Politics

మా రెవెన్యూ చట్టం చూసి ఆశ్చర్యపోతారు

kcr speech in nirmal 2019 elections

రైతులకు 24 గంటల విద్యుత్‌ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఇక ముందూ మనకు విద్యుత్‌ కష్టాలు ఉండవని తెలంగాణ ప్రజలకు భరోసా ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్‌ మాట్లాడారు. దేశంలో అత్యధిక తలసరి విద్యుత్‌ వాడుకునే ప్రథమ రాష్ట్రం తెలంగాణ అని గుర్తు చేశారు. జూన్‌ మాసం తర్వాత దేశం ఆశ్చర్యపోయేలా కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి తెస్తామన్నారు. ఒక్కొక్క గుంట లెక్కతేలేలా రైతులకు పూర్తి యాజమాన్య హక్కును కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మే నుంచి రూ. 2 వేలు పింఛన్‌ అందిస్తామని హామీ ఇచ్చారు. బీడీ కార్మికులకు పింఛను ఇచ్చి ఆదుకునే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేసీఆర్‌ పునరుద్ఘాటించారు.