Politics

ఎన్నికల సిబ్బంది గౌరవ వేతనం ₹150

election staff salaries in india

ఎన్నికల సిబ్బందికి గౌరవ వేతనాలు ఖరారుచేస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీచేసింది. సెక్టార్ అధికారులకు రోజుకు రూ.5 వేలు, మాస్టర్ ట్రైనర్లకు రూ.2 వేలు, ప్రిసైడింగ్ అధికారులు, కౌంటింగ్ సూపర్‌వైజర్లు, రిసెప్షన్ సూపర్‌వైజర్లకు రోజుకు రూ. 350 చొప్పున, క్లాస్-4 ఉద్యోగులకు రూ. 150 గౌరవవేతనం అందజేయనున్నారు. మధ్యాహ్న భోజనానికి రూ.150 చెల్లించనున్నారు. వీడియో చిత్రీకరణ, అకౌంటింగ్, మానిటరింగ్, కంట్రోల్ రూం, కాల్‌సెంటర్, ఫ్లైయింగ్ స్కాడ్, స్టాటిక్స్ సిబ్బందికి స్థాయిని బట్టి గౌరవ వేతనం ఇవ్వనున్నారు.