DailyDose

తెలుగు రాష్ట్రాల ఎన్నికల బరిలో 171 నేరస్థులు-రాజకీయ-04/07

171 criminals in andhra elections 2019

* వైసీపీలో 97 టీడీపీలో 49, జనసేనలో 25 మందిపై అభియోగాలుపలువురు నేతలపై సీబీఐ, ఈడీ, ఫెరా, ఫెమా, ఏసీబీ దర్యాప్తు 175 శాసన సభ స్థానాలకు టీడీపీ, వైసీపీ పార్టీలు పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 171 మంది వివిధ కేసుల్లో నేరాభియోగాలున్న వారేటీడీపీ, వైసిపిలు నేరాలే అర్హతగా టిక్కెట్లు కేటాయిస్తున్నాయినేరగాళ్లు ముదిరి రాజకీయ నాయకులుగా అవతారమెత్తుతున్నారు.కేసుల మాఫీ కోసమో..పెద్ద మనుషులుగా చెలామణి అయ్యేందుకో ఖద్దరు ముసుగేసుకుంటున్నారు. శాసన సభకు పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో పలువురు వేలకోట్లు దోచుకున్న తీవ్రస్థాయి ఆర్థిక నేరాలతో పాటు హత్యలు, హత్యాయత్నాలు, దొంగతనం, దౌర్జన్యం వంటి అభియోగాలున్న వారే పోటీ చేస్తున్న దుస్థితి
* కాళహస్తిలో విజయలక్ష్మి ఎన్నికల ప్రచారం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్‌ విజయలక్ష్మి ఆదివారం శ్రీకాళహస్తిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగన్‌పై కేసులు పెట్టించింది చంద్రబాబేనని ఆరోపించారు. రాజధాని భూములు చంద్రబాబు దోచుకున్నారని విమర్శించారు. వైఎస్‌ హయాంలో రైతు రాజ్యం పాలన సాగిందని, ప్రజల గుండెల్లో వైఎస్‌ నిలిచిపోయారని ఆమె అన్నారు. జగన్ తన పాదయాత్రలో ప్రజల కష్టాలు ప్రత్యక్షంగా చూశారని, జగన్‌ అందరికీ అండగా ఉంటారని విజయలక్ష్మి అన్నారు.
*నాగబాబుకి ఓటు వేయకండి – శివాజీ రాజా
జనసేన పార్టీ తరపున నర్సాపురం ఎంపీ అభ్యర్ధిగా బరిలో ఉన్న నాగబాబు పై నటుడు మా మాజీ అద్యక్షుడు శివాజీ రాజా విరుచుకుపడ్డారు. నాగబాబు వాళ్ళ మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ దిగజరిపోయిందని అభివృద్దిలో మా ను రెండేళ్ళు వనక్కి నెట్టారని ఆయన ధ్వజమెత్తారు. మెగా ప్యామిలీని తిట్టిన వాళ్ళకు నాగబాబు రాత్రికిరాత్రి మద్దతు ఇచ్చారని వాళ్ళు ఎన్నికల్లో నెగ్గిన రెండు రోజులకే మెగా ప్యామిలీని తిట్టారన్నారు. ఆరువందల మంది ఉన్న ‘మా;కు ఏమీ చేయనివాడు నరసాపురానికి ఎం చేస్తారంటూ శివాజీ రాజా సూటిగా ప్రశ్నించారు. మీరు ఎ పార్టీకి అయినా ఓటు వేసుకోండి కనీ నాగబాబుకి మాత్రం ఓటు వేయొద్దు అని నర్సాపురం ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
*త్వరలోనే పదవుల జాతర
రాష్ట్రంలో పంచాయతీ సర్పంచుల పదవీకాలం ఇప్పటికే ముగిసింది. మండల, జిల్లా పరిషత్ లు పురపాలక సంఘాల పాలక మండళ్ళ గడువు జులైతో ముగుస్తోంది. వ్యవసాయ సహకార సొసైటీలకు ఎన్నికలు జరగనున్నాయి. నాలుగైదు నెలల్లోనే వీటికి ఎన్నికలు జరిగే అవకశం ఉంది. వార్డు సభ్యుడి ఎంపీపీలు జడ్పీటీసీ జిల్లా పరిషత్ ఆద్వర్యంలో మున్సిపల్ చైర్మన్లు వంటి పదవులు వేల సంఖ్యలో అందుబాటులోకి రానున్నాయి.
*గాజువాకలో డబ్బు పంచుతున్న వైకాపా
ఓటర్లకు డబ్బు పంచుతున్న ఐదుగురు వైకాపా అభిమానులను ప్లయింగ్ స్క్వాడ్ టాస్క్ పోర్స్ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఘటన గాజువాక నియోజకవర్గంలో జరిగింది. జీవీఎంసీ 65వ వర్డు పరిధి అక్కిరెడ్డిపాలెం మింది విశాఖ డెయిరీ పరిసర ప్రాంతాల్లో కొందరు వ్యక్తులు వైకాపాకు ఓటు వేయాలని ప్రలోభాపెడుతూ డబ్బులు పంచుతున్నారని సమాచారం అందింది. నిఘా సిబ్బందిని అప్రమత్తం చేశాం. డబ్బుతో కాలనీల్లో తిరుగుతున్న ఐదుగురుని అదుపులోకి తీసుకున్నారు.
*రాహూల్ జీ కొంచెం గౌరవంగా మాట్లాడండి
ఎల్కే అద్వానీ వ్యాసం పై వ్యాఖ్యానించిన రాహూల్ గాంధీ వైఖరి పై భాజపా ఆగ్రహం వ్యక్తం చేసింది. మాటల్లో కొంత మర్యాద పాటిస్తే మంచిదని విదేశంగా మంత్రి సుష్మాస్వరాజ్ హితవు పలికారు. రాహూల్ జీ.. అద్వానీ మాకు పిత్రుత్వులు మీ మాటలు మమ్మల్ని ఎంతో బాదించాయి. దయచేసి మీ ప్రసంగంలో కొంత గౌరవం పాటించండి. అని పేర్కొన్నారు. రాహూల్ రాజకీయాల స్థాయిని దిగజారుస్తున్నారని రైల్వే మంత్రి పియూష్ గోయాల్ ఆగ్రహం చేశారు. అద్వానీని ప్రధాని మోడీ అవమానిస్తున్నరన్న రాహూల్ గాంధీ వ్యాఖ్యలను ఖండించండి.
*ఆగ్రాలో సినీతారల డూప్ ప్రచారం.
ఓటర్లను ఆకట్టుకునేందుకు ఉత్తరాదిన సినీతారల దూప్ లతో ప్రచారం చేయిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రాలో ఎస్పీ- బీఎస్పీ కూటమి అభ్యర్ధి మనోజ్ సోనీ.. బలేవుద్ తారలు సైఫ్ ఆలీఖాన్, రితేష్ దేశ్ మొఖ్ లను పోలిన వ్యక్తులను రంగంలోకి దించాయి. ఆగ్రా వీధుల్లో వీరిని చూసిన స్థానికులు విశేషంగా స్పందిస్తున్నారు. అసలైన నటుల్లా మిమిక్రీ కూడా చేస్తుండటంతో జనం చుట్టూ చేరుతున్నారు. బీఎస్పీ అభ్యర్ధిని గెలిపించాలని ఏనుగు గుర్తుకు ఓటేయాలని వారు అభ్యదిస్తున్నారు.
*భాజపాలోకి సైన్యం మాజీ ఉప అధిపతి శరత్‌ చంద్‌
భారత సైన్యం మాజీ ఉప అధిపతి లెఫ్టినెంట్‌ జనరల్‌ శరత్‌ చంద్‌ శనివారం కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ సమక్షంలో భాజపాలో చేరారు. ఈ సందర్భంగా శరత్‌ చంద్‌ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల్లో మన దేశానికి బలమైన నాయకత్వం అవసరమని పేర్కొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వం తనకు స్ఫూర్తినిచ్చిందని, అందుకే తాను భాజపాలో చేరానని వెల్లడించారు.
*జూన్‌లో పరిషత్‌ ఎన్నికలు?
రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను జూన్‌ నెలలో నిర్వహించే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్నికలను రెండు లేదా మూడు విడతల్లో చేపట్టనున్నారు. విడతలపై రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రస్తుతం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీల నుంచి ప్రతిపాదనలను తీసుకుంటోంది. 2014నాటి అభ్యర్థుల్లో 1,642 మంది తమ ఖర్చు వివరాలను అందజేయనందున వారంతా ఈసారి ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా మిగిలారు. రాష్ట్రంలో 2014లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను ఒకే విడతలో నిర్వహించగా.. ఈసారి పోలింగ్‌ కేంద్రాల సంఖ్య పెరుగుతుండటం, జిల్లాల సంఖ్య ఇప్పటికే పెరగడం వంటి కారణాల వల్ల ఎన్నికలను రెండు లేదా మూడు విడతల్లో చేపట్టాల్సి ఉందని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది.
*తెలంగాణలో తెదేపా కథ ముగిసింది
తెలంగాణలో తెలుగుదేశం కథ ముగిసిందని, ఆ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలంతా తమ పార్టీలో చేరుతున్నారని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పుతో చంద్రబాబునాయుడికి జ్ఞానోదయమైందని పేర్కొన్నారు. తెదేపా హైదరాబాద్‌ నగరాధ్యక్షుడు ఎమ్మెన్‌ శ్రీనివాస్‌, టీఎన్‌టీయూసీ అధ్యక్షుడు రాంపాల్‌, ఇతర నేతలు సురేష్‌, ఆంథోనీ వినోద్‌, శరణ్‌, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నగరాధ్యక్షుడు ఇల్లం, బీసీ సెల్‌ విభాగానికి సంబంధించిన నాయకులతో కలిసి శనివారం కేటీఆర్‌ సమక్షంలో తెరాసలో చేరారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ, ఇప్పటికే తెలంగాణవ్యాప్తంగా తెలుగుదేశం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని, నగరంలో మిగిలిన నాయకులు కూడా తెరాసలో చేరడం అభినందనీయమని అన్నారు. వారందరినీ పార్టీ సముచితంగా గౌరవిస్తుందని తెలిపారు.
*తెరాస పోలింగ్‌ వ్యూహం
పార్లమెంటు ఎన్నికలకు రంగం సిద్ధమవుతుండగా.. తెరాస పోలింగ్‌ వ్యూహాన్ని రూపొందిస్తోంది. బూత్‌ కమిటీలు, పోలింగ్‌ ఏజెంట్ల నియామకాలు జరుపుతోంది. గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు నేరుగా అధిష్ఠానం స్థాయిలో నిర్ణయాలు తీసుకుంటోంది. పోలింగ్‌ సందర్భంగా చీటీల పంపిణీతో పాటు ఓటర్లకు సమాచారం అందించడానికి, బూత్‌ల్లో పోలింగ్‌ పరిశీలనకు నేతలు, ఏజెంట్ల అవసరం ఉంది.
*కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు తృణమూల్‌ నేతృత్వం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై పశ్చిమ్‌ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అబద్ధాలకోరు, భార్యనే పోషించని వ్యక్తి అంటూ విమర్శలు గుప్పించారు. ఎన్‌ఆర్‌సీ, పౌరసత్వ బిల్లు పేరుతో దేశంలో చట్టబద్ధమైన పౌరులను విదేశీయులుగా చిత్రించేందుకు భాజపా నేతలు యత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. శనివారం ఆమె అలిపుర్‌ద్దార్‌, జల్పాయ్‌గురిలలో నిర్వహించిన ఎన్నికల సభల్లో ప్రసంగించారు. ‘‘భాజపా మళ్లీ గెలిస్తే దేశ స్వాతంత్య్రం, ప్రజల స్వేచ్ఛ ప్రమాదంలో పడతాయి. మనం తినే తిండి, ధరించే దుస్తులతో పాటు మనం ఏ మతంలో ఉండాలో కూడా వాళ్లే నిర్ణయిస్తారు’’ అని హెచ్చరించారు. దేశ ప్రజలను రక్షించుకోవటం కోసం భాజపాను ఓడించాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు టీఎంసీ నేతృత్వం వహిస్తుందని తెలిపారు.
*కాంగ్రెస్‌ వస్తే పన్నుపోటే
కాంగ్రెస్‌ ఎన్నికల ప్రణాళికను అమలు చేస్తే మధ్యతరగతి ప్రజలపై పన్నుపోటు తప్పదని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. శనివారం ఒడిశాలోని సుందరగఢ్‌, సోనేపూర్‌, ఛత్తీస్‌గఢ్‌లోని బాలోడ్‌ జిల్లా హతౌడ్‌, మహారాష్ట్రలోని నాందేడ్‌ల్లో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ప్రసంగిస్తూ పేదలకు కనీస ఆదాయం కల్పించడం కోసం కాంగ్రెస్‌ ప్రతిపాదించిన ‘న్యాయ్‌’ పథకంపై పరోక్షంగా విమర్శలు చేశారు.
*న్యాయ్‌పై ప్రశ్నించే అర్హత లేదు
పేదరిక నిర్మూలనకు ఉద్దేశించిన ‘న్యాయ్‌’ పథకం అమలు సాధ్యాసాధ్యాలపై ప్రశ్నించే అర్హత భాజపా నేతలకు లేదని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీ వంటి వ్యాపారవేత్తలకు రూ.వేల కోట్లను అప్పనంగా అప్పగించేటప్పుడు ప్రధాని మోదీకి కలగని సందేహం ఇప్పుడెందుకు వస్తోందని ప్రశ్నించారు. శనివారం ఉత్తరాఖండ్‌లోని అల్మోరా, శ్రీనగర్‌, హరిద్వార్‌లలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలలో రాహుల్‌ ప్రసంగించారు.
*తెదేపాలో చేరిన మాజీ ఎమ్మెల్యే తైనాల
విశాఖ ఉత్తర నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, విశాఖ లోక్‌సభ వైకాపా ఇన్‌ఛార్జి తైనాల విజయకుమార్‌ శనివారం తెదేపాలో చేరారు. మంత్రి గంటా శ్రీనివాసరావుతో కలిసి వచ్చిన ఆయన ఉండవల్లిలోని నివాసంలో ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా కండువా కప్పి తెదేపాలోకి తైనాలను చంద్రబాబు ఆహ్వానించారు. 2009 ఎన్నికల్లో ఉత్తర నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థిగా తైనాల పోటీ చేసి గెలుపొందారు.
*వైకాపా మేనిఫెస్టోలో తెదేపా పథకాలే
తెదేపా ఇప్పటికే అమలుచేస్తున్న సంక్షేమ పథకాలనే వైకాపా తన మేనిఫెస్టోలో పెట్టిందని, రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకాలు అమలు చేస్తుందో కూడా ప్రతిపక్షనేత జగన్‌కు అవగాహన లేదని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి లంకా దినకర్‌ ధ్వజమెత్తారు.
*చంద్రబాబుకు అవకాశమిస్తే నలభై ఏళ్లు వెనక్కి
ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబునాయుడికి అవకాశమిస్తే రాష్ట్రాన్ని మరో నలభై ఏళ్లు వెనక్కి తీసుకుపోతారని భాజపా ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు. శనివారం కాకినాడలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబుకు అసలు ఎందుకు అవకాశమివ్వాలో చెప్పాలన్నారు. రూ.రెండు లక్షల కోట్లు అప్పుచేసినందుకా..? రూ.ఆరు లక్షల కోట్లు కేంద్రం ఇస్తే అందులో అవినీతి చేసినందుకా? అని ప్రశ్నించారు.
*గ్రీన్‌జోన్‌ భూముల సొమ్ముతో సాక్షిలో పెట్టుబడులు
విశాఖపట్నం పరవాడ ఫార్మాసిటీలోని గ్రీన్‌జోన్‌ భూముల అమ్మకంతో వచ్చిన డబ్బును గతంలో సాక్షి పత్రికలో పెట్టుబడులుగా పెట్టారని, ఆ కేసు తానే దర్యాప్తు చేశానని విశాఖ జనసేన ఎంపీ అభ్యర్థి వి.వి.లక్ష్మీనారాయణ అన్నారు. శనివారం రాత్రి ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా గాజువాక నియోజకవర్గ పరిధి శివాజీనగర్‌, అగనంపూడి, ఫార్మాసిటీ పునరావాస కాలనీల్లో పర్యటించారు.
*కాంగ్రెస్‌తో పొత్తుకు ఆప్‌ షరతులు
దిల్లీలో కాంగ్రెస్‌, ఆప్‌ పొత్తుపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. ఇరు పక్షాలు శనివారం తమ పార్టీ నేతలతో సమావేశాన్ని నిర్వహించాయి. వివిధ అంశాలను చర్చించాయి. పొత్తుకు సంబంధించినంత వరకూ ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) రెండు షరతులను విధిస్తోంది. దిల్లీతో పాటు హరియాణ, చండీగఢ్‌లో కూడా సంయుక్తంగా పోటీ చేయడానికి అంగీకరించాలని, దిల్లీకి ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పనపై కాంగ్రెస్‌ బహిరంగంగా మద్దతు ప్రకటించాలని కోరుతోంది.
*ఏపీని నేరగాళ్ల చేతిలో పెడతారా?
‘కోడికత్తి పార్టీ అధ్యక్షుడు జగన్‌ ఏకంగా 31 కేసుల్లో నిందితుడు. వాళ్ల ఒంగోలు అభ్యర్థిపై మారణాయుధాల చట్టంతో పాటు పలు కేసులున్నాయ్‌.. కనిగిరి అభ్యర్థి కిడ్నాప్‌ కేసులో నిందితుడు.. చీరాల అభ్యర్థిపై ఉన్న కేసులకు లెక్కే లేదు.. యర్రగొండపాలెం అభ్యర్థిపై అక్రమాస్తుల కేసులు, సీబీఐ కేసులున్నాయ్‌.. బాపట్ల పార్లమెంటు అభ్యర్థి రాజధానిలో తోటలు తగులబెట్టిన కేసుల్లో నిందితుడు.. తమ్ముళ్లూ, ఇటువంటి నేరగాళ్లకు మీరు ఓటేస్తారా.. వీళ్లకు మనం ఏపీని అప్పగిస్తే ఏం జరుగుతుందో మీరే చెప్పండి’ అని తెదేపా జాతీయాధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.
*జైలుకెళ్లొచ్చిన జగన్‌ ఆదర్శనేత కాలేరు
‘‘మీ అవినీతి ఘనతతో జైలు జీవితం గడిపారు. మీ ధనదాహానికి ఎంతోమంది ఐఏఎస్‌లూ జైలుపాలయ్యారు. ఇలాంటి చరిత్ర కలిగిన మీరు అధికారంలోకి రావటం సాధ్యమయ్యే పని కాదు. మీరు ప్రజలకు ఆదర్శం కాలేరు’’ అని జనసేనాని పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. శనివారం రాత్రి తెనాలిలో ఎన్నికల ప్రచారసభలో ఆయన మాట్లాడుతూ.. వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డిపై ధ్వజమెత్తారు.‘‘ అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డగోలు సంపాదనకు తెగబడిన మీరు అధికారంపై కలలు కంటున్నారు. ప్రతి ఇంట్లో మీ తండ్రి మాదిరిగానే మీ ఫొటో ఉండాలని పగటికలలు కంటున్నారు. మీలాంటి వారికి అధికారం అప్పగిస్తే ప్రజలకు న్యాయం జరగకపోగా అరాచకం పెరుగుతుంది’’ అని చెప్పారు.
*మూడు ప్రాంతాల అభివృద్ధి
‘‘అధికారంలోకొస్తే వికేంద్రీకరణే లక్ష్యంగా రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం. కాపు రిజర్వేషన్‌ విషయంలో మేం మొదటి నుంచీ చెబుతున్నట్లుగానే బీసీల హక్కులకు భంగం కలుగకుండా వారి ప్రయోజనాలకు నష్టం రాకుండా జరిగే రిజర్వేషన్‌కు మా మద్దతు ఉంటుంది. ఒక్కో రైతు కుటుంబానికి అధికారంలోకొచ్చిన రెండోసంవత్సరం నుంచి ఏటా రూ.12,500 పెట్టుబడి సాయం అందిస్తాం’’ అని వైకాపా అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు.
*కేంద్రంలో ప్రాంతీయ పార్టీలే కీలకం
కేంద్రంలో ప్రాంతీయ పార్టీలు కీలకమవుతాయని నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. దేశంలో 40 శాతం ఓట్లు ప్రాంతీయ పార్టీల చేతితో ఉన్నాయన్నారు. జాతీయ పార్టీలు పేరుకే ఉన్నాయి తప్ప వాటికి ఓట్లు లేవన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగిన మైనార్టీల సమావేశంలో ఆమె మాట్లాడారు.
*మోదీతో కేసీఆర్‌ రహస్య స్నేహం: ఉత్తమ్‌
ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్‌ రహస్యంగా స్నేహం చేస్తూ, ప్రజలను మోసగిస్తున్నారని నల్గొండ లోక్‌సభ స్థానం కాంగ్రెస్‌ అభ్యర్థి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. నల్గొండలో పార్టీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన మైనారిటీల సదస్సులో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ ప్రభుత్వం ముస్లింలకు 12% రిజర్వేషన్లు కల్పిస్తామని మోసం చేసిందని, కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
*నేడు ఆజాద్‌, సచిన్‌ పైలట్‌ రాక
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు గులాం నబీ ఆజాద్‌, సచిన్‌ పైలట్‌లు ఆదివారం చేవెళ్ల పార్లమెంటు స్థానం పరిధిలో జరిగే సభలో పాల్గొననున్నారు. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ చేరుకుంటారు. సాయంత్రం 6 గంటలకు చేవెళ్లలోని మన్నెగూడ వద్ద ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో వారు పాల్గొంటారు. మరోవైపు 8న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మరోసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సిందిగా టీపీసీసీ నాయకత్వం ఏఐసీసీకి ప్రతిపాదనలు పంపినా.. ఇప్పటివరకు పర్యటన ఖరారు కాలేదు.
*కేసీఆర్‌కు కుమార్తె ఓటమి భయం
అసెంబ్లీ ఎన్నికలకు భిన్నమైన ఫలితాలను లోక్‌సభ ఎన్నికల్లో సాధిస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్‌ లోక్‌సభ స్థానంలో తన కుమార్తె కవిత ఓడిపోతారన్న భయంతోనే సీఎం కేసీఆర్‌ తెదేపా నేత మండవ వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్లారని వ్యాఖ్యానించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో భాజపా ఆవిర్భావ దినోత్సవాన్ని శనివారం నిర్వహించారు.
*మోదీ కనుసన్నల్లో ఎన్నికల కమిషన్‌: వీహెచ్‌
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్‌.. ప్రధాని మోదీ కనుసన్నల్లో నడుస్తోందని ఏఐసీసీ కార్యదర్శి వి.హన్మంతరావు ఆరోపించారు. నాలుగు రోజుల్లో ఎన్నికలు జరుగనుండగా ఆంధ్రప్రదేశ్‌ సీఎస్‌ను ఈసీ ఎలా బదిలీ చేసిందని ప్రశ్నించారు. శనివారం ఆయన గాంధీభవన్‌లో మాట్లాడారు. తెలంగాణలో అధికార దుర్వినియోగం జరుగుతుందని, ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఈసీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌ విషయంలో మాత్రం ఫిర్యాదు చేసిన మరుక్షణమే అధికారులపై చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.
*ప్రధాని పదవిలో ఉంటే చిరుతిళ్లు తినగలనా?
తాను తదుపరి ప్రధాని అయ్యే ప్రసక్తే లేదని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టం చేశారు. ‘ఆప్‌ కీ అదాలత్‌’ టీవీ కార్యక్రమంలో మాట్లాడుతూ….తాను తదుపరి ప్రధాని కావాలని ఆరెస్సెస్‌ నాయకత్వం అభిలషిస్తోందన్న వార్తలను గడ్కరీ ఖండించారు. అసలు తాను అలాంటి కలలేవీ కనడం లేదనీ, ఆ దిశగా యత్నాలేవీ చేయడం లేదని కూడా స్పష్టం చేశారు. ఈ సందర్భగా ఆయన ఛలోక్తిగా మాట్లాడుతూ, ‘ఒకవేళ నేనే ప్రధాని అయ్యాననుకోండి….రోడ్లపై అమ్మే చిరుతిళ్ల(స్ట్రీట్‌ఫుడ్‌) రుచిని ఆస్వాదించడానికి వీలవుతుందా!’అంటూ ప్రశ్నించారు.
*కాంగ్రెస్‌తో పొత్తుకు ఆప్‌ షరతులు
దిల్లీలో కాంగ్రెస్‌, ఆప్‌ పొత్తుపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. ఇరు పక్షాలు శనివారం తమ పార్టీ నేతలతో సమావేశాన్ని నిర్వహించాయి. వివిధ అంశాలను చర్చించాయి. పొత్తుకు సంబంధించినంత వరకూ ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) రెండు షరతులను విధిస్తోంది. దిల్లీతో పాటు హరియాణ, చండీగఢ్‌లో కూడా సంయుక్తంగా పోటీ చేయడానికి అంగీకరించాలని, దిల్లీకి ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పనపై కాంగ్రెస్‌ బహిరంగంగా మద్దతు ప్రకటించాలని కోరుతోంది.
*భాజపాలోకి సైన్యం మాజీ ఉప అధిపతి శరత్‌ చంద్‌
భారత సైన్యం మాజీ ఉప అధిపతి లెఫ్టినెంట్‌ జనరల్‌ శరత్‌ చంద్‌ శనివారం కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ సమక్షంలో భాజపాలో చేరారు. ఈ సందర్భంగా శరత్‌ చంద్‌ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల్లో మన దేశానికి బలమైన నాయకత్వం అవసరమని పేర్కొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వం తనకు స్ఫూర్తినిచ్చిందని, అందుకే తాను భాజపాలో చేరానని వెల్లడించారు.
*ఉమాభారతి స్థానంలో అనురాగ్‌శర్మ
లోక్‌సభ ఎన్నికల కోసం శనివారం భాజపా 24 మంది అభ్యర్థులతో మరో జాబితాను విడుదల చేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీ నుంచి కేంద్రమంత్రి ఉమాభారతి స్థానంలో అనురాగ్‌శర్మను బరిలోకి దిగనున్నారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయబోనని ఉమాభారతి ఇప్పటికే ప్రకటించారు. ఏడు దశల్లో జరిగే ఎన్నికల కోసం ఇప్పటిదాకా భాజపా 407 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది.
*మోడీ, అమిత్ షాలు దుర్యోదన దుస్శాసానులే
ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ దుర్యోదనుడిగా భాజపా అద్యక్షుడు అమిత్ షాను దుస్శాసనుడిగా సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి శనివారం అభివర్ణించారు. తమను తాము ఏకైన అతిపెద్ద పార్టీగా ప్రదర్శించుకోవడానికి భాజపా యత్నిస్తోందని అన్నారు. మరే పార్టీ కూడా తమను ఓడించాలేదంటూ భాజపా తన ఎన్నికల ప్రచారంలో పేర్కొంటున నేపద్యంలోనే తనకు కౌరవ సోదరులైన దుర్యోధన దుస్శాససన్ గుర్తుకు వచ్చినట్లు చెప్పారు. ఎన్నికల అనంతరం పోత్తులకు అవకాశాలున్నట్లు అభిప్రాయపడ్డారు. గతంలో కూడా ఇలాంటి పరిణామాలే చోటు చేసుకున్నాయన్నారు.
*భాజపాలో వన్ మ్యాన్ షో
భాజపా ఒక్కరి ఆధిపత్యం ఇద్దరే సైన్యం గా తయారయిందని ఆ పార్టీని వీడిన ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు శత్రుఘ్న సిన్హా విమర్శించారు. భాజపా వ్యవస్థాపక దినోత్సవం నాడే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. భారమైన హృదయంతో భాజపాను వీడుతున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వనుగోపాల్ ప్రధాన అధికార ప్రతినిధి రన్ దీప్ సుర్జేవాలా తదితరులు శత్రుగ్న సిన్హాకు స్వాగతం పలికారు ఈ సందర్భంగా రాహూల్ గాంధీని విజయవంతమైన ప్రగతిశీల నేతగా శత్రుఘ్న సిన్హా కొనియాడారు. భాజపాలో చర్చకు తావుండదని అగ్రనేతలు సత్రువుల్లా చూస్తారని దుయ్యబట్టారు