బరువు తగ్గడంతో పాటు ఆరోగ్యంగా ఉండేందుకు చాలామంది ప్రత్యేకమైన ఆహారపు అలవాట్లను పాటిస్తున్నారు. వాటిల్లో ప్రొటీన్లు ఎక్కువగా ఉండి, కార్బొహైడ్రేట్లు తక్కువగా ఉండే కీటో డైట్‌ను ఎక్కువ మంది ఎంచుకుంటున్నారు. అయితే ఈ కీటో డైట్ ఆరోగ్యానికి అంత మంచిది కాదని, దీనివల్ల రక్తనాళాలు దెబ్బతింటాయని కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. తమ పరిశోధనలో భాగంగా పలువురికి అధిక ప్రొటీన్లు, తక్కువ కార్బొహైడ్రేట్లు గల ఆహారం తీసుకునే ముందు, తర్వాత 75 గ్రాముల గ్లూకోజ్ కలిగిన పానీయాన్ని అందించారు. వారం తర్వాత వారిని పరిశీలించగా, ఆకస్మిక గ్లూకోజ్‌తో రక్తనాళాలు పేరుకుపోయినట్లు గుర్తించారు
కీటో డైట్ ఆరోగ్యానికి అంత మంచిది కాదు
Related tags :