయి. ఇప్పుడు ఆ పేరునీ, స్టార్‌డమ్‌నీ నిలబెట్టుకోవాలి. ఇదివరకటి కంటే ఇప్పుడే ఎక్కువ ఒత్తిడి ఉంది. అనుభవం వల్లే ఆ ఒత్తిడిని దాటుకుని రాగలుగుతున్నా’’ అంది. తను నటించిన ‘సీత’ ఈ నెలలోనే విడుదల కానుంది.