DailyDose

టిక్‌టాక్ యాప్‌పై నిషేధం–తాజావార్తలు–04/04

tik tok banned by madras high court

*టిక్ టాక్ ఈ యాప్ తెలియని వారుండరు. యువతలో దీనికి మంచి కేజీ ఉంది. వాట్సాప్ లో స్టేటస్ లు.. పేస్ బుక్ లో పోస్టింగులతో… ఇలా ఎక్కడ చూసినా టిక్ టాక్ వీడియోలే. అయితే వీటి వల్ల అశ్లీలత, ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని.. దీన్ని నిషేధించాలని ఇప్పటికే పలువురు కేసులు కూడా నమోదు చేశారు. అయితే తాజాగా మద్రాసు హైకోర్టు కూడా టిక్ టాక్ నిషేదిన్చేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కాగా ఇటీవలే తమిళనాడు పార్లమెంటులో ఈ టిక్ టాక్ పై పెద్ద చర్చే నడిచింది. చాలా మంది వీటి వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ముత్తు కుమార్ తమిళనాడు అసెంబ్లీలో టిక్ టాక్ రద్దు అంశాని లేవనెత్తారు. దీని పై స్పీకర్ కూడా సానుకూలంగా స్పందించి త్వరలోనే దీనిపై కేంద్రంతో మాట్లాడతామని తెలిపారు.
* కర్ణాటక మాజీ చీఫ్‌ సెక్రటరీ రత్నప్రభ బీజేపీలో చేరారు. బుధవారం కలబుర్గిలో జరిగిన ర్యాలీలో ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప ఆమెకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రిటైర్మెంట్‌ తర్వాత ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాలు మంచి మార్గమని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నానని, ప్రధాని చేస్తున్న మంచి పనులే తనను బీజేపీలో చేరేలా చేశాయని ఆమె తెలిపారు.
* ఉస్మానియా మెడికల్ కాలేజ్ HOD బాలాజీ ఇంటి ఫై ఏసీబీ సోదాలు అంబర్ పెట్ డీడీ కాలనీ లో బాలాజీ నివాసం లో కొనసాగుతున్న సోదాలు భారీ గా బయటపడ్తున్న అక్రమ ఆస్తులు
* టీవీ చానళ్లలో ‘ప్రాంక్‌ షో’ల ప్రసారాన్ని నిషేధిస్తూ మద్రాసు హైకోర్టు మదురై బెంచ్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయవాది ముత్తుకుమార్‌ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారించిన ద్విసభ్య ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. చైనాకి చెందిన ‘టిక్‌టాక్‌’ యాప్‌ను ఆండ్రాయిడ్‌ సెల్‌ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకొని ఇతరుల్లాగే డబ్బింగ్‌ చేసి, ఇంటర్నెట్‌లో ప్రసారం చేయడం అలవాటుగా మారిందని, ఈ వీడియోల వల్ల ఘర్షణలు జరిగే ప్రమాదమే ఎక్కువగా ఉందని పిటిషనర్‌ పేర్కొన్నారు. ప్రాంక్‌ షోలను భారత్‌లో నిషేధించాలని కోరారు. దీనిపై స్పందించిన మదురై బెంచ్‌.. ‘టిక్‌ టాక్‌’ యాప్‌ నిషేధానికి చేపట్టిన చర్యలపై నివేదిక సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
* ఈనెల 5, 6 తేదీలలో నిమ్స్‌ ఆస్పత్రికి సెలవు ప్రకటించారు.7వ తేదీ ఆదివారం కావడంతో వరుసగా మూడు రోజుల పాటు ఓపీ సేవలు ఉండవని నిమ్స్‌ అధికారులు ప్రకటించారు. 5న బాబు జగ్జీవన్‌రామ్‌ జయంతి, 6న ఉగాది, 7వ తేదీ ఆదివారం కావటంతో వరుస సెలవులు వచ్చాయని, సోమవారం నుంచి యథావిధిగా సేవలు అందుతాయని నిమ్స్‌ అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ లక్ష్మీభాస్కర్‌ తెలిపారు.
* గుంటూరు జిల్లాముపాళ్ల మండలం గోళ్ళపాడు గ్రామ సరిహద్దు సేఫ్ కంపెనీ వద్ద రోడ్డు ప్రమాదం
సతైనపల్లి వైపు ఆటోను వెనకనుండి ఢీకొన్న కారు ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి
* గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం లింగంగుంట్ల లో భారీ మద్యం డంప్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికలలో ఓటరు కు పంపిణీ నిమిత్తం పోలంలో అక్రమంగా నిల్వవుంచిన (34)కేసులు సుమారుగా 1700 బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. లింగంగుంట్ల కు చెందిన ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
*యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) తమ దేశ అత్యున్నత పౌర పురస్కారం జాయెద్ మెడల్‌తో ప్రధాని మోదీని సత్కరించాలని నిర్ణయించింది. ఆ దేశ అధ్యక్షుడు ఖలీఫా బిన్ జాయెద్ బిన్ సుల్తాన్ ఈ అవార్డును మోదీకి ఇస్తున్నట్లు ప్రకటించారు. వివిధ దేశాల అధ్యక్షులు, రాజులు, దేశాధినేతలకు ఈ అవార్డు ఇస్తారు. ఇండియా, యూఏఈ మధ్య సంబంధాలను బలోపేతం చేసిన కారణంగా మోదీకి ఈ అవార్డు ఇస్తున్నట్లు ఆ దేశం వెల్లడించింది. రెండు దేశాల మధ్య చారిత్రక, వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయి. వాటిని మోదీ మరోసారి బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషించారు. అందుకే ఆయను యూఏఈ అత్యున్నత పురస్కారం జాయెద్ మెడల్ ఇవ్వాలని అధ్యక్షుడు నిర్ణయించారు అని క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ అబుదాబి షేక్ మహ్మద్ బిన్ జాయెద్ ట్వీట్ చేశారు.
*ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ రూ. 100 కోట్లు జరిమానా విధించింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం సమీపంలో కృష్ణా నది వద్ద జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని వాటర్‌మ్యాన్‌ రాజేంద్రసింగ్‌, అనుమోలు గాంధీ నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో పిటిషన్‌ వేశారు. పిటిషన్‌ను విచారించిన ఎన్జీటీ.. ఏపీ ప్రభుత్వానికి రూ. 100 కోట్లు జరిమానా విధించింది. రోజుకు 2,500 ట్రక్కుల్లో 25 మీటర్ల లోతు వరకు అక్రమంగా ఇసుక తవ్వుతున్నారని ఎన్జీటీకి కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నివేదిక ఇచ్చింది.
*రంగారెడ్డి జిల్లాలోని పుప్పాలగూడ పంచాయతీ కార్యదర్శులు,ఎంపీటీసీ సభ్యులు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. రూ.2లక్షలు లంచ తీసుకుంటుండగా అవినీతి నిరోదక శాఖ అధికారులు పట్టుకున్నారు. భవన నిర్మాణ అనుమతుల కోసం ఎంపీటీసీ శివప్రసాద్, పంచాయతీ కార్యదర్శి శివయ్యలు లంచం డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు ఈ రోజు లంచం తీసుకుంటుండగా వీరిద్దరితో పాటు మరో కార్యదర్శిని అదుపులోకి తీసుకున్నారు. లంచం ఇవ్వడం, లంచం తీసుకోవడం నేరమని ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే తమకు సమాచారం ఇవ్వాలని ఏసీబీ అధికారులు సూచించారు.
*ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కాంకేర్‌లో భద్రతా బలగాలు, మవోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల్లో నలుగురు బీఎస్‌ఎఫ్ జవాన్లు మృతి చెందగా, మరో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన హెలికాప్టర్‌లో ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.
*రాజ్యంగ్ బద్దంగా సంక్రమించిన ఓటుహక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకునేందుకు వీలుగా ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పోలింగ్ సమయాన్ని గంట పొడిగించింది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఉదయం ఏడింటి నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరిపారు. ఈసారి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరింటి వరకు దాన్ని నిర్వహించనున్నారు.
*పడవ తరగతి పబ్లిక్ పరీక్షలు బుధవారంతో ముగిశాయి. మే నెల మొదటి వారంలో ఫలితాలు విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రస్నాపత్రాల మూల్యంకనం వేగవంతంగా కొనసాగుతోంది. మార్చి 18 నుంచి ప్రారంభమైన ఈ పరీక్షలకు 6,23,649 మంది హాజరయ్యారు. పరీక్షల సమయంలో విధుల్లో నిర్లక్ష్యం వహించిన 21 మందిని సస్పెండ్ చేయగా 68 మందిని పరీక్షల బాద్యతల నుంచి తప్పించారు.
*ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌మార్కెట్లు ప్రస్తుతం ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి. ఒంటిగంట సమయానికి సెన్సెక్స్‌ 2, నిఫ్టీ 2 పాయింట్ల లాభంతో ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 68.85గా ఉంది.
*రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నేడు 2019-20 ఆర్థిక సంవత్సరానికి ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ప్రకటించింది. రెపోరేటును 25 బేసిస్‌ పాయింట్లు తగ్గించినట్లు వెల్లడించింది. అంటే ప్రస్తుతం ఉన్న రెపోరేటు 6.25శాతం నుంచి 6 శాతానికి దిగి రానుంది. మిగిలిన అంశాలు యథాతథంగా కొనసాగించాలని మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయించింది. ప్రస్తుత నిర్ణయంతో బ్యాంకులకు చౌకగా రుణాలు లభ్యమవుతాయి. దీంతో రివర్స్‌ రెపో రేటు 5.75శాతంగా ఉండనుంది.
*ఈ ఏడాది రుతుపవన వర్షాలు సాధారణ స్థాయి కన్నా తగ్గవచ్చని ప్రైవేటు వాతావరణ పరిశోధన సంస్థ స్కైమెట్‌ తెలిపింది. దీర్ఘకాల సగటు వర్షపాతం 93శాతంగా ఉండవచ్చని అంచనా వేసింది.పసిఫిక్‌ మహా సముద్రంలో నెలకొన్న అధిక ఉష్ణోగ్రతలు ఎల్‌ నినోకు కారణమవుతున్నాయని, దీని ప్రభావం మార్చి-మే నెలల మధ్య 80శాతంగా ఉండి జూన్‌-ఆగస్టుల మధ్య 60శాతానికి తగ్గవచ్చని సీఈవో జతిన్‌ సింగ్‌ వెల్లడించారు.
*తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల పోలింగ్‌కు ముందే ఇంటర్‌ విద్యార్థుల భవితవ్యం వెల్లడి కానుంది. ఏప్రిల్‌ 8న ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థుల ఫలితాలు ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏదైనా అనివార్య ఆటంకాలు వస్తే 9న వెల్లడించనున్నారు.
*దేశంలో ఎన్నికల వాతావ‘రణం’, కేంద్ర ప్రభుత్వం హెచ్చరికల నేపథ్యంలో ‘వాట్సాప్‌’ బుధవారం ఓ కీలక ఆప్షన్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఇకపై ఏదైనా గ్రూప్‌లో ఎవరి పేరు చేర్చాలన్నా వారి అనుమతి అవసరం.
*రాష్ట్రంలో ప్రస్తుత వేసవిలో వడగాడ్పులు వీచే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ కేంద్రం(ఐఎండీ) పేర్కొంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రతల కన్నా 0.5 నుంచి 1 డిగ్రీ సెల్సియస్‌ వరకు పెరుగుదల నమోదవుతుందని సూచించింది. దేశవ్యాప్తంగా 44 శాతం గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే రాష్ట్రాల్లో తెలంగాణ ఉన్నట్లు తెలిపింది. ఏప్రిల్‌ నుంచి జూన్‌ మధ్య అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే రాష్ట్రాలను కోర్‌ హీట్‌ వేవ్‌ జోన్‌ కింద చేర్చుతూ అవుట్‌లుక్‌ పేరుతో బుధవారం ఒక నివేదికను విడుదల చేసింది.
*యాసంగి (రబీ) ధాన్యం కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సన్నద్ధమైంది. ఈసారి 40లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని సర్కారు ప్రణాళికలు రూపొందించింది. రాష్ట్రవ్యాప్తంగా 3,675 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
*నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేసి కొనుగోలుదారుకు అప్పగించని పక్షంలో ఒప్పందంలో లేకపోయినప్పటికీ అద్దె రూపంలో పరిహారం చెల్లించాల్సిందేనంటూ తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ స్పష్టం చేసింది.
*శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి రాజమండ్రికి వెళ్లేందుకు టేకాఫ్‌ తీసుకుంటున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. భారీ మరమ్మతులు అవసరమని తేల్చడంతో దానిని అర్ధంతరంగా రద్దు చేశారు.
*శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి రాజమండ్రికి వెళ్లేందుకు టేకాఫ్‌ తీసుకుంటున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. భారీ మరమ్మతులు అవసరమని తేల్చడంతో దానిని అర్ధంతరంగా రద్దు చేశారు.
*ఇంటర్నేషనల్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇరిగేషన్‌-డ్రైనేజ్‌(ఐసీఐడీ)-2019 నిర్వహిస్తున్న సదస్సుకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్లు నాలుగు ప్రాజెక్టులపై పంపిన పత్రాలు ఆ సంస్థ పరిశీలనలో (స్క్రూట్నీ) ఎంపికయినట్లు నీటిపారుదల శాఖ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో వివరించింది.
*మేడ్చల్‌ జిల్లా ప్రగతినగర్‌లోని ప్రగతి విద్యానికేతన్‌లో 2019-20 విద్యాసంవత్సరానికి ఉచిత ప్రవేశాల కోసం దరఖాస్తులు కోరుతున్నామని విద్యావేత్త చుక్కా రామయ్య తెలిపారు. సుందరయ్య కళానిలయంలో బుధవారం తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య (టీఎస్‌యూటీఎఫ్‌), పీపుల్స్‌ ప్రోగ్రెస్‌ ట్రస్ట్‌ సంయుక్తంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
*ఆంధ్రప్రదేశ్‌లో పసుపు-కుంకుమ మూడో విడత నిధుల విడుదలకు భారత ఎన్నికల సంఘం అనుమతినిచ్చింది. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నందున వీటి విడుదలపై ఎలాంటి ప్రచారమూ చేయరాదని షరతు విధించింది.
*మహబూబాబాద్‌లో ఎన్నికల ప్రచారం ముగించుకుని హైదరాబాద్‌ వెళ్తున్న సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.
*లోక్‌సభ ఎన్నికల నియామావళి అమల్లో ఉండటంతో ఈ ఏడాది జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవాన్ని నిర్వహించకూడదని కేంద్రం పంచాయతీరాజ్‌ శాఖ తాజాగా నిర్ణయించింది. ఉత్తమ ప్రతిభ కనబర్చిన వివిధ రాష్ట్రాల్లోని స్థానిక సంస్థలకు ఏప్రిల్‌ 24న కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ పురస్కారాలను అందజేయటం లేదు.
*బీసీ గురుకుల పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు, మహిళా డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి అర్హులైన విద్యార్థులు గడువులోగా ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలని బీసీ గురుకులాల సొసైటీ కార్యదర్శి మల్లయ్య భట్టు సూచించారు.
*ఓటర్లను ప్రలోభపెట్టేలా లేదంటే ప్రభావితం చేసేలా వస్తువులు, బహుమతులను ఓటర్లకు పంచిపెట్టేందుకు రాజకీయ పార్టీలకు వ్యాపారులు సహకరించడం ఎన్నికల చట్టాలను ఉల్లంఘించడమే అని వాణిజ్య పన్నులశాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
* ఓటరు గుర్తింపు కార్డు తీసుకోవడానికి మీసేవ కేంద్రాలకు చెల్లించే మొత్తాన్ని రూ.25 నుంచి 50 రూపాయలకు పెంచాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు వెళ్లాయి.
*రాజధాని అమరావతి పరిధిలోని నేలపాడులో ఉన్న హైకోర్టు ప్రాంగణంలో భారతీయ స్టేట్‌ బ్యాంక్‌(ఎస్బీఐ) శాఖను హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌ బుధవారం ప్రారంభించారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, బ్యాంక్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
*బాలాపూర్ మండల పరిధిలోని పహాడీషరీఫ్ ఈ నెల 5, 6, 7తేదీల్లో జరుగనున్న ఇస్లామిక్ సమావేశాలకు వేదిక కానున్నది. భారతదేశ నలుమూలల నుంచే కాకుండా ఇతర దేశాల్లో స్థిరపడ్డ ముస్లింలు 3లక్షలకు పైగా సమావేశాలకు హాజరు కానున్నట్లు ఇస్తెమా ఏర్పాట్ల కమిటీ సభ్యులు హబీబ్ యాహియా, ఇమ్రాన్ తమిమీ, అబ్దుల్ నయూం తదితరులు తెలిపారు. పహాడీషరీఫ్ సర్వే నంబర్ 144,145లలో సుమారు 140 ఎకరాల విస్తీర్ణంలో వరుసగా మూడు రోజులు ఇస్లామిక్ సమ్మేళనం జరుగనున్నాయి. సమావేశాల ఏర్పాట్లకు నిర్వాహకులు టెంట్లను, షెడ్‌లను, మరుగుదొడ్లను తాత్కాలికంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు జలమండలి నుంచి మంచి నీటి సౌకర్యం, 100కేవీ ట్రాన్స్‌ఫార్మర్లు -5, విద్యుత్ దీపాల ఏర్పాటు, పోలీసు అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు, ఆరోగ్యం కేంద్రం ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. జీహెచ్‌ఎంపీ, మున్సిపల్ అధికారులు పారిశుధ్య పనులు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలకు వివిధ రాష్ర్టాలకు చెందిన 20 మంది ప్రముఖులు విచ్చేసి భోదనలు చేయనున్నారు.
*మలేషియా ఓపెన్ లో సైనా నెహ్వాల్ తోలి రౌండ్ నే దాటాలేకపోయింది. బుధవారం ఆరంభ రౌండ్లో ఎనిమిదో సీడ్ సైనా 22-20,15-21,10-21తో థాయిలాండ్ కు చెందిన ఖోసిట్ ఫేఫ్రాదబ్ చేతిలో రౌండ్ ఓడిపోయింది. పీవీ సింధు కిడంబీ శ్రీకాంత్ రెండో రౌండ్ కు దూసుకెళ్ళారు. ఐదో సీడ్ సింధు తోలి రౌండ్లో 22-20, 21-12తో ఆయా ఒహోరి జపాన్ పై విజయం సాధించింది. తోలి గేమ్ లో ఓ దశలో 7-12తో వెనుకబడ్డ సింధు..బలంగా పుంజుకుంది. పురుషుల సింగిల్స్ తోలి రౌండ్లో శ్రీకాంత్ 21-18,21-16తో ఇండోనేషియా ఆటగాడు ఇషాన్ మౌలానాను ఓడించాడు. హెచ్ ఎస్ ప్రనాయ్ టోర్నీ నుంచి నిష్క్రమించారు. తోలి రౌండ్లో అతడు 12-21,21-16 21-14తో తమాసీన్ చేతిలో కంగుతిన్నాడు. సమీర్ వర్మ కూడా ఓడిన నేపద్యంలో పురుషుల సింగిల్స్ లో ఇక మిగిలింది ఏకైక భారత షట్టర్ల శ్రీకాంత్ మాత్రమే పురుషుల డబుల్స్ లో మను అత్రీసుమీత్ రెడ్డి జంట తోలి రౌండ్లో ఓడిపోయింది.
*విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ మైదానాన్ని ఐపీఎల్‌ అధికారులు బుధవారం సందర్శించారు. షెడ్యూలు ప్రకారం విశాఖలో ఐపీఎల్‌ మ్యాచ్‌లు లేవు. కానీ ఎన్నికల వల్ల మ్యాచ్‌లను తరలించాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చని భావించిన బీసీసీఐ.. విశాఖను ప్రత్యామ్నాయ వేదికగా ఎంచుకుంది. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్‌ టోర్నమెంట్‌ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ కేథరిన్‌ సింప్సన్‌ నేతృత్వంలోని అధికారుల బృందం స్టేడియాన్ని పరిశీలించింది. స్టేడియం మ్యాచ్‌ల నిర్వహణకు సిద్ధంగా ఉందని ఏసీఏ కార్యదర్శి అరుణ్‌ కుమార్‌ అధికారులకు చెప్పారు.
* తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో ఒక బస్సు కండక్టర్‌ నిజాయితీని చాటుకున్నాడు. గుర్తు తెలియని వ్యక్తి బస్సులో మర్చిపోయిన భారీ మొత్తంలో డబ్బును ఎన్నికల అధికారులకు అప్పగించాడు. ఏడు సంచుల్లో ఉన్న రూ.3.47 కోట్ల నగదును బస్సులో గుర్తించిన కండక్టర్‌ తక్షణమే ఎన్నికల అధికారులకు సమాచారం అందించాడు. కండక్టర్‌ సెల్వరాజ్‌ నిజాయితీని అధికారులు అభినందించారు. ఆ నగదు తమదేనంటూ ఎవరూ ఫిర్యాదు చేయలేదని అధికారులు వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల వేళ ఓటర్లకు పంచేందుకే నగదు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
* శావల్య పురం మండలం వెయ్యకల్లు గ్రామములోని ఎస్సీ కాలనీ లో కలుషిత నీరు తాగి 18 మందికి అస్వస్థతకు గురయ్యారు.. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు నిర్ణయం తీసుకొని వినుకొండ ప్రభుత్వ వైద్య సాలకు తరలించారు.. ప్రస్తుతం శావల్య పురం ప్రాధమిక వైద్య ఆరోగ్య డాక్టర్ ఇబ్రహీం ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది ప్రత్యేకంగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.