వాస్తవంగా గడ్డం సక్రమంగా, సరిగ్గా, అందంగా పెంచడమనేది ఎక్కువ మంది యువకుల కల. కొంతమందికే అబ్బిన కళ. ఇప్పుడు గడ్డం ఎంత ఫ్యాషనో పెద్దగా చెప్పక్కర్లేదు. యువతకు ఐకాన్‌లా నిలిచే ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లీ గడ్డం తీయనని, అది తనకు ఎంతో నచ్చిందని మరోసారి చెప్పడంతో ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు. మరి మీరూ దాన్ని ఫాలో అయ్యి కొత్తగా కన్పించాలంటే ఏం చేయాలి? కొంత సాధన చేయాలి. ఓపిక, క్రమశిక్షణ ఉండాలంటున్నారు హెయిర్‌స్టైలిస్టులు. అప్పుడే అందమైన గడ్డంతో మ్యాన్లీ లుక్‌తో తిరిగేయొచ్చంటున్నారు. మరి దీనికి చేయాల్సిందేమిటి? రోజూ కొంత ఆయిల్ గడ్డానికి రాస్తే మంచిది. అప్పుడు వెంట్రుకలు మృదువుగా మారతాయి. క్రమంగా పెరుగుతాయి. పైగా దురద తగ్గిపోతుంది. మాయిశ్చురైజింగ్‌కు కొబ్బరినూనె సరిపోతుంది. కొంచెం పెరగ్గానే లుక్ బాగాలేదని కొందరు ట్రిమ్ చేస్తారు. దీనివల్ల సరైన రూపంలోకి తెచ్చుకొనే అవకాశం పోతుంది. అందుకే వెంట్రుకలు గొంతుపై కనిపించే ఆడమ్స్ ఆపిల్(మెడ సగభాగం) వరకూ పెరగనివ్వాలి. పూర్తిగా పెరిగిన తర్వాత మనకు కావాల్సిన లుక్‌లోకి ట్రిమ్ చేసుకోవచ్చు. వెంట్రుకలు బాగా, తొందరగా పెరగాలంటే చక్కని ఆహారం అవసరం. ఏ, బీ, సీ, ఈ విటమిన్లు వెంట్రుకల పెరుగుదలకు దోహదపడతాయి. ప్రొటీన్లు ఎక్కువగా తీసుకొంటే ఫలితం కన్పిస్తుంది. గుడ్లు, మాంసం, చేపలు, పాలు ఆహారంలో ఉండేట్లు చూసుకోవాలి. గడ్డానికి ప్రత్యేకంగా షాంపులు మార్కెట్లో దొరుకుతాయి. వీటిని ఉపయోగించి కనీసం రోజుకు ఒకసారైనా శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే వెంట్రుకలు పెరుగుతున్నప్పుడు ముఖంపై జిడ్డు, మట్టి చేరి అలర్జీలు వచ్చే ప్రమాదముంది. పైగా దురద లేకుండా ఈ శుభ్రత తోడ్పడుతుంది.
గడ్డానికి కూడా బాగా నూనె రాయాలి బ్రదర్
Related tags :