DailyDose

మోడీకి ఓటేస్తే మరణాన్ని కొని తెచ్చుకున్నట్లే–రాజకీయ-04/08

modi in 2019 elections

*ప్రధాని మోదీకి ఓటేస్తే మరణశాసనాన్ని మీరే రాసుకున్నట్లని, మోదీ వస్తే దేశంలో ముస్లింలు బతకలేరని సీఎం చంద్రబా హెచ్చరించారు. 175 అసెంబ్లీ స్థానాల్లో తానే అభ్యర్థినని సీఎం చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికలు భావితరాల భవిష్యత్‌కు సంబంధించినవన్నారు. ‘‘నన్ను చూసి ఓటేయండి.. మీకు అండగా ఉంటాను. మోదీ, జగన్‌, కేసీఆర్‌కి తగిన గుణపాఠం చెప్పాలి. వైసీపీకి ఓటేస్తే నేరుగా మోదీ అకౌంట్‌లోకి వెళ్లిపోతుంది. 50శాతం వీవీప్యాట్‌ స్లిప్‌లను లెక్కించాలని అడిగాం. సుప్రీంకోర్టు చెప్పినట్లు 5 వీవీప్యాట్లు లెక్కిస్తే సరిపోదు.. కనీసం 25 వీవీ ప్యాట్లను లెక్కించాలి’’ అని చంద్రబాబు డిమాండ్ చేశారు.చింతలపూడి ద్వారా గోదావరినీళ్లు తీసుకొస్తానని తెలిపారు. నాగార్జునసాగర్‌, శ్రీశైలం కృష్ణారివర్‌ బోర్డ్‌ కింద ఉండాలని, ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడును మూసివేయాలంటున్నారని, మన నీళ్లు మన ఇష్టమొచ్చినట్లు వాడుకుంటామన్నారు. సంక్షేమం, అభివృద్ధిలో మనతో పోటీ పడలేరని చంద్రబాబు తెలిపారు. ఒక్క ఛాన్స్‌ ఇవ్వాలని జగన్‌ అడుగుతున్నారని, ఒక్క ఛాన్స్‌ అని కరెంట్‌ తీగలు పట్టుకుంటారా అని ఆయన ప్రశ్నించారు. ఒక్క ఛాన్సే కదా అని విషం తాగుతామా అని మరోసారి ప్రశ్నించారు. రాష్ట్ర భవిష్యత్‌, అభివృద్ధే మనకు కావాలని, జరగరానిది జరిగితే పాతాళానికి వెళ్తామని చంద్రబాబు హెచ్చరించారు.
* అందుకే ఆమె కాళ్లు మొక్కా- పవన్‌ కల్యాణ్‌
వీధికో గూండా ఉండే ఉత్తరప్రకదేశ్‌లాంటి రాష్ట్రంలో దళిత మహిళ అయిన మాయావతిని అక్కడ ప్రజలు ముఖ్యమంత్రిని చేశారని, అందుకే ఆమె కాళ్లు మొక్కినట్లు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ చెప్పుకొచ్చారు. సోమవారం ఆయన తూర్పు గోదావరి జిల్లా అమలాపురం బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా టీడీపీ నేత తోట త్రిమూర్తులుపై విరుచుకుపడ్డారు. ‘తోట త్రిమూర్తులను నేను ఎప్పుడూ పార్టీలోకి రమ్మని అడగలేదు.
*పవన్ పై పోసాని మండిపాటు
వైఎస్ జగన్ పై పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాన్ని మార్చుకోవాలని సినీనటుడు రచయితా పోసాని కృష్ణమురళి కోరారు. జగన్ దుర్మార్గుడని నిరూపిస్తే శాశ్వతంగా పవన్ ఫోటో మేడలో వేసుకుని తిరుగుతానని స్పష్టం చేశారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు చంద్రబాబు జాగ్న్ పట్ల కధానాయకుడు శివాజీ ద్వంద వైఖరి అవలంభిస్తున్నరని తప్పుపట్టారు చంద్రబాబుకు వ్యతిరేకంగా గతంలో శివాజీ మాట్లాడిన పలు వీడియోలు క్లిప్పులను పోసాని ప్రదర్శించారు.
* 75 హామీలతో బీజేపీ మేనిఫెస్టో విడుదల
బీజేపీ లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోను సోమవారం విడుదల చేసింది. పార్టీ చీఫ్ అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీ, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ రాజ్‌నాథ్ సింగ్ ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోకి సంకల్ప్ పత్రా అనే పేరు పెట్టారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోబోతున్న నేపథ్యంలో 75 హామీలతో ఈ మేనిఫెస్టోను తీసుకొచ్చినట్లు అమిత్ షా వెల్లడించారు. 2022లో భారత్ 75వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోబోతున్నది. ఆలోపు తాము ఇచ్చిన ఈ 75 హామీలు నెరవేరుస్తామని షా స్పష్టం చేశారు. మేనిఫెస్టో కమిటీ చైర్మన్ రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ఇది చాలా ముందు చూపుతో కూడిన ఆచరణాత్మక మేనిఫెస్టో అని అన్నారు. తనతోపాటు కమిటీలో 12 మంది సభ్యులు ఉన్నారని, దీనికితోడు వివిధ సబ్ కమిటీలు కూడా ఏర్పాటు చేసి అన్ని అంశాలపై అధ్యయనం చేశామని చెప్పారు.
* టీఆర్‌ఎస్‌కు చేవెళ్లలో అభ్యర్థి దొరకలేదు- విశ్వేశ్వర్‌రెడ్డి
టీఆర్‌ఎస్ పార్టీని చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి ఎద్దేవాచేశారు. టీఆర్‌ఎస్‌కు చేవెళ్లలో అభ్యర్థి దొరకలేదన్నారు. బయటి వ్యక్తిని పోటీలో నిలపడం చేవెళ్ల గడ్డకే అవమానమని చెప్పారు. కరీంనగర్‌కు చెందిన అభ్యర్థిని పోటీలో పెట్టారని, అబద్ధాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గంలో ప్రజా సమస్యలు తెలుసుకున్నాయని, తెలంగాణ ఇచ్చి సోనియా మాట నిలబెట్టుకున్నారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. టీఆర్‌ఎస్‌కు ప్రజలు గుణపాఠం చెబుతారని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి హెచ్చరించారు.
* మచిలీపట్నంలో జగన్‌ ఎన్నికల ప్రచారం
ఐదేళ్ల చంద్రబాబు పాలనలో అంతా మోసం జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన మచిలీపట్నంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్‌ మరణించాక మచిలీపట్నం పోర్టును అంతా మరిచారన్నారు. పోర్టు కోసం 33వేల ఎకరాల భూసేకరణకు బాబు నోటిఫికేషన్‌ ఇచ్చారని, తాము అధికారంలోకి వస్తే పోర్టు కోసం 4500 ఎకరాలు మాత్రమే సేకరిస్తామని అన్నారు. పేదలందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించి.. ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. విద్యుత్‌పై యూనిట్‌కు రూ. 9 వసూలు చేస్తున్నారని.. తాము యూనిట్‌ కరెంట్‌ రూ. 3.50కే ఇస్తామని జగన్‌ అన్నారు.
* పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జగన్‌ ప్రచారం
ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ప్రజలకు మేలు జరగలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన ఏలూరులో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇసుక మాఫియాను అడ్డుకున్న.. ఎమ్మార్వో వనజాక్షి జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లారని విమర్శించారు. ధర్మానికి, అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతోందని జగన్‌ అన్నారు.
*రూ.కోటి విలువ చేసే కూపన్లు స్వాధీనం
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో ఆదివారం రూ. కోటి విలువ చేసే కూపన్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. చౌడేపల్లి మండలంలోని సింగిరి గుంత చెక్ పోస్టు వద్ద పుంగనూరు నుంచి సోమల వైపు వెళ్తున్న జనసేనకు చెందిన వాహనం నుంచి 4600 కూపన్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అలాగే పుంగనూరులో 600 కూపన్లు పట్టుకున్నారు. ఒక్కో కూపన్ పై రెండు వేలు అని ముద్రించి ఉందని.. దీని ప్రకారం పట్టుబడ్డ కూపంల విలువ రూ. 1.04 కోట్లుగా అధికారులు నిర్ధారించారు. కూపన్లతో పాటు స్కార్పియా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
* అన్యాయం చేస్తే సహించం – చలసాని
తెలుగు జాతికి అన్యాయం చేయాలనీ చూస్తె సహించబోమని ప్రత్యెక హోదా విభజన హక్కుల సాధన కమిటీ అద్యక్షులు చలసాని శ్రీనివాస్ హెచ్చరించారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. లిపి లేని గుజరాత్ విద్యార్ధులకు మాతృ బాషలో జేఈఈ ప్రవేశ పరీక్ష రాయడానికి అవకాశమిచ్చిన కేంద్రం. పద్నాలుగు కోట్ల మంది తెలుగు ప్రజలున్న తెలుగ వారికి మాత్రం మాతృబాషలో రాసే హక్కు లేదా అన్నారు. రాజధాని ఉన్న గుజరాత్ లో మరో క్యాపిటల్ సిటీ నిర్మాణానికి రూ. డెబ్బై వేల కోట్లు కేటాయించిన మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రూ.3600 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారని దుయ్యబట్టారు. ప్రత్యెక హోదాను ఏ ఒక్క పార్టీ కూడా మేనిఫెస్టో లో చేర్చకుండా దేవుడిపై భారం వేయడమేమిటని ప్రశ్నించారు.
* 5 ఏళ్లలో అంతర్జాతీయ శక్తిగా అవతరించాం: షా
మోదీ నేతృత్వంలో ఈ ఐదేళ్లలో అంతర్జాతీయ శక్తిగా భారత్‌ అవతరించిందని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా అన్నారు. దేశంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేసి.. అద్భుతమైన పాలన అందించామని చెప్పారు. భాజపా మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశం అభివృద్ధిలో దూసుకెళుతోందన్నారు. రూ.12 లక్షల కోట్ల స్కామ్‌లను వెలుగులోకి తెచ్చామని చెప్పారు. సమాఖ్య స్ఫూర్తితో పనిచేస్తున్నామని, అసాధ్యాలను సుసాధ్యం చేశామని వివరించారు.
* వాటిని మేనిఫెస్టోలో పెట్టడానికి జగన్‌కు భయం
ఎన్నికలకు ఇంకా రెండు రోజులే గడువు ఉన్నందున ఈ రణరంగంలో తెదేపా శ్రేణులంతా సైనికుల్లా పోరాడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. కార్యకర్తల కష్టానికి, త్యాగానికి తగిన గుర్తింపు ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో సంతృప్తి ఉందని, అన్ని సర్వేలూ తెదేపా గెలుపునే నిర్ధారిస్తున్నాయని అన్నారు. ఈవీఎంలపై ఓటర్లలో అవగాహన పెంచాలని, వీవీప్యాట్ రశీదుల గురించి అందరికీ చెప్పాలని నేతలకు చంద్రబాబు సూచించారు. ‘ఎలక్షన్ మిషన్‌ 2019’పై ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వైకాపా నేతలు నరరూప రాక్షసుల్లా మారారని, ఇటువంటి పార్టీకి ఎవరైనా ఓట్లు వేస్తారా? అని ప్రశ్నించారు. ఆటోలు, ట్రాక్టర్లపై పన్నులు తొలగించామనే తెదేపాపై కక్షకట్టారని, డ్రైవర్ల ప్రాధికార సంస్థ ఏర్పాటుపై వైకాపా నేతలు అక్కసు చూపిస్తున్నారన్నారు.
*మే లో పరిషత్‌ ఎన్నికలు?
తెలంగాణలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సుముఖత వ్యక్తం చేసింది. లోక్‌సభ ఎన్నికలు ముగియగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ఈసీని కోరింది. దీనిపై స్పందించిన ఈసీ లోక్‌సభ పోలింగ్‌ అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఇబ్బందిలేదని పేర్కొంది. లోక్‌సభ ఫలితాల తర్వాతే స్థానిక సంస్థల ఫలితాలు వెల్లడించాలని ఈ సందర్భంగా ఈసీ స్పష్టం చేసింది. ఈనెల మూడో వారంలో స్థానిక సంస్థల షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశముంది. మే నెలలో ఎన్నికలు నిర్వహించే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్నికలను రెండు లేదా మూడు విడతల్లో చేపట్టనున్నారు. విడతలపై రాష్ట్ర ఎన్నికల సంఘం.. ప్రస్తుతం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీల నుంచి ప్రతిపాదనలను తీసుకుంటోంది.
*మాల్దీవుల్లో నషీద్‌ పార్టీ జయకేతనం
మాల్దీవుల జాతీయ పార్లమెంటు (పీపుల్స్‌ మజ్లీస్‌)కు జరిగిన ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు మహ్మద్‌ నషీద్‌ నేతృత్వంలోని మాల్దీవియన్‌ డెమోక్రటిక్‌ పార్టీ (ఎండీపీ) ఘన విజయం సాధించింది. 87 స్థానాలకు గాను మూడింట రెండొంతుల సీట్లను కైవసం చేసుకున్నారు. 60 చోట్ల విజయం సాధించినట్లు ప్రాథమిక ఫలితాలు చెబుతున్నాయి.
*‘మండల్‌’ అమలు నా ఒత్తిడి వల్లే
కేంద్రంలో నేషనల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం 1989లో ఏర్పడిన తర్వాత అప్పటి ప్రధాని వీపీ సింగ్‌, ఉపప్రధాని దేవీలాల్‌ మధ్య నెలకొన్న అధికార పోరు సంకీర్ణ సర్కారు మనుగడపై, అది బిహార్‌లోని తన ప్రభుత్వంపై ఎటువంటి ప్రభావం చూపుతుందోనని ఆందోళనచెందే వాడినని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ తన జీవిత చరిత్ర ‘గోపాల్‌గంజ్‌ టు రైసినా: మై పొలిటికల్‌ జర్నీ’లో పేర్కొన్నారు. ఈ పరిస్థితిని నివారించి వీపీ సింగ్‌ను బలోపేతం చేయాలన్న ఉద్దేశంతోమండల్‌ కమిషన్‌ నివేదికను అమలుపరిచేలా ఆయనను ఒప్పించానని లాలూ వెల్లడించారు.
*10 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ?
భూములపైన సాధారణ రైతులకు ఏవిధమైన హక్కులు ఉంటాయో.. పోడు భూములు సాగు చేసుకుంటున్న వారికీ అదేవిధమైన హక్కులు కల్పిస్తాం. ఆదివాసీ బిడ్డలకు గతంలో అన్యాయం జరిగింది. న్యాయం చేయడానికి కృషి చేస్తా. ప్రత్యేకమైన పాఠశాలలు ఏర్పాటు చేయడంతో పాటు వారికి ప్రత్యేకమైన హక్కులు కల్పించి ఆదుకుంటాం.‘‘దేశంలో భాజపా వాళ్లే హిందువులా.. మేం కాదా? హిందూ దేవుళ్లను మేము కాపాడటం లేదా.. హిందూ, ముస్లింలంటూ పంచాయతీలు పెట్టి ఓట్లు దండుకోవాలని ఎందుకు చూస్తున్నారు? దేశ ప్రధాని అయి ఉండి హిందూ, ముస్లిం అని మాట్లాడొచ్చా’’ అని ప్రధాని మోదీపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ మండిపడ్డారు. అన్ని కులాలు, మతాలు కలిసి మెలిసి జీవించే తెలంగాణ గడ్డపై ఇలాంటి చిల్లర రాజకీయాలు ఎందుకు చేస్తున్నారని ధ్వజమెత్తారు. నిర్మల్‌ జిల్లా కేంద్రంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన ఎన్నికల సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు.
*తెరాసది నిజాం పాలన
తెలంగాణలో తెరాస ప్రభుత్వం నిజాం పాలనను గుర్తుకు తెస్తోందని ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ విమర్శించారు. దేశ అభివృద్ధికి విరోధులైన సమాజ వ్యతిరేకులతో తెరాస చేస్తున్న కుట్రలను తిప్పికొట్టి దేశ సమైకత్యను కాపాడే భాజపాకే ఓటేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా కేంద్రం, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో జరిగిన భాజపా ఎన్నికల ప్రచార సభల్లో ఆయన మాట్లాడారు. దేశాన్ని ప్రగతి పథంలో నడిపించడంతో పాటు పౌరులకు భద్రత కల్పించడమే భాజపా లక్ష్యమని.. మోదీ నేతృత్వంలో దేశం ప్రగతి పథంలో పయనిస్తోందని ఆదిత్యనాథ్‌ అన్నారు.
*ఓటేసి తోడుగా నిలవండి
కాపు రిజర్వేషన్ల విషయంలో ఏమి చేయలేనని జగన్‌ చేతులెత్తేశారని, అటువంటప్పుడు ఆయనకు ఓట్లు అడిగే హక్కు ఎక్కడుంటుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు, 25 పార్లమెంటు స్థానాల్లో పరోక్షంగా అభ్యర్థిని తానేనని, పోటీ చేసేవారందరూ తన ప్రతినిధులేనని, తనను చూసి ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఆదివారం కృష్ణా జిల్లా నందిగామ, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, నరసాపురం పట్టణాల్లో సభలు, రోడ్డుషోలలో ప్రసంగించారు.
*తొలి ఓటు నేరగాళ్లకు వేస్తారా?
మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకునే యువత తమ ఓటును నేరాలు, ఘోరాల పార్టీ వైకాపాకు వేస్తే జీవితాంతం క్షోభ పడాల్సి వస్తుందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ‘జైలుకు వెళ్లిన జగన్‌కు ప్రజా జీవితంలో ఉండే అర్హత ఉందా? 97 మంది నేరగాళ్లను నిలబెట్టిన వైకాపాకు ఎవరైనా ఓటేస్తారా? రూ.63వేల కోట్ల రఫేల్‌ యుద్ధ విమానాల కుంభకోణానికి పాల్పడిన పార్టీ భాజపాకు ఎవరైనా ఓటేస్తారా? వైకాపాకు వేసే ఓటు జగన్‌ నేరాలకు వేసినట్లే’ అని విమర్శించారు. ఆదివారం ముఖ్యమంత్రి పార్టీ నేతలు, కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.
*విశాఖకు చంద్రబాబు చేసిందేమీ లేదు
వైఎస్‌ హయాంలో విశాఖ అభివృద్ధితో పోలిస్తే చంద్రబాబు హయాంలో చేసిందేమీ లేదని వైకాపా అధ్యక్షుడు జగన్‌ అన్నారు. ముఖ్యమంత్రి కేవలం కుంభకోణాలపైనే దృష్టి పెట్టారని ఆరోపించారు. ఆదివారం తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ, విశాఖ జిల్లా అనకాపల్లి, గాజువాక, శ్రీకాకుళం జిల్లా టెక్కలి సభలలో ఆయన మాట్లాడారు.
*ఆంధ్ర సీఎస్‌ను ఎందుకు బదిలీ చేశారు?
ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఎన్నికల సంఘంపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. ఆదివారం జల్పాయిగుడి, ఫలకతాల్లో జరిగిన బహిరంగ సభల్లో ప్రసంగిస్తూ అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి ప్రతిపక్షాలను భయపెట్టాలని మోదీ ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. భాజపా సూచనల మేరకే ఎన్నికల సంఘం (ఈసీ) నడుచుకుంటోందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఎందుకు బదిలీ చేశారని ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు. ‘‘కేంద్ర ప్రభుత్వం ఎందుకు రాష్ట్ర వ్యవహారాల్లో తలదూర్చుతోంది? ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఎందుకు తొలగించారు? చివరి క్షణం మార్పులపై అంత ఇష్టం ఉంటే సొంత కేబినెట్‌ కార్యదర్శినో, కేంద్ర హోం కార్యదర్శినో ఎందుకు తీసేయలేదు.
*అధికారం మహాకూటమిదే
ద్వేష పూరిత విధానాలను అనుసరిస్తున్న భాజపా ఈ ఎన్నికల్లో ఓడిపోతుందని, ఆ పార్టీకి ఇప్పటికే భయం పట్టుకుందని బహుజన్‌ సమాజ్‌ పార్టీ అధినాయకురాలు మాయావతి వెల్లడించారు. మహాకూటమి అధికారంలోకి రానుందని జోస్యం చెప్పారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో తొలిసారిగా ఆదివారం ఎస్పీ, బీఎస్పీ, ఆర్‌ఎల్‌డీ మహాకూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో ఆమె ప్రసంగించారు.
*అవినీతిపై చర్చకు సిద్ధమా?
అవినీతిపై చర్చకు సిద్ధమా? అని ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మరోసారి సవాల్‌ విసిరారు. ఇటీవల మోదీని ఇంటర్వ్యూ చేసిన ఓ పాత్రికేయురాలిని.. ‘ఫ్రాన్స్‌తో రఫేల్‌ ఒప్పందంపై సుప్రీంకోర్టు తీర్పును మీరు విశ్వసిస్తున్నారా?’ అంటూ ప్రధాని మోదీ ప్రశ్నించిన నేపథ్యంలో రాహుల్‌గాంధీ తాజాగా స్పందించారు. ఈ ఇంటర్వ్యూ వీడియోను ట్వీట్‌ చేశారు. ‘‘మిస్టర్‌ మోదీ! మీరు పారిపోగలరు. కానీ దాక్కోలేరు. మీరు చేసిన కర్మ మీతోటే ఉంటుంది. నిజం చాలా శక్తిమంతమైనది. అవినీతిపై చర్చకు సిద్ధమా?’’ అని రాహుల్‌గాంధీ సవాల్‌ చేశారు.
*మమతకు ఓటమి భయం
పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీకి ఓటమి భయం పట్టుకుందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. ఆ రాష్ట్రంలోని కూచ్‌బెహార్‌లోని రాస్‌ మేళా మైదానంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ ఆమెపై విమర్శలు గుప్పించారు. తన సమావేశానికి చిన్నస్థాయి మైదానం కేటాయించడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘నా సమావేశానికి భారీ సంఖ్యలో ప్రజలు రాకుండా అన్ని విధాలుగా అడ్డుకున్నారు. చిన్నపిల్లల్లాంటి వ్యవహారాలతో ఆమె ఎన్నికల్లో గెలవాలని ఎలా అనుకుంటున్నారు?’’ అని ప్రశ్నించారు. మోదీకి అనుకూలంగా చేస్తున్న నినాదాలు విని ఆమెకు నిద్రపట్టడం లేదని విమర్శించారు. ఓటమి భయంతోనే నిరాశ చెంది ఎన్నికల సంఘంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.
*ఆంధ్ర సీఎస్‌ను ఎందుకు బదిలీ చేశారు?
ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఎన్నికల సంఘంపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. ఆదివారం జల్పాయిగుడి, ఫలకతాల్లో జరిగిన బహిరంగ సభల్లో ప్రసంగిస్తూ అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి ప్రతిపక్షాలను భయపెట్టాలని మోదీ ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. భాజపా సూచనల మేరకే ఎన్నికల సంఘం (ఈసీ) నడుచుకుంటోందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఎందుకు బదిలీ చేశారని ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు.
*గల్లీనుంచి దిల్లీ వరకు తెరాస జెండా ఎగరాలి
రాష్ట్రానికి ఏమీ చేయని భాజపా, ఏమీ చేయలేని కాంగ్రెస్‌ పార్టీలు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నాయి? వారికి ఓటు వేస్తే మోరీల వేసినట్లే. గల్లీ నుంచి దిల్లీ వరకు తెరాస జెండా ఎగరాలి. అందుకు సర్పంచులు, కార్యకర్తలు కృషి చేయాలి అని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో నిర్వహించిన సర్పంచులు, ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మఖ్యమంత్రి కేసీఆర్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో రాష్ట్రం దేశంలోనే నంబర్‌వన్‌ స్థానంలో ఉందన్నారు.
*మాధ్యమాలను ఆడిస్తున్న మోదీ
మాధ్యమాలను అడ్డగోలుగా ‘కొనుగోలు’ చేసుకున్నందుకే ప్రధాని మోదీకి అంత ప్రచారం దక్కుతోందంటూ జనతాదళ్‌ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాని హెచ్‌.డి.దేవేగౌడ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన ఆదివారం బెంగళూరులోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. కేంద్ర వార్త, ప్రసారశాఖ నుంచి లబ్ధి పొందినవారే మోదీకి పూర్తి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారన్నారు. మోదీ వ్యతిరేకులను విపరీతంగా కించపరుస్తున్నారన్నారు.
*సీఎం కేసీఆర్‌ ప్రలోభపెడుతున్నారు:చాడ
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత సీఎం కేసీఆర్‌ పరిస్థితి కుడితిలో పడిన ఎలుకలా మారిందని, అందుకే తన స్థాయి మరచి కూతురి గెలుపు కోసం పలువురు నాయకుల ఇళ్లకు వెళుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. ఆయన ఆదివారం హిమాయత్‌నగర్‌లోని మఖ్దూం భవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ, గత ఫలితాలతో బేజారైన సీఎం ప్రలోభానికి గురిచేసేందుకే మండవ ఇంటికి వెళ్లారన్నారు. రాష్ట్రానికి ఫిరాయింపుల వ్యాధి సోకిందని, ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.
*చైనా, పాక్‌ను హడలెత్తించిన మోదీ
కయ్యానికి కాలుదువ్వుతున్న పొరుగు దేశాలైన పాకిస్థాన్‌, చైనాలను హడలెత్తించి, తగిన రీతిలో తిప్పికొట్టిన ధీరుడు ప్రధాని మోదీ అని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పురుషోత్తం రూపాల అన్నారు. ఖమ్మం పార్లమెంటు భాజపా అభ్యర్థి దేవకి వాసుదేవరావు విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మంలో ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. శత్రుదేశాలకు దడ పుట్టిస్తున్న మోదీని మరోసారి ప్రధానిని చేయాలన్నారు. సమావేశంలో భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్‌వీ రమణ, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, నేతలు ఉదయ్‌ ప్రతాప్‌, ప్రభాకర్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు.
*మంగళగిరిలో గెలిచి చరిత్ర తిరగరాస్తా
‘1985 తరువాత మంగళగిరిలో తెదేపా జెండా ఎగరలేదు. ఈసారి అక్కడ గెలిచి 30 ఏళ్ల చరిత్రను మార్చబోతున్నా’ అని మంత్రి, మంగళగిరి తెదేపా అభ్యర్థి లోకేశ్‌ వ్యాఖ్యానించారు. ఆదివారం రాజధాని పరిధి తాడేపల్లిలో ప్రచారాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఉండవల్లి కూడలిలో లోకేశ్‌ ప్రసంగించారు. ‘మంగళగిరిలో ఒక తాతయ్యను పింఛను వస్తోందా? అని వాకబు చేశా. పింఛను అందుతోందనీ.. దానితోపాటు ఆత్మగౌరవం కూడా నిలబడిందని చెప్పారు.
*వైఎస్‌, బాబుల పాలనను బేరీజు వేసుకోండి
వైఎస్‌ హయాంలో విశాఖ అభివృద్ధితో పోలిస్తే చంద్రబాబు హయాంలో చేసిందేమీ లేదని వైకాపా అధ్యక్షుడు జగన్‌ అన్నారు. ముఖ్యమంత్రి కేవలం కుంభకోణాలపైనే దృష్టి పెట్టారని ఆరోపించారు. ఆదివారం తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ, విశాఖ జిల్లా అనకాపల్లి, గాజువాక, శ్రీకాకుళం జిల్లా టెక్కలి సభలలో ఆయన మాట్లాడారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించకుండా వైఎస్‌ చూశారని.. సెజ్‌లు, ఫార్మాసిటీతో అభివృద్ధి పథాన నడిపించారని గుర్తు చేశారు.
*భాజపాలో రాజకీయ వారసత్వాలు లేవు
కుటుంబపాలన ప్రజాస్వామ్యంలో పనికిరాదని, దాన్ని అంతా వ్యతిరేకించాలని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఆదివారం ఎన్నికల సభలో ఆయన ప్రసంగించారు. ‘భాజపాలో సాధారణ కార్యకర్త సైతం ఉపరాష్ట్రపతి పదవి వరకు వెళ్లగలరు. ఛాయ్‌వాలా ప్రధాని కాగలరు. బూత్‌ కమిటీ అధ్యక్షుడు పార్టీ అధ్యక్ష పదవి వరకు చేరుకోగలరు. ఏ పార్టీలోనూ ఇలాంటి పరిస్థితి లేదు’ అని ఆయన చెప్పారు.
*అవినీతిపై చర్చకు సిద్ధమా?
అవినీతిపై చర్చకు సిద్ధమా? అని ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మరోసారి సవాల్‌ విసిరారు. ఇటీవల మోదీని ఇంటర్వ్యూ చేసిన ఓ పాత్రికేయురాలిని.. ‘ఫ్రాన్స్‌తో రఫేల్‌ ఒప్పందంపై సుప్రీంకోర్టు తీర్పును మీరు విశ్వసిస్తున్నారా?’ అంటూ ప్రధాని మోదీ ప్రశ్నించిన నేపథ్యంలో రాహుల్‌గాంధీ తాజాగా స్పందించారు. ఈ ఇంటర్వ్యూ వీడియోను ట్వీట్‌ చేశారు. ‘‘మిస్టర్‌ మోదీ! మీరు పారిపోగలరు. కానీ దాక్కోలేరు. మీరు చేసిన కర్మ మీతోటే ఉంటుంది. నిజం చాలా శక్తిమంతమైనది. అవినీతిపై చర్చకు సిద్ధమా?’’ అని రాహుల్‌గాంధీ సవాల్‌ చేశారు.
*రాష్ట్రంలో పొత్తుండదు – రాం మాధవ్
ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రంలో జూనియర్ భాగస్వామిగా ఉండిపోయమని ఇక ముందు పార్టీ ఒంటరిగా ముందుకు సాగుతుందని ఎవరితోనూ పొత్తు ఉండదని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి రాం మాధవ స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆదివారం ప్రచార సభలో ఆయన మాట్లాడారు. దేశంలో మళ్ళీ మోడీనే గెలుస్తారని రాశాత్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఓడిపోతుందని చెప్పారు. చంద్రబాబు ఐదేళ్ళలో అమరావతిని కట్టడం మాట పక్కనపెడితే కనీసం విజయవాడ నుంచి అమరావతికి రోడ్డు కూడా వేయలేదని విమర్శించారు. తెలుగు రాష్ట్రాల్లో అవినీతి, కుటుంబ పాలనా సాగుతోందన్నారు. మోడీనే కింగ్ అయితే కేసీఆర్ కింగ్ మేకర్ ఎలా అవుతారని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రధాని కావోచ్చుకానీ మానాన్న ఎందుకు కాకూడదని కేటీఆర్ అంటున్నారని కర్ణాటకలో మరో వ్యక్తీ మా నాన్న ఎందుకు ప్రధాని కాకూడదు అంటూ కన్నీరు పెడుతుంటారని మమత మాయావతి శరద్ పవర్ ప్రధాని కావాలని కళలు కంటున్నారని ఎద్దేవా చేశారు.
*అక్కులమ్మ.. 89సార్లు ఓటేసేనమ్మా …
ఆమె పేరు అక్కులమ్మ. బురుజు గుడ్ల రంగప్ప భార్య. వయస్సు 105 సంవత్సరాలు. కానీ ఇప్పటికీ కళ్లజోడు లేకుండా గ్రంథ పఠనం చేస్తున్నారు. 1914లో చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె మండలం పంచాలమర్రిలో జన్మించిన ఈ వృద్ధురాలు అప్పట్లో ఎనిమిదో తరగతి వరకు చదివారు. స్వాతంత్య్ర సమరంలో భాగంగా 1922లో గాంధీ మహాత్ముడు మదనపల్లెకు వచ్చారు. అప్పుడు ఈమె మెట్టినిల్లు పిచ్చలవాండ్లపల్లె గ్రామం నడింపల్లె నుంచి మదనపల్లెకు 30 కిలోమీటర్ల దూరం నడచివెళ్లారు. స్వాతంత్య్ర సమరయోధురాలు, మాజీ ఎమ్మెల్యే టీఎన్‌ అనసూయమ్మ, అనుచరులతో అక్కులమ్మ కూడా కలసి వెళ్లి గాంధీని పలకరించి, ఉద్యమానికి మద్దతు తెలిపారు. బ్రిటీష్‌ వారి పాలనలో 1942లో జరిగిన ఎన్నికల్లో అక్కులమ్మ మొదటి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఎన్నడూ ఓటును వేయకుండా మానుకోలేదు. అన్ని రకాల ఎన్నికల్లోనూ 89 సార్లు ఓటుహక్కును వినియోగించుకున్నట్లు ఆమె పేర్కొంటున్నారు అక్కులమ్మ. ఎన్నుకున్న నాయకుల పనితీరును ప్రశ్నిస్తూ, ప్రజలను విస్మరిస్తే నిలదీస్తూ ఓటు విలువను కాపాడుకోవాలని సమాజానికి విన్నవిస్తున్నారు అక్కులమ్మ.
*మరోమారు మోడీ సర్కారు భాజపా ప్రచార నినాదం
పీర్ ఎక్ బార్ మోడీ సర్కార్ నినాదమే ఈ దపా ఎన్నికల్లో భాజపా ప్రధాన ప్రచారాస్త్రం కానుంది. ఈ నినాదాన్ని ప్రచార గేయాన్ని ధీం ను భాజపా సీనియర్ నేత కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో చేసిన వాగ్దానాలను నెరవేర్చిన పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను మాత్రమే ప్రజలు విశ్వసిస్తారని అన్నారు. గత ఐదేళ్ళులో మోడీ సర్కారు సాధించిన విజయాలను భాజపా ప్రచారం కళ్ళకు కడుతుందని దీం విషయానికి వస్తే కాం కర్నే వాలీ సర్కార్ (పని చేసి చూపే ప్రభుత్వం) ఇమాందార్ సర్కార్ బడే ప్లైస్లె లేనే వలీ సర్కార్ అనే అంశాలతో భాజపా ముందుకెళ్ళనుందని జైట్లీ చెప్పారు.
*మమతకు ఓటమి భయం
పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీకు ఓటమి భయం పట్టుకుందని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. ఆ రాష్ట్రంలోని కూచ్ బేహార్ లోని రాస్ మేళా మైదానంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ ఆమెపై విమర్శలు గుప్పించారు తన సమావేశానికి చిన్న స్థాయి మైదానం కేటాయించడం పై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. నా సమావేశానికి భారీ సంఖ్యలో ప్రజలు రాకుండా అన్ని విధాలుగా అడ్డుకున్నారు. చిన్న పిల్లల్లాంటి వ్యవహారాలతో ఆమె ఎన్నికల్లో గెలవాలని ఎలా అనుకుంటున్నారు అని ప్రశ్నించారు. మోడీకి అనుకూఅల్మ్గా చేస్తున్న నినాదాలు విని ఆమెకు నిద్రపట్టడం లేదని విమర్శించారు. ఓటమి భయంతోనే నిరాశ చెంది ఎన్నికల సంఘం పై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. దేశాభివృద్దికి మోడీ తన ప్రణాళికను వివరిస్తూ త్వరలోనే పోన్ కాల్స్ ఉచితం అవుతాయని అన్నారు. ఇంటర్నెట్ చార్జీలు ప్రపంచంలోనే అతి తక్కువగా ఉంటాయని తెలిపారు.
* మాల్దీవుల్లో నషీద్‌ పార్టీ జయకేతనం
మాల్దీవుల జాతీయ పార్లమెంటు (పీపుల్స్‌ మజ్లీస్‌)కు జరిగిన ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు మహ్మద్‌ నషీద్‌ నేతృత్వంలోని మాల్దీవియన్‌ డెమోక్రటిక్‌ పార్టీ (ఎండీపీ) ఘన విజయం సాధించింది. 87 స్థానాలకు గాను మూడింట రెండొంతుల సీట్లను కైవసం చేసుకున్నారు. 60 చోట్ల విజయం సాధించినట్లు ప్రాథమిక ఫలితాలు చెబుతున్నాయి. మొత్తం మీద 68 చోట్ల జయకేతనం ఎగురవేసే అవకాశాలు కనపడుతున్నాయి. మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్‌ నేతృత్వంలోని ప్రోగ్రెసివ్‌ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఆ పార్టీ నాలుగు సీట్లు మాత్రమే గెలుచుకునే అవకాశాలు కనపడుతున్నాయి. మాల్దీవుల్లో సుస్థిరత, ప్రజాస్వామ్యం దిశగా ఇది కొత్త శకమని నషీద్‌ పేర్కొన్నారు. శాంతిని స్థాపించడం తన మొదటి లక్ష్యమన్నారు.
* ఒలింపిక్స్‌ అర్హత దిశగా స్విమ్మర్‌ రావత్‌
భారత స్విమ్మర్‌ కుశాగ్ర రావత్‌ 2020 టోక్యో ఒలింపిక్స్‌ అర్హత దిశగా ఒక అడుగు ముందుకేశాడు. బ్యాంకాక్‌లో జరుగుతున్న స్పీడో స్విమ్మింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో పురుషుల 800 మీటర్ల ఫ్రీస్టయిల్‌ విభాగంలో ఒలింపిక్స్‌ ‘బి’ అర్హత ప్రమాణాన్ని అందుకున్నాడు. ఈ రేసును 8:07.54 నిమిషాల్లో పూర్తి చేసిన రావత్‌… ఒలింపిక్స్‌ బి అర్హత ప్రమాణాన్ని (8:08:54 నిమిషాలు)ని దాటాడు.
*భారత్‌కు మళ్లీ ఆడాలని ఉంది
భారత జట్టుకు మళ్లీ ఆడాలని ఉందని ఆఫ్‌స్పిన్నర్‌ హర్భజన్‌సింగ్‌ అన్నాడు. ‘‘మళ్లీ అవకాశం వస్తే.. భారత్‌కు ఆడాలని ఉంది. నా బౌలింగ్‌ను మెరుగుపరుచుకుంటున్నా. భారత జట్టుకు దూరమయ్యాక నా ఆటపై దృష్టి పెట్టా. అందుకు ఐపీఎల్‌లో ఫలితం కనిపిస్తోంది. క్రికెట్లో అనుభవం చాలా ముఖ్యం. నాకు అది ఉంది. నేను చెన్నై జట్టులో ఉన్నదే ప్రత్యర్థి జట్లలో కీలక వికెట్లు పడగొట్టడానికి’’ అని భజ్జీ చెప్పాడు.
*పోస్టల్ బ్యాలెట్ ఓటుకు రూ. నలుగు వేలు
చిత్తూరు జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కొనుగోలుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పార్టీకి అనుకూలంగా ఉన్న కొందరు ఉద్యోగ సంఘాల నేతల మధ్యవర్తిత్వాంలో ఇది సాగుతున్నట్లు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 37వేల మంది ఉద్యోగులు, సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఒక పార్టీ రూ. నాలుగు వేలు చెల్లిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
*ప్రశ్నించే గొంతుల్ని ప్రభుత్వం నొక్కేస్తే ఎలా?
ప్రజాస్వామిక హక్కులను కాపాడటంలో రాజకీయ పార్టీలు విఫలమయ్యాయని కవులు, కళాకారులూ ఇతర మేధావులతో పటు ప్రజా సంఘాల నేతలు మండిపడుతున్నారు. ప్రజల కోసం ప్రశ్నిస్తున్న గొంతులను ఇంకా ఎంతకాలం నోక్కేస్తారని ప్రభుత్వాలను వారు సూటిగా ప్రశ్నించారు.. ఆచార్య జీఎన్ సాయిబాబా వరవరర్వు తక్షణ విడుదల పౌరహక్కుల పరిరక్షణకు రాజకీయ పక్షాల నుంచి హామీ కోరుతూ ఆదివారం బషీర్ బాగ్ దేశోద్దారకుడు భవన్ లో విప్లవ రచయితల సంఘం ఆద్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఇదే వేదిక నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్టీలకు బహిరంగ లేఖ విడుదల చేసారు. అక్రమ అరెస్టులను పాలకుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్ళినా స్పందన కొరవడిందని వారు ధ్వజమెత్తారు.
*తాయిలాల పంపిణీకి కొత్త ఎత్తుగడ
ఎన్నికలో తాయిలాలు పంచడంతో రాజకీయ పార్టీలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. గుంటూరు జిల్లలో కొందరు అభ్యర్ధులు తమ చేతికి మట్టి అంటకుండా జాగ్రత్తపడ్డారు. ఆన్ లైన్ షాపింగ్ లో అగ్రగ్రమిగా ప్రాచుర్యం పొందిన ఓ బహుళ జాతీయ సంస్థను సంప్రదించి, బహుమతులు పంచిపెట్టడం చర్చనీయాంశం అవుతోంది. గుంటూరుజిల్లా డెల్టా ప్రాంతంలో ఓ ప్రధన పార్టీ తరపున తిరిగి పోటీ చేస్తున్న అభ్యర్ధి ఒకరు తొలుత దీనికి తెరదీశారు నియోజకవర్గ ఓటర్లకు పెద్ద సంఖ్యలో గృహోపకారణాలు కుక్కర్లు, మిక్సీలు ఇస్త్రీ పెట్టెలు వంటివి అభ్యర్ధి తనయుడు బుక్ చేశారు.