తల్లి శవాన్ని 44 రోజులపాటు బ్లాంకెట్స్‌లో కప్పిపెట్టి దాచిన ఓ అమెరికా మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. వర్జీనియాలోని బ్రిస్ట్రోల్లో నివసించే జో-విట్నీ ఔట్‌లాండ్ (55), తన తల్లి రోజ్‌మేరి ఔట్‌లాండ్(78) శవాన్ని 55 బ్లాంకెట్స్‌లో కప్పిపెట్టి సౌత్‌వెస్ట్ వర్జీనియాలోని తన ఇంట్లో దాచిపెట్టిందని బ్రిస్టల్ పోలీస్ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. రోజ్‌మేరి గత ఏడాది డిసెంబర్ 29నే మృతి చెందిందని, ఆమె మృతికి గల కారణాలు తెలియరాలేదన్నారు. తన తల్లి మరణవార్తను విట్నీ ఎవరికి తెలియజేయలేదని, అరెస్ట్ అవుతాననే భయంతోనే ఇలా చేశానని తమ విచారణలో తెలిపిందని ఆ పోలీస్ అధికారి పేర్కొన్నారు. తన నివాసంలోని ఓ గదిలో తన తల్లి శవాన్ని దాచిపెట్టిన విట్నీ.. ఆ గదిని లాక్ చేసిందని, బంధువులు తెరవడానికి ప్రయత్నించిన నిరాకరించేదన్నారు. మృతురాలి అల్లుడు విట్నీ మీద అనుమానంతో ఆ గది విండో ఎక్కి చూడటంతో వ్యవహారం వెలుగు చూసిందన్నారు. శవం వాసన రాకుండా 66 ఏయిర్ ఫ్రెషర్స్‌ను వాడిందని, తల్లి శవం ఉన్న పక్క గదిలోనే నిద్రపోయేదని తెలిపారు. గత మంగళవావరమే విట్నీని అదుపులోకి తీసుకున్నామని, శవాన్ని దాచిన అభియోగాల కింద కేసునమోదు చేశామన్నారు. తన జీవితంలో ఎన్నో ఘోరమైన కేసులు చూసానని, కానీ ఇలాంటి విలక్షణమైన కేసును చూడటం ఇదే తొలిసారి సదరు పోలీస్ అధికారి అభిప్రాయపడ్డాడు.
తల్లిశవంతో నెలన్నర
Related tags :