NRI-NRT

TPAD ఆధ్వర్యంలో 450మందికి అన్నదానం

tpad donates food to 450 homeless people in texas

సాంఘికపరమైన బాధ్యతలో భాగంగా డాలస్ తెలంగాణ ప్రజాసమితి (టీపాడ్)నిర్వహించిన కార్యక్రమాలలో భాగంగా సుమారు నాలుగువందల యాభై మంది ఆస్టిన్ స్ట్రీట్ సెంటర్ నిరాశ్రయులకు అన్నదానం నిర్వహించారు. ఉత్తర టెక్సస్ డాలస్ ప్రాంతంలో, వేలాదిమంది నిరాశ్రయుల కుటుంబాలు ఆకలి బాధకు గురి అవుతున్నారు. ఈఆకలి ఒక సమస్యగా మారి తలదాచుకోవడానికి స్వంతగూడు/ఇల్లు లేక కడుపునిండా తినడానికి నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. టీపాడ్ తన సాంఘిక భాద్యతగా ఆస్టిన్ స్ట్రీట్ సెంటర్ నిరాశ్రయులకు అండగా నిలిచి వారికి గౌరవప్రదమైన జీవనాన్ని గడిపే ప్రతి అడుగులోనూ తోడుగా ఉండేందుకు నిర్ణయించింది. ఈ నూతన సంవత్సరంకాలంలో , రెండు వారాల వ్యవధిలో టీపాడ్ సంస్థ తీసుకొన్న రెండవ సామాజిక భాద్యత “ఫుడ్ డ్రైవ్”. టీపాడ్ సంస్థ చేపట్టిన మొదటి కార్యక్రమం గత నెలలో 23వ తేదీన రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయటము, రెండవది ఏప్రిల్ 6న, నిరాశ్రయులకు పౌష్టిక సమతుల్యమైన, బలవర్ధకమైన పోషక విలువలు కలిగిన శుచిగా వండిన ఆహారాన్ని అందివ్వటం . కేవలం ఆహారాన్ని వండి పెట్టటమే కాకుండా, వారికి అవసరమైన , దుస్తులు, అత్యవసర వస్తువులు కూడా సమకూర్చి ,సహాయపడ్డారు.ఈ “ఫుడ్ డ్రైవ్” సహాయ కార్యక్రమ నిర్వహణ చంద్రారెడ్డి పోలీస్ టీపాడ్ ప్రెసిడెంట్, రవికాంత్ రెడ్డి మామిడి వైస్ ప్రెసిడెంట్ , లక్ష్మి పోరెడ్డి జాయింట్ సెక్రటరీ కార్యక్రమ సమన్వయ కర్తలు, టీపాడ్ ఫౌండేషన్ కమిటీ జానకి రామ్ మందాడి, రాజ వర్ధన్ గొంది, అజయ్ రెడ్డి, రావు కలవల, మహేందర్ కామిరెడ్డి, రఘు వీర్ బండారు, ఉపేందర్ తెలుగు, రామ్ అన్నాడి, అశోక్ కొండల, బోర్డు అఫ్ ట్రస్టీస్ పవన్ గంగాధర, మాధవి సుంకిరెడ్డి, సుధాకర్ కలసాని, ఇంద్రాణి పంచార్పుల, బుచ్చి రెడ్డి గోలి, శారద సింగిరెడ్డి, ఆఫీస్ బేరర్స్ కమిటీ మాధవి లోకిరెడ్డి జనరల్ సెక్రటరీ, అనురాధ మేకల ట్రెసరర్, శంకర్ పరిమళ్ జాయింట్ ట్రెసరర్, ఎగ్జిక్యూటివ్ కమిటీ శ్రీనివాస్ వేముల, రత్నఉప్పాల, రూపకన్నయ్య గిరి, మధుమతి వ్యాసరాజు, దీప్తి సూర్యదేవర, శరత్ ఎర్రం, రోజా అడెపు, లింగారెడ్డి, అడ్వైజరి కమిటీ సభ్యులు వేణు భాగ్యనగర్, విక్రమ్ జంగం, నరేష్ సుంకిరెడ్డి , కరణ్ పోరెడ్డి , జయ తెలకలపల్లి, సురేందర్ చింతల,అరవింద్ ముప్పిడి, గంగ దేవర, సతీష్ నాగిళ్ల , సంతోష్ కోరె, కళ్యాణి తాడిమెట్టి , కొలాబరేషన్ కమిటీ, వంశీ కృష్ణ , స్వప్న తుమ్మపాల, శ్రీనివాస్ తుల, విజయ్ రెడ్డి, అపర్ణ కొల్లూరి,అనూష వనం, శశి రెడ్డి కర్రి, మంజుల తొడుపునూరి , మాధవి ఓంకార్, గాయత్రి గిరి , జయశ్రీ మురుకుట్ల, రవీంద్ర ధూళిపాళ, శ్రీనివాస్ కూటికంటి,శరత్ పున్ రెడ్డి,శ్రీధర్ కంచర్ల, శ్రీనివాస్ అన్నమనేని, స్రవణ్ నిడిగంటి, నితిన్ చంద్ర, అపర్ణ సింగిరెడ్డి, కామేశ్వరి దివాకర్ల, కవిత బ్రహ్మదేవర,నితిన్ కొర్వి , సుగాత్రి గుడూరు, మాధవి మెంట ,వందన గోరు,ధనలక్ష్మి రావుల, లావణ్య యరకాల, శ్రీకాంత్ రౌతు, తిలక్ వన్నంపుల ఆధ్వర్యములో జరుపబడినది. ఈ కార్యక్రమo టీపాడ్ కార్య వర్గ బృందానికి, యువ స్వచ్ఛందసేవకులకు నూతన ఉత్తేజాన్ని ఇవ్వటమే కాకుండా, సంఘంపట్ల మనకుఉండవలసిన కర్తవ్యాన్ని, దీక్షను చాటిచెప్పింది. తెలుగు నూతన సంవత్సరాది నాడు జరిగిన ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతిఒక్కరిలోనూ సేవాభావాన్ని,ఎదుటి వారికి సహాయంచేయడంలో వున్నసంతోషాన్ని తెలియచేసింది. ఆస్టిన్ స్ట్రీట్ సెంటర్ యాజమాన్యం టీపాడ్ సంస్థ చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ఎంతో కొనియాడారు . మానవతా దృక్పధంతో ముందడుగు వేసిన టీపాడ్ సంస్థకు తమ ధన్యవాదములు తెలిపారు.
tpad donates food to 450 homeless people in texas
tpad donates food to 450 homeless people in dallas