DailyDose

రూ.57కోట్ల బంగారాన్ని పట్టేశారు-నేరవార్తలు–04/10

gold worth 57 crores seized during indian elections 2019

*ఎన్నికల వేళ ఆంధ్రా – తమిళనాడు సరిహద్దులో భారీగా బంగారం పట్టుబడింది. సరిహద్దులోని ఆరంబాక్కంలో 57 కోట్ల రూపాయల విలువ చేసే 175 బంగారు కడ్డీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారస్తునిదిగా తేల్చారు. కాగా.. బంగారాన్ని ముంబైకి తరలిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పట్టుబడ్డ బంగారం ఎవరిదన్న విషయంపై దర్యాప్తు జరుగుతోంది.
* విమానం నుంచి రూ.77 కోట్లు చోరీ
విమానం నుంచి రూ. 77 కోట్లు విలువైన 10 మిలియన్‌ యూరోలను దోపిడీ చేసిన ఘటన అల్బేనియా రాజధాని టిరానలో చోటు చేసుకొంది. ఒక ఆస్ట్రియా విమానం టిరాన ఎయిర్‌పోర్టుకు చేరుకొంది. దీనిలోకి ప్రయాణికులు ఎక్కగానే టేకాఫ్‌కు సిద్ధమైంది. ఈ క్రమంలో అగ్నిమాపక దళం వ్యాన్‌ సాయంతో నలుగురు దుండగులు చొరబడ్డారు. వీరు నేరుగా రన్‌వే వద్ద ఉన్న విమానం సమీపంలోకి వెళ్లి పైలట్లను తుపాకులతో బెదిరించారు. అనంతరం వారిని నేలపై పడుకోబెట్టి అక్కడ ఉన్న డబ్బుతో ఉడాయించారు. ఈ క్రమంలో పోలీసులు ఆ దొంగలపైకి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక దొంగ మృతి చెందాడు. అతని వద్ద నుంచి ఏకే47, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకొన్నారు. ఈ దొంగతనంలో 2-10 మిలియన్‌ యూరోలు పోయి ఉంటాయని భావిస్తున్నారు.
* ఆర్జేడీ అధినేత, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. దాణా కుంభకోణం కేసులో లాలూకు బెయిల్‌ ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. బెయిల్‌ పిటిషన్‌ను విచారించిన కోర్టు తిరస్కరించింది. లాలూ తరపున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపించారు. 24 నెలల పాటు ఆయన జైల్లోనే ఉంటున్నారని.. ఈ కేసులో లాలూకు బెయిల్ ఇవ్వాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ధర్మాసనాన్ని కపిల్‌ సిబల్‌ కోరారు. ఇందుకు ధర్మాసనం స్పందిస్తూ.. ఆయనకు విధించిన జైలు శిక్షలతో పోలిస్తే 24 నెలలు పెద్ద విషయం కాదన్నారు.అంతకుముందు లాలూకు బెయిల్‌ ఇవ్వొద్దని సుప్రీంకోర్టును సిబిఐ కోరింది. లాలూకు ఆరోగ్యం బాగోలేదని చెప్పడంతో ఆయన్ను ఆసుపత్రిలో చేర్చామన్నారు. చికిత్స పేరుతో ఆయన రాజకీయ కార్యకలాపాలు సాగించారన్నారు. ఆరోగ్యం బాగోలేదని చెప్పిన వ్యక్తి ఇప్పుడు అంత ఫిట్‌గా ఎలా అయ్యారని సిబిఐ ప్రశ్నించింది. ఆయనకు బెయిల్‌ ఇస్తే ఎన్నికలను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని సీబీఐ వాదించింది.1990ల్లో బిహార్‌లో చోటుచేసుకున్న దాణా కుంభకోణానికి సంబంధించి పలు కేసుల్లో లాలూ ప్రసాద్ యాదవ్ దోషిగా శిక్ష అనుభవిస్తున్నారు. లాలూ ప్రస్తుతం రాంచీలోని బిర్సా ముందా జైల్లో ఉన్నారు. బెయిల్‌ కోసం లాలూ జనవరి 10న ఝార్ఖండ్‌ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆయన అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించడంతో లాలూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఇక్కడ కూడా నిరాశే ఎదురైంది. బెయిల్‌ మంజూరు చేసేందుకు న్యాయస్థానం నిరాకరించింది.
* ఇది వరకే మ్యూచువల్‌ ఫండ్‌ సేవలను అందిస్తున్న పేటీఎం, ఇప్పుడు స్టాక్‌ బ్రోకింగ్‌ ,ఇన్సూరెన్స్‌‌, లోన్ల విభాగాల్లోకి కూడా వస్తోంది. మరికొన్ని నెలల్లో ఈ కొత్త సేవలను ప్రారంభిస్తామని తెలిపింది. పేటీఎం ఫౌండర్‌ విజయ్‌ శేఖర్‌శర్మ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. పేమెంట్స్‌‌ సొల్యూషన్స్‌‌లో ఇవి ప్రధానమైనవని అన్నారు. పేటీఎం పేమెంట్‌‌ ఆక్సెప్ట్‌‌ నెట్‌‌వర్క్‌ను మరింత విస్తరిస్తామని, దీనివల్ల కస్టమర్లకు మరిన్ని ఆఫర్లు అందుతాయని చెప్పారు. ఇలాంటి ప్రొడక్ట్స్‌ విక్రయాలకు ఇండియా మార్కెట్లో పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని శర్మ చెప్పారు.
* రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందక మండలంలోని ఉమ్మెంతాల గ్రామానికి చెందిన కర్రెరాజు(23) మృతిచెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు. వారి కథనం ప్రకారం.. కర్రె రాజు కళ్లుపంట చేను దగ్గర అస్వస్థతకు గురయ్యాడు. కళ్లు తిరుగుతుండడంతో మంగళవారం ఉదయం ఆస్పత్రికి వచ్చాడు. కానీ, ఇక్కడ వైద్యులు ఎవరూ అందుబాటులో లేరు. హాస్పిటల్లో ఇద్దరు డాక్టర్లు, ముగ్గురు స్టాఫ్ నర్సులు ఉండాల్సి ఉంది. కానీ, డాక్టర్లు రాలేదు. నర్స్లకు చెప్పినా పట్టించుకోలేదని వారు ఆరోపించారు. నిజానికి మంగళవారం పీఎం సురక్షా మాతృత్వ అభియాన్ కార్యక్రమం ఉన్నా.. డాక్టర్లు రాకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇదే హాస్పిటల్ లో గతంలో డాక్టర్లు లేకుండానే గర్భిణులకు డెలివరీలు జరిగాయి.రాజు మృతికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తుంది.
* పోలీస్ అధికారిణిని కొట్టిన ముగ్గురు మహిళలను ఉత్తరప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ అధికారిణి రీటా కుమారి మంగళవారం సీతాపూర్ జిల్లా ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఆస్పత్రిలో ముగ్గురు మహిళలు లైన్‌లో వెళ్లకుండా..అందరికంటే ముందే వెళ్లేందుకు ప్రయత్నించారు. రీటా కుమారి వారిని అడ్డుకోవడంతో..ఆ ముగ్గురు మహిళలు రీటా కుమారిని కొట్టారు. తమకు ఈ ఘటనపై వచ్చిన రిపోర్టు ఆధారంగా ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకుని ..వారిపై కేసు నమోదు చేశామని సీతాపూర్ సర్కిల్ ఆఫీసర్ యోగేంద్రసింగ్ చెప్పారు.
* సముద్రపు అలల అందాలను వీక్షించడంతో పాటు, అందమైన అమ్మాయిల వంపు సొంపు వయ్యారాలు బీచ్ పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి. నలుగురు కలిస్తే నాలుగు కబుర్లతో పాటు సెల్ఫీలు, ఫొటోలంటూ హడావిడి చేస్తారు. మరి బీచ్‌కి వెళ్తే చేతులు ఊరుకుంటాయా. సముద్రంలో కొట్టే కేరింతలను ఫొటోల్లో బంధించేయము. కానీ థాయ్‌ల్యాండ్ బీచ్‌లో అలా చేస్తామంటే కుదరదు. కెమెరా క్లిక్‌మనిపించిన మరుక్షణం ఎయిర్ నేవిగేషన్ అధికారులు వచ్చి పట్టుకుపోతారు. జైలుకి పంపిస్తారు కొన్ని కేసుల్లో అయితే ఉరి శిక్ష కూడా వేస్తారు.
* ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నపుడు అనుమతి లేకుండా ఆదాయ పన్నుల (ఐటీ) శాఖ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టిన కారణంగా కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామితోపాటు ఉప ముఖ్యమంత్రిపై ఐటీశాఖ మంగళవారం ఫిర్యాదు చేసింది. పత్రాలు, ఫొటోలు ఆధారాలుగా చూపి ఐటీశాఖ ఫిర్యాదు చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సంజీవ్‌ కుమార్‌ వెల్లడించారు. గత నెలలో మండ్య, హాసనలో జనతాదళ్‌ నేతలు, మంత్రుల కార్యాలయాలు, వారి సన్నిహితుల నివాసాలు, వ్యాపార సంస్థలపై ఐటీ అధికారులు దాడులు చేసి సోదాలు నిర్వహించారు. ఇందుకు నిరసనగా ముఖ్యమంత్రి కుమారస్వామితోపాటు మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి జి.పరమేశ్వర్‌, మంత్రి డి.కె.శివకుమార్‌ తదితరులు బెంగళూరులోని ఐటీ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ప్రవర్తనా నియమావళి అమల్లో ఉండగా కనీస అనుమతి లేకుండా వీరంతా ఆందోళన చేపట్టటం నిబంధనలను ఉల్లంఘించినట్లేనంటూ కర్ణాటక గోవా డీజీ బాలకృష్ణన్‌ స్పష్టం చేసినట్లు ఐటీ అధికారులు ఈ ఫిర్యాదులో ప్రస్తావించారు. ఈ విషయంపై న్యాయ నిపుణులతో చర్చించి చర్యలు చేపడతామని సంజీవ్‌ కుమార్‌ తెలిపారు.
* ఇంట్లో నిద్రిస్తున్న యువతి దారుణ హత్యకు గురైన ఘటన మంగళవారం అర్ధరాత్రి నల్గొండ జిల్లా చందంపేట మండలం పోలేపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శిరీష (21)ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఆమె దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ కళాశాలలో ఇటీవలే బీఎస్సీ ఫస్ట్ ఇయర్ పూర్తి చేసింది. చిన్నతనంలో తల్లిదండ్రులను కోల్పోవడంతో తన నానమ్మయిన అందుగుల ఎల్లమ్మ వద్ద ఉంటూ శిరీష చదువుకుంటోంది. మంగళవారం రాత్రి సమయంలో శిరీష తన నాయనమ్మతో కలిసి ఆరుబయట నిద్రిస్తుండగా అర్ధరాత్రి కొందరు దుండగులు ఆమెపై కత్తులతో దాడి చేశారు. తీవ్ర గాయాలు కావడంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని హత్యకు గల కారణాలను రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.
*‘హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌ కోర్టు చెక్‌బౌన్స్‌ కేసు తీర్చు ఇచ్చిన తర్వాత న్యాయస్థానాన్ని నేను తప్పుదోవ పట్టించానని మోహన్‌బాబు పత్రికా ప్రకటనలో పేర్కొనడం దిగ్భ్రాంతికి గురి చేసింది’ అని దర్శకుడు వైవీఎస్‌ చౌదరి పేర్కొన్నారు. ఇప్పుడు తన స్థలంలోకి తను వెళ్లకుండా మోహన్‌బాబు అడ్డుకుంటున్నారని, ఈ మేరకు ఆయనకు లీగల్‌ నోటీసు పంపానని అన్నారు. దీనిపై వైవీఎస్‌ చౌదరి ఓ ప్రకటన విడుదల చేశారు.
*జమ్మూ కాశ్మీర్ లో అవడం మరోసారి పెట్రేగిపోయింది ఆరెస్సెస్ నాయకుడు చందర్ కాంత్ శర్మ ఆయన వ్యక్తిగత భద్రతాధికారి రాజేంద్రార్ ను ఓ ముష్కరుడు కాల్చి చంపారు. కిస్తావార్ పట్టణంలో ఈ ఘటన జరిగింది. దీంతో ఆ ప్రాంతంలో అధికారులు కర్ఫ్యూ విధించారు. మంగళవారం 12.30కు చందర్ కాంత్ ఆయన భద్రతాధికారి కిస్తావర్ లోని ఓ ఆరోగ్య కేంద్రానికి వెళ్లారు. ఆయన కదలికలను గమనిస్తున్న ఓ ఉగ్రవాది వెంటనే ఆ ప్రమ్గానంలో చోచ్చుకొచ్చాడు. చందర్ కాంత్ పై కాల్పులు జరిపాడు పీఎస్వో అక్కడికక్కడే చనిపోగా, చందర్ కాంత్ కు గాయాలయ్యాయి. ఆయనకు వాయు మార్గంలో ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. కాల్పుల అనంతరం పీఎస్వో తుపాకీని తీసుకొని ఉగ్రవాది పరారయ్యాడు.
*తన ఫోన్ తో పాటు తమ పార్టీకి చెందిన నేతల ఫోన్లను పోలీసు అధికారులు ట్యాప్ చేస్తున్నారని పేర్కొంటూ వైకాపా ప్రధాన కార్యదర్శి రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంలో ప్రమాణ పత్రాలు దాఖలు చేయాలనీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. కేంద్ర హోమశాఖ, టెలి కమ్యునికేషన్ శాఖ కార్యదర్శి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోం శాఖ ముఖ్య కార్యదర్శి డీజీపీ ఇంటలిజెన్స్ అదనపు డీజీ, ఎన్నికల సంఘం తదితరులకు నోటీసులు జరీ చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్తేస్ట్ ఏవీ శేషసాయి జస్టిస్ దుర్గాప్రసాద్ తో కూడిన ధర్మాసనం మంగళవారం ఈమేరకు ఆదేశించింది. విచారణను ఈనెల 22కు వాయిదా వేసింది.
*ఇంట్లో నిద్రిస్తున్న యువతి దారుణ హత్యకు గురైన ఘటన మంగళవారం అర్ధరాత్రి నల్గొండ జిల్లా చందంపేట మండలం పోలేపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.
*నారాయణపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మరికల్‌ మండలం తీలేరులో 10 మంది ఉపాధి కూలీలు మృతిచెందారు. ఉపాధి హామీ పనుల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. కుంటలు తవ్వుతుండగా.. మట్టిదిబ్బలు విరిగి కూలీల మీద పడడంతో 10 మంది మృత్యువాత పడ్డారు. మరికొందరు మట్టిదిబ్బల్లో చిక్కుకున్నట్లు సమాచారం. మృతుల సంఖ్యను అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది. మట్టి దిబ్బలు తొలగించాక మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
*విజయనగరం జిల్లా డెంకాడ మండలం పోతయ్యపాలెంలో మంగళవారం నెల్లిమర్ల వైకాపా అభ్యర్థి బడ్డుకొండ అప్పలనాయుడు ప్రచారంలో భాగంగా పెద్ద ఎత్తున బాణసంచా కాల్చడంతో పక్కనే ఉన్న పూరిళ్లపై పడి భారీ అగ్ని ప్రమాదం జరిగింది.
*కర్నూలు జిల్లాలో ఎన్నికల ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు మంగళవారం రూ.86.18 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.పలుచోట్ల నగదుతో పాటు మద్యం సీసాలను పట్టుకున్నారు. కోసిగి మండలంలో ఆరు నాటు బాంబులు స్వాధీనం చేసుకున్నారు.
*తమిళనాడులో ఎన్నికల నేపథ్యంలో జరిపిన తనిఖీల్లో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.360.84 కోట్ల నగదు, నగలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సత్యప్రద సాహు మంగళవారం వెల్లడించారు.
*గుంటూరు జిల్లా నిజాంపట్నంలో తెదేపా కార్యకర్తలపై వైకాపాకు చెందిన కార్యకర్తలు దాడి చేసి గాయపరిచారు.
*నిలోఫర్‌ ఆసుపత్రితో ఓ బాలుడు మృతి చెందాడు. ‘బాలుడికి అత్యవసర విభాగంలో వైద్య పరీక్షలు నిర్వహించి వెంటనే శస్త్రచికిత్స చేయాలని, లేకపోతే బతకడం కష్టం’ అని చెప్పిన వైద్యులే 24 గంటల పాటు కాలయాపన చేయడంతో దారుణం జరిగిందని బంధువులు ఆరోపించారు.
*నిలోఫర్‌ ఆసుపత్రితో ఓ బాలుడు మృతి చెందాడు. ‘బాలుడికి అత్యవసర విభాగంలో వైద్య పరీక్షలు నిర్వహించి వెంటనే శస్త్రచికిత్స చేయాలని, లేకపోతే బతకడం కష్టం’ అని చెప్పిన వైద్యులే 24 గంటల పాటు కాలయాపన చేయడంతో దారుణం జరిగిందని బంధువులు ఆరోపించారు.
*హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌ కోర్టు చెక్‌ బౌన్స్‌ కేసులో తీర్పు ఇచ్చిన తర్వాత న్యాయస్థానాన్ని తాను తప్పుదోవ పట్టించానని సినీనటుడు మోహన్‌బాబు పత్రికా ప్రకటనలో పేర్కొనడం తనను దిగ్భా‌్రంతికి గురి చేసిందని అని సినీ దర్శకుడు వైవీఎస్‌ చౌదరి పేర్కొన్నారు.
*వికారాబాద్‌ జిల్లా యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్‌ చెక్‌పోస్టు సమీపంలో ఉన్న ఓ పెట్రోల్‌ బంక్‌లో మంగళవారం మద్యం పంపిణీ చేయడం కలకలం రేపింది.
*అంతర్‌ రాష్ట్ర కలప స్మగ్లర్‌ ఎడ్ల శ్రీనివాస్‌ అలియాస్‌ పోతారం శ్రీనును రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ అధికారులు అరెస్టు చేశారు.
*విజయనగరం జిల్లా డెంకాడ మండలం చల్లంగిపేట పంచాయతీ శివారులోని పోతయ్యపాలెం గ్రామంలో వైకాపా కార్యకర్తల అత్యుత్సాహానికి 29 పూరిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. నెల్లిమర్ల వైకాపా అభ్యర్థి బడుకొండ ప్రచారం చేస్తుండగా కార్యకర్తలు బాణసంచా కాల్చారు.
* హైదరాబాద్‌లో మరోసారి భారీగా నగదు పట్టుబడింది. నారాయణగూడలో రూ.8 కోట్లు స్వాధీనం చేసుకున్న మరుసటి రోజే లంగర్‌ హౌస్‌లో మంగళవారం ఉదయం రూ.2.4 కోట్లను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నగదును కారులో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. నగదును పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
*ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో మంగళవారం మావోయిస్టులు మందుపాతర పేల్చిన ఘటనలో భాజపా ఎమ్మెల్యే మండావి భీమా సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. బస్తర్‌ లోక్‌సభ స్థానం పరిధిలోని బచేలీలో ప్రచారాన్ని ముగించుకుని ఎమ్మెల్యే కువ్వకొండకు వెళ్తుండగా మావోయిస్టులు ఈ దారుణానికి పాల్పడ్డారు. భాజపా నేతలు వెళుతున్న వాహనశ్రేణి లక్ష్యంగా రహదారిపై అమర్చిన మందుపాతరను పేల్చడంతోపాటు కాల్పులకు దిగినట్లు పోలీసులు తెలిపారు. ఈఘటనలో ఎమ్మెల్యే వాహనం తునాతునకలైంది.
*పోలీసులు ఎంత నిఘా పెట్టినా నగదు పంపిణీ ఆగటం లేదు. మంగళవారం బుచ్చిరెడ్డిపాళెంలో పలుచోట్ల నగదు పంచుతున్న ముగ్గురు వైకాపా కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఓటరు స్లిప్‌లతో పాటు రూ.45వేల నగదు పట్టుకుని సీజ్‌చేసినట్లు ఎస్‌ఐ ప్రసాద్‌రెడ్డి తెలిపారు.
*పార్లపల్లిలోని రాళ్లమిట్ట వద్ద వైకాపాకు చెందిన వ్యక్తులు మంగళవారం ఓటర్లకు రూ. లక్ష నగదు పంపిణీ చేస్తుండగా సమాచారం తెలుసుకున్న ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారి రామచంద్రరావు, పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని స్వాధీÅనం చేసుకున్నట్లు చెప్పారు.
*తెలంగాణ గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలోని అధ్యయన కేంద్రాల్లో శిక్షణ పొందిన 712 మందిలో 514 మంది పోలీసు ఉద్యోగాల ప్రధాన పరీక్షకు ఎంపికయ్యారు. అలా అర్హత సాధించినవారిలో హైదరాబాద్‌లో 27, వరంగల్‌లో 130, ఉట్నూరులో 169మంది అభ్యర్థులున్నారని; కొత్తగూడెంలో 188మంది దేహదారుఢ్య పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారని శాఖ కమిషనర్‌ క్రిస్టీనా తెలిపారు.
*లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా గురువారం ఉద్యోగులు, కార్మికులు ఓటుహక్కు వినియోగించుకునేలా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు కర్మాగారాలు, పారిశ్రామిక సంస్థల్లో పనిచేస్తున్నవారికి వేతనంతో కూడిన సెలవుదినంగా ప్రకటిస్తూ, కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ శశాంక్‌ గోయల్‌ ఉత్తర్వులు జారీచేశారు.
*రాష్ట్రప్రభుత్వ ఆధ్వర్యంలోని గురుకుల జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్‌ మొదటి సంవత్సర ప్రవేశ పరీక్షకు దరఖాస్తు గడువును పొడిగించారు. విద్యార్థులు ఈ నెల 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సొసైటీ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. సొసైటీ కింద 35 జూనియర్‌ కళాశాలలు ఉన్నాయన్నారు.
*పోలింగ్‌కు మరో రెండు రోజులే సమయం ఉందనగా.. మంగళవారం సాయంత్రం ఎన్నికల సంఘం మరో ఎస్పీపై బదిలీ వేటేసింది. ప్రకాశం జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్‌ను బదిలీ చేసి, ఆయన స్థానంలో గుంతకల్లు రైల్వే ఎస్పీగా పనిచేస్తున్న సిద్ధార్థ కౌశల్‌ను నియమించింది. ఈ ఆదేశాలను బుధవారం ఉదయం 10 గంటల్లోగా అమలు చేసి, నివేదిక అందజేయాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యానికి సూచించింది.