Politics

చినరాజప్ప….పెద్దాపురంలో గెలుస్తాడా?

Will chinarajappa win peddapuram in 2019

ఉప-ముఖ్యమంత్రి , హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మరోసారి తూ.గో జిల్లా పెద్దాపురం నుంచి బరిలో ఉన్నారు. ఎంపీ తోట నరసింహం సతీమణి వాణి వైకాపా తరపున ప్రధాన ప్రత్యర్ధిగా ఉన్నారు. అమలాపురానికి చెందిన చినరాజప్ప 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఆదేశాల మేరకు పెద్దాపురం నుంచి పోటీ చేసి వైకాపా అభ్యర్ధి తోట సుబ్బారావు నాయుడు పై విజయం సాధించారు. నియోజకవర్గంలో రూ. కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. గెలుపు పై చినరాజప్ప ధీమాగా ఉన్నారు. ఇక్కడ తెదేపా టికెట్ ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్యే బొద్దు భాస్కర రామారావు ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఆయన వర్గీయులు వైకాపాలో చేరుతుండటం పార్టీలో ఆందోళన కల్గిస్తున్న అంశం. ఇన్నాళ్ళు లోక్ సభల లో తెదేపా శాసన సభ పక్ష నాయకుడిగా ఉన్న కాకినాడ ఎంపీ తోట నరసింహం అనారోగ్య కారణాలతో పోటీకి దూరంగా ఉన్నారు. అనంతరం వైకాపాలో చేరడంతో ఆయాన సతీమణి వాణికి ఆ పార్టీ ఇక్కడ పోటీకి నిలిపింది చినరాజప్ప మా కుటుంబాన్ని అవమానించారు. ఓడించి ప్రతీకారం తీర్చుకుంటాం. అనే నినాదంతో ఆమె ఎన్నికల్లో తలపడుతున్నారు. పుట్టింటి అత్తింటి కుటుంబాల రాజకీయ నేపద్యం తనకు కలిసి వస్తుందన్న ఆశతో ఉన్నారు. భర్త అనారోగ్య పరిస్థితుల నేపద్యంలో బరిలో నిలిచినా ఈమె సెంటిమెంటు అస్త్రాన్ని సంధిస్తున్నారు. తన భార్య విజయానికి ఎంపీ నరసింహం తెదేపాలో ఉన్న పరిచయాలను వినియోగించుకుంటున్నారు. సామాజికవర్గం నుంచి సానుకూలత పొందేలా పావులు కదుపుతున్నారు. స్థానికేతరుల మధ్యే పోరు
పెద్దాపురం నియోజకవర్గంలో 1955లో గెలిచినా సీపీఐ అభ్యర్ధి డీవీ. సుబ్బారావు మినహా ఇప్పటి వరకు అన్ని ఎన్నికల్లో ఇక్కడ స్థానికేతరులే గెలవడం గమనార్హం ప్రస్తుతం బరిలో ఉన్న తెదేపా, వైకాపా అభ్యర్దులూ స్థానికేతరులు కాగా జనసేన అభ్యర్ధి తుమ్మల రామస్వామి, కాంగ్రెస్ అభ్యర్ధి తిమ్మల దొరబాబు ఈ నియోజకవర్గానికి చెందిన వారె. ప్రధానంగా తెదేపా- వైకాపా మధ్యే పోటీ ఉంది. ఈ రెండు పార్టీల అభ్యర్ధుల ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం.. జనసేన ఎ పార్టీ ఓట్లు చీలుస్తుందో తెలియక పోటీ ఆసక్తిగా మారింది. ఇక్కడ ఆరు సార్లు కాంగ్రెస్ అయిదు సార్లు తెదేపా రెండు సార్లు సీపీఐ ఒకసారి ప్రజారాజ్యం అభ్యర్ధులు గెలిచారు. నియోజకర్వంగలో పెద్దాపురం, సామర్లకోట మున్సిపాల్టీలు ఉన్నాయి.