Movies

మళయాళంలోకి

shobana returns to malayalam

యాక్టర్‌గా, డ్యాన్సర్‌గా శోభనను సిల్వర్‌ స్కీన్‌పై మిస్‌ అవుతున్నారు ఆమె అభిమానులు. 2005 నుంచి ఇప్పటివరకూ చాలా తక్కువ సినిమాల్లో కనిపించారు శోభన. 2013లో ‘తిర’ అనే మలయాళ చిత్రం, 2014లో ‘కొచ్చడయాన్‌’ అనే తమిళ చిత్రంలో కనిపించారు. ఆరేళ్ల గ్యాప్‌ తర్వాత మళ్లీ ఓ మలయాళ చిత్రంలో కనిపించడానికి శోభన అంగీకరించారు. నజ్రియా నజీమ్, శోభన కీలక పాత్రల్లో నూతన దర్శకుడు అనూప్‌ సత్యన్‌ ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో సురేశ్‌ గోపి కీలక పాత్రలో కనిపిస్తారు. ‘మణిచిత్రతాళే, ఇన్నలే, కమీషనర్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ సినిమాల్లో కలసి నటించారు శోభన, సురేష్‌ గోపి. 2005లో ‘మక్కళుక్కు’ అనే సినిమాలో కనిపించిందీ జోడీ. మరి తాజా చిత్రంలో జంటగా నటిస్తున్నారా? అనేది తెలియాల్సి ఉంది. జూన్‌లో ఈ సినిమా ఆరంభం కానుంది.