DailyDose

వడ్డీ రెట్లు తగ్గించిన ఆర్బీఐ-వాణిజ్య-04/04

rbi reduces interest rates

????????????☘?????????☘???????????????☘????????????
*ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అద్యక్షతన మూడు రోజుల పాటు సమావేశమైన మానిటరీ పాలసీ కమిటీ తాజాగా రేపో రేటులో పావు శాతం కోతను ప్రకటించింది. దీంతో వడ్డీ రేట్లను కీలకమైన రేపో రేటు ఏడాది తరువాత మళ్ళీ ఆరు శాతానికి రేపో రేటు అమలవుతోంది. ఇందుకు ఎంపీసి 4:2వోటింగ్ తో నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఎంఎస్ఎఫ్తో పాటు.. బ్యాంకు రేటును 6.5 శాతం నుంచి 6.25 శాతానికి ఎంపీసీ సవరించింది. అంతే కాకుండా బ్యాంకులు స్వల్పకాలిక నిధులను రిజర్వు బ్యాంక్ వద్ద డిపాజిట్ చేస్తే లభించే రివర్స్ రేపో రేటు సైతం ఆరు శాతం నుంచి 5.75 శాతానికి పరిమితం కానుంది.
*ఈ ఏడాది వర్షపాతం సాధారణ స్థాయి కంటే తక్కువగా నమోదు కావచ్చన్న వాతావరణ సంస్థ స్కైమెట్‌ అంచనాలు మార్కెట్‌ను నష్టాల్లో ముంచాయి. రికార్డు గరిష్ఠ స్థాయిల నుంచి కిందకు వచ్చేలా చేశాయి. రోజులో సెన్సెక్స్‌ దాదాపు 450 పాయింట్ల మధ్య ఊగిసలాడింది.
*కృత్రిమ మేధ సంస్థ హాప్టిక్‌ను రూ.700 కోట్లకు స్వాధీనం చేసుకున్నట్లు రిలయన్స్‌ జియో ప్రకటించింది. హాప్టిక్‌లో 87 శాతం వాటా జియో కొనుగోలు చేయగా, మిగిలిన వాటా హాప్టిక్‌ వ్యవస్థాపకులు, స్టాక్‌ ఆప్షన్‌ ద్వారా వాటాలు పొందిన ఉద్యోగుల వద్ద ఉంది.
*జాన్సన్‌ కంట్రోల్స్‌ బ్యాటరీ గ్రూప్‌, గల్లా ఫ్యామిలీ జాన్సన్‌ కంట్రోల్స్‌ (మారిషష్‌)ల మధ్య కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు అమర రాజా బ్యాటరీస్‌ ఎక్స్ఛేంజీలకు సమాచారం ఇచ్చింది.
*దేశీయంగా రియల్‌మి స్మార్ట్‌ఫోన్ల రిటైల్‌ విక్రయాలు ఈ ఏడాదిలో 150 నగరాల్లో అందుబాటులోకి రానున్నాయి. రియల్‌మి ఇండియా ఆఫ్‌లైన్‌ సేల్స్‌ హెడ్‌ దినేష్‌ పునామియా సంస్థ విస్తరణ ప్రణాళికలను బుధవారం ఇక్కడ వెల్లడించారు.
*భారత వృద్ధి అంచనాల్లో ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏడీబీ) కోత విధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20)లో వృద్ధి 7.2 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. ఇంతకు ముందు ఇది 7.6 శాతం ఉండటం గమనార్హం.
*రుణ స్వీకర్తలు సమయానికి అప్పులు తీర్చేలా ప్రభుత్వం, ఆర్‌బీఐలు కలిసి కొత్త నియమావళిని తీసుకురావాల్సి ఉందని నీతిఆయోగ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అమితాబ్‌ కాంత్‌ పేర్కొన్నారు. ఫిబ్రవరి 12, 2018 నాటి ఆర్‌బీఐ సర్క్యులర్‌ను కొట్టివేస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో కాంత్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.
*వాల్‌మార్ట్‌ ఆధీనంలోని ఫ్లిప్‌కార్ట్‌లో ఉద్యోగం చేయాలన్న ఆసక్తిని భారత్‌లో అధికులు వ్యక్తం చేస్తున్నారని వృత్తి నైపుణ్యాల సామాజిక మాధ్యమ సంస్థ లింక్డ్‌ఇన్‌ తెలిపింది. తరవాత స్థానాల్లో అమెజాన్‌ ఇండియా, ఓయో ఉన్నాయని వెల్లడించింది. ‘2019కి సంబంధించి దేశీయ కంపెనీల’తో రూపొందించిన జాబితా తొలి 10 స్థానాల్లో ఇంటర్నెట్‌ కంపెనీల ఆధిపత్యం ఉంది.
*ఐరోపా వాహన దిగ్గజం గ్రూప్‌ పీఎస్‌ఏ దేశీయ విపణిలోకి సిట్రోయెన్‌ బ్రాండ్‌ను ప్రవేశ పెడుతున్నట్లు బుధవారం ప్రకటించింది. వచ్చే ఏడాది స్పోర్ట్స్‌ వినియోగ వాహనం (ఎస్‌యూవీ) సీ5 ఎయిర్‌క్రాస్‌తో ప్రారంభించి, నాలుగేళ్లలో 4 మోడళ్లు విడుదల చేస్తామని గ్రూప్‌ పీఎస్‌ఏ ఛైర్మన్‌ కార్లోస్‌ తవారెస్‌ ఇక్కడ తెలిపారు.
*గడిచిన దశాబ్ద కాలంలో 2018-19 ఆర్థిక సంవత్సరంలో వాహన రంగం తీవ్ర గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంది. కొత్త ఆర్థిక సంవత్సరంలోనూ ఇది కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
*జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానాలు ప్రస్తుతం 28 మాత్రమే సేవలందిస్తున్నాయని, అందులో 15 దేశీయ మార్గాల్లో నడుస్తున్నాయని పౌర విమానయాన కార్యదర్శి ప్రదీప్‌సింగ్‌ ఖరోలా బుధవారం తెలిపారు.