Politics

ఈసీకీ వ్యతిరేకంగా సచివాలయం వద్ద చంద్రబాబు ధర్నా

chandrababu protest against election commission

కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు ఆరోపించారు. సచివాలయం ఆరో బ్లాక్‌లోని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం వద్ద పార్టీ నేతలతో కలిసి ఆయన ధర్నాకు దిగారు. వైకాపా, భాజపా చేసిన ఫిర్యాదులపై అత్యంత వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, తెదేపా చేసిన ఫిర్యాదులపై కనీసం పట్టించుకోకపోవడం అన్యాయమంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ బదిలీ విషయంలో ఎలాంటి విచారణ చేయకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని మండిపడ్డారు. నలుగురు ఐపీఎస్‌ అధికారులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలోని ఉన్నతాధికారిని బదిలీచేయడంపై చంద్రబాబు తీవ్రంగా నిరసన తెలుపుతున్నారు. ఈసీ ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదిని కలిసి వినతిపత్రం అందించిన అనంతరం కార్యాలయం బయట చంద్రబాబు భైఠాయించి నిరసన తెలిపారు.