Devotional

14న శ్రీరామ పునర్వసు దీక్ష

srirama punarvasu deeksha 2019

1. ఏప్రిల్ 14న శ్రీరామ పునర్వసు దీక్ష ప్రారంభం – తదితర ఆద్యాత్మిక వార్తలు
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం నందు ఈనెల 14న చైత్రమాసంలో శ్రీరామ పునర్వసు దీక్ష ప్రారంభించనున్నట్లు దేవస్థానం ఈవో తాళ్లూరి రమేష్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 14న (ఆదివారం) సాయంత్రం 6గంటలకు విశ్వక్సేన పూజ, పుణ్యఃవచనం, దీక్షాధారణ నిర్వహించడం జరుగుతుందన్నారు. మే 10వ తేదీ (శుక్రవారం) ఉదయం 6గంటలకు పాదుకాపూజ, తిరువడి ధా రణ, సంక్షేప రామాయణ హవనం, పూర్ణాహుతి, గిరి ప్రదక్షిణ, దీక్షా విరమణ, రాత్రి 7గంటలకు రథో త్సవం ఉంటుందన్నారు. మే11వ తేదీ (శనివారం) ఉదయం 11.30 నిమిషాలకు శ్రీరామ పట్టాభిషేకోత్సవం నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో రమేష్‌బాబు పేర్కొన్నారు
2. వేడుకగా కొనసాగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు
జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. బుధవారం శ్రీవారు, అమ్మవార్లను పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెలుగా అలంకరించారు. అభ్యంగన స్నానం ఆచరింపజేసి, పంచామృతాదులతో అభిషేకించారు. నూతన వస్త్రధారణ, కల్యాణ తిలకం దిద్ది శ్రీవారిని పెండ్లి కుమారుడిగా, అమ్మవార్లను పెండ్లి కుమార్తెలుగా అలంకరించారు. అనంతరం నీరాజన మంత్రపుష్పం జరిపి, భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించి, అన్నపూర్ణ భవన్‌లో అన్నదానం చేశారు. ప్రాంగణంలో గోపూజ నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి పి.ఉదయ్‌భాస్కర్‌, ధర్మకర్త ఉప్పల వెంకటజయదేవ్‌శర్మ, ఆలయ ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాస్‌శర్మ, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
3. వారికి రూ.3 కోట్ల విరాళం
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారికి బుధవారం రూ.3 కోట్ల విరాళం వచ్చింది. చెన్నైకి చెందిన వి.శ్రీనివాసులు, శాంతి దంపతులు రూ.2 కోట్ల విరాళాన్ని శ్రీవేంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టుకు అందజేశారు. జెమ్లీ ఐటీ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ రూ.కోటి విరాళాన్ని ప్రాణదానం ట్రస్టుకు ఇచ్చింది. విరాళాలకు సంబంధించిన డీడీలను తిరుమల దాతల విభాగం డిప్యూటీ ఈవో లక్ష్మణ్‌ నాయక్‌ స్వీకరించారు.
4. సీతారామ కల్యాణ క్రతువుకు అంకురార్పణ
భద్రాద్రి సీతారాముల ఆలయంలో 14న శ్రీరామనవమి వేళ జగత్‌ కల్యాణం, 15న పట్టాభిషేకం సందర్భంగా..బుధవారం అంకురార్పణ పూజలు నిర్వహించారు. స్వామికి అభిషేకం చేసి, ఊరేగింపుగా తాతŸ గుడికి వెళ్లి, పుట్ట మట్టిని పూజించి పాలికల్లో పోశారు. వేద మంత్రాలు మిన్నంటుతుండగా అంకురార్పణ జరిపారు. గురువారం గరుడ లేఖన పూజలు ఉంటాయి.
5. 17 నుంచి శ్రీవారికి వసంతోత్సవాలు
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారికి ఈనెల 17 నుంచి 19 వరకు వసంతోత్సవాలు తితిదే నిర్వహించనుంది. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఉదయం 7 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి తిరువీధుల్లో ఊరేగుతూ వసంత మండపానికి వేంచేయనున్నారు. ఇక్కడ వసంతోత్సవ అభిషేకం పూర్తయిన అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుంటారు. రెండో రోజు 18న ఉభయ దేవేరులతో కలిసి ఉదయం 8 నుంచి 9 గంటల మధ్య స్వర్ణరథాన్ని అధిరోహించి తిరువీధుల్లో ఊరేగనున్నారు. అనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు. చివరిరోజు 19న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి వారితో పాటు శ్రీసీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి, రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి మందిరానికి వేంచేయనున్నారు. ఉత్సవాల సందర్భంగా ప్రతి రోజు మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటల నుంచి 6.30 గంటల వరకు ఆస్థానం చేపడతారు. వసంతోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 17న సహస్రకలశాభిషేకం, 18న తిరుప్పావడ సేవ, 19న నిజపాద దర్శనం సేవలను రద్దు చేస్తున్నట్లు తితిదే తెలిపింది. 17 నుంచి 19 వరకు కల్యాణోత్సవం, ఊంజలసేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది.
6. శుభమస్తు
తేది : 11, ఏప్రిల్ 2019
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : చైత్రమాసం
ఋతువు : వసంత ఋతువు
కాలము : వేసవికాలం
వారము : గురువారం
క్షం : శుక్లపక్షం
తిథి : షష్టి
(నిన్న సాయంత్రం 3 గం॥ 34 ని॥ నుంచి
ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 38 ని॥ వరకు)
నక్షత్రం : మృగశిర
(నిన్న ఉదయం 10 గం॥ 33 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 10 గం॥ 23 ని॥ వరకు)
యోగము : శోభనము
కరణం : తైతిల
వర్జ్యం : (ఈరోజు రాత్రి 6 గం॥ 36 ని॥ నుంచి ఈరోజు రాత్రి 8 గం॥ 9 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు తెల్లవారుజాము 1 గం॥ 38 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 3 గం॥ 13 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 10 గం॥ 12 ని॥ నుంచి ఈరోజు ఉదయం 11 గం॥ 1 ని॥ వరకు)(ఈరోజు సాయంత్రం 3 గం॥ 11 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 0 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 50 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 23 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 9 గం॥ 10 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 43 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 12 గం॥ 17 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 50 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 3 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 31 ని॥ లకు
సూర్యరాశి : మీనము
చంద్రరాశి : మిథునము