Business

నా యుద్ధం ఆగలేదు. ఆగదు కూడా!

trump says his trade wars arent done yet

తన వాణిజ్య యుద్ధాలు ఇంకా ముగియలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పష్టమైన సందేశం పంపించారు. వాషింగ్టన్‌లో ఐఎంఎఫ్‌, వరల్డ్‌బ్యాంక్‌ స్ప్రింగ్‌ మీటింగ్స్‌ కోసం ఆర్థిక విధాన కర్తల సమావేశంలో ఆయన ఈ సందేశాన్ని వెల్లడించారు. ‘నా వాణిజ్య యుద్ధాలు ఇప్పటి వరకు పూర్తికాలేదు. బలహీన పడుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవప్థను ఎదుర్కొని తీరాల్సిందే’ అనే సందేశాన్ని ఇచ్చారు. తాజాగా యూరోపియన్‌ యూనియన్‌ నుంచి దిగుమతి అయ్యే 11 బిలియన్ డాలర్ల విలువైన హెలికాప్టర్లు, చీజ్‌ వంటి వాటిపై పన్నులు విధించారు. ఒక పక్క చైనాతో ఒప్పందం చేసుకొనేందుకు చర్చలు జరుపుతూనే మరోపక్క వివిధ దేశాలతో ఉన్న వాణిజ్య ఒప్పందాలను పునర్‌ లిఖించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. దీంతో ట్రంప్‌ చర్యలపై ఆర్థిక వేత్తలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రపంచ వృద్ధిరేటు తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా యూరోపియన్‌ యూనియన్‌ నుంచి వచ్చే దిగుమతులపై విధించిన టారీఫ్‌లు బోయింగ్‌కు లాభించనున్నాయి. కొత్త టారీఫ్‌లు ఎయిర్‌బస్‌ వ్యాపారంపై ప్రభావితం చూపించనున్నాయి. ఇది బోయింగ్‌కు కలిసి వస్తుంది. దీంతో ఎయిర్‌ బస్‌ డబ్ల్యూటీవో తలుపు తట్టనుంది. దీంతో డబ్ల్యూటీవో తీర్పు కోసం అమెరికా ఎదురు చూస్తోంది. యూరప్‌ తీరుపై ట్రంప్‌ ఎప్పటి నుంచో గుర్రుగా ఉన్నారు. ‘‘అమెరికా వాణిజ్య విధానాలను ఈయూ బాగా వాడుకొంది. త్వరలోనే దానికి ముగింపు పడుతుంది.’’ అని ట్రంప్‌ మంగళవారం ట్విటర్లో పేర్కొన్నారు.