DailyDose

ఎమ్మెల్యే బొండా ఉమాపై కేసు-నేరవార్తలు–04/16

case on bonda uma and son

*విజయవాడ సెంట్రల్ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్ధి బొండా ఉమా పై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో దౌర్జన్యాలకు, బెదిరింపులకు పాల్పడిన ఘటనలో బొండా ఉమాతో పాటు ఆయన కుమారులు సిద్దార్ద, రవితేజల పైనా కూడా పోలీసులు కేసు నమోదు చేసారు. ఈనెల ఎనిమిదిన విజయవాడలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సిద్దార్ధ, రవితేజలు రౌడీ యిజానికి పాల్పడిన సంగతి తెలిసిందే. మైకులో రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడమే కాకుండా పారిశ్రామికవేత్త కోగంటి సత్యం పై దౌర్జన్యానికి దిగారు. ఇంతలో అక్కడికి వచ్చిన బొండా ఉమా నీ అంతు చూస్తా అంటూ సత్యం పై బెదిరింపులకు దిగారు. ఈ ఘటన పై ఫిర్యాదు రావడంతో అజిత్ సింగ్ నగర్ పోలీసులు బొండా ఉమాతో పాటు ఆయన కుమారుల పై కేసు నమోదు చేసారు.
* బీటెక్‌ విద్యార్థిని అనుమానాస్పద మృతి విశాఖ నగరంలో తీవ్ర కలకలం రేపింది. బుల్లయ్య కళాశాలలో ఇంజినీరింగ్‌ చదువుతున్న జ్యోత్స్న అనే విద్యార్థిని అక్కయ్యపాలెంలోని లెక్చరర్‌ ఇంట్లో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడంతో అనుమానాలు తలెత్తాయి. మల్కాపురం ప్రకాశ్‌ నగర్‌కు చెందిన జోత్స్న ఏడాదిన్నర కాలంగా అంకుర్ కిష్‌లే అనే లెక్చరర్‌ వద్ద ఐఐటీ కోచింగ్‌కు సంబంధించి సలహాలు తీసుకుంటోంది. బిహార్‌లోని పట్నాకు చెందిన అంకుర్‌.. అక్కయ్యపాలెంలోని అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాడు. నిన్న ఉదయం అంకుర్‌ ఇంటికి వెళ్లిన జ్యోత్స్న అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయింది. ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి అంకుర్‌ చెప్పడంతో ఈ ఉదంతం వెలుగు చూసింది. ఆమె దేహంపై ఎటువంటి గాయాలు లేవు. గతంలో లాంగ్‌ టర్మ్‌ తీసుకునే సమయంలో అంకుర్‌తో జోత్స్నకు పరిచయం ఏర్పడినట్టు తెలుస్తోంది.
*మూసాపేట మండల కేంద్రంలోని, ముసాపేట స్టేజి సమీపంలో, జాతీయ రహదారి 44 పై, ట్రాక్టర్ ను డీ కొన్న కారు. ట్రాక్టర్ డ్రైవర్ & ఓనర్ కృష్ణ నాయక్ మృతి.
*ముమ్మిడివరం మండలం రాజుపాలెంలో స్కూల్‌ విద్యార్ధులకు ప్రమాదం తప్పింది. ట్రాన్స్‌ఫార్మర్‌ దిమ్మెను స్కూల్‌ వ్యాన్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయపడ్డ విద్యార్థులను ముమ్మిడివరం ఆస్పత్రికి తరలించారు.
*ముమ్మిడివరం మండలం రాజుపాలెంలో స్కూల్‌ విద్యార్ధులకు ప్రమాదం తప్పింది. ట్రాన్స్‌ఫార్మర్‌ దిమ్మెను స్కూల్‌ వ్యాన్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయపడ్డ విద్యార్థులను ముమ్మిడివరం ఆస్పత్రికి తరలించారు. పిల్లలకు ప్రమాదం తప్పడంతో తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు.
* కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే.. కన్న కూతురుపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నగరంలోని రాజేంద్ర నగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్ర నగర్‌ ప్రాంతానికి చెందిన వెంకటేశ్వర్లు మొదటి భార్య చనిపోవడంతో రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య కూతురిపై రెండు సంవత్సరాలు అత్యాచారాని పాల్పడుతున్నారు.
* తన ప్రాణాలకు ముప్పుందని, రక్షణ కల్పించాలంటూ సినీ నటి, కాం గ్రెస్ ఎంపీ అభ్యర్థి ఊర్మిళ మటోండ్కర్ సోమవారం పోలీసులను ఆశ్రయించా రు. ముంబై నార్త్ లోక్సభ బరిలో ఉన్న ఊర్మిళ ఎన్ని కల ప్రచారంలో భాగంగా సోమవారం బోరివలిలో రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తూ.. ‘బోరివలిలో ప్రచారం చేస్తుండగా 15 నుంచి 20 మంది అక్కడికి వచ్చి మోడీ, మోడీ అంటూ నినాదాలు చేశారు. డ్యాన్సులు చేస్తూ మాపార్టీ మహిళా కార్యకర్తలతో అభ్యంతరకర చర్యలకు పాల్పడ్డారు . తర్వాత నా వాహనం వైపు దూసుకొచ్చేందుకు ప్రయత్నించారు. మా కార్యకర్తలు వారిని అడ్డుకోవడంతో ఘర్షణ జరిగింది’ అని చెప్పారు .
* ఎస్పీడీసీఎల్‌, ఈపీడీసీఎల్‌ పరిధిలో కవర్డ్‌ కండక్టర్ల కొనుగోలులో అవకతవకలకు సంబంధించిన కేసును కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌కు అప్పగిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
*అడవిలో పులులను వేటాడి, వాటి చర్మాలను విక్రయిస్తున్న అంతర్‌ రాష్ట్ర ముఠా సభ్యులు నలుగురిని రాచకొండ ఎస్‌వోటీ పోలీసులు అరెస్టుచేశారు. వారి కథనం ప్రకారం విశాఖ మధురవాడ ప్రాంత నివాసి నాగోతి అలియాస్‌ భానుచందర్‌ (24); ఒడిశాలోని కోరాపుట్‌ ప్రాంత చందువా వాసులు వాసుదేవ్‌ మస్తీ (23), జగన్నాథ్‌ (19); మాచ్‌ఖండ్‌కు చెందిన బాలి పంగి (26) పులి వేటగాళ్లు. మాచ్‌ఖండ్‌ అటవీ ప్రాంతంలో మగ పులిని విద్యుత్‌ తీగల వలయంతో చంపి చర్మాన్ని వలిచేశారు. దాన్ని హైదరాబాద్‌లో విక్రయించడానికి కారులో బయల్దేరారు. ఎల్బీనగర్‌కు చేరుకున్నారు.ఎస్‌వోటీ పోలీసులు నిందితుల నుంచి పులిచర్మంతో పాటు గోళ్లను, కారును స్వాధీనం చేసుకున్నారు.
*సార్వత్రిక ఎన్నికల రోజు గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం ఇనిమెట్ల గ్రామంలో పోలింగ్‌ సరళిని పరిశీలించేందుకు వెళ్లిన సత్తెనపల్లి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి, సభాపతి కోడెల శివప్రసాదరావుపై దాడి చేసిన ఘటనలో ఆరుగురికి ఈ నెల 29 వరకు న్యాయస్థానం రిమాండ్‌ విధించింది.
*పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే నిర్మాణ ప్రాంతంలో సోమవారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఒక యువకుడు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఉదయం 32వ బ్లాకు వద్ద క్రేన్‌ ద్వారా రేకులు పైకి తీసుకెళుతుండగా ప్రమాదవశాత్తూ ఒక రేకు జారి అక్కడ పని చేస్తున్న భీంలేశ్‌ కుమార్‌ రామన్‌పై పడింది.
*తనపై నలుగురు అత్యాచారయత్నానికి పాల్పడటంతో మనస్తాపం చెందిన ఓ విద్యార్థిని ఆత్మాహుతి చేసుకుంది. ఈ ఘటన తమిళనాడులోని తిరువారూరు ప్రాంతంలో కలకలం సృష్టించింది. తిరువారూరు జిల్లా కూత్తానల్లూర్‌ ప్రాంతానికి చెందిన బాలిక (15) పదో తరగతి చదువుతోంది.
*బిహార్‌లో ఓ పాత్రికేయుడి కుమారుడిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. ఓ పత్రికలో పనిచేస్తున్న అశుతోశ్‌ కుమార్‌ ఆర్య ఏకైక కుమారుడిపై దాడిచేసిన దుండగులు అతని రెండు కళ్లూ పొడిచి హతమార్చారు.
*వికారాబాద్‌ జిల్లా యాలాల మండలం దౌలాపూరు గ్రామ శివారులో సోమవారం రాత్రి లారీ-ఆటో ఢీకొని నలుగురు మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో దంపతులతో పాటు తల్లి, కూతురు ఉన్నారు.
*ఝార్ఖండ్‌లోని గిరిధ్‌ జిల్లాలో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు, ఒక సీఆర్పీఎఫ్‌ జవాను చనిపోయారు. బెల్భా ఘాట్‌ ప్రాంతంలోని అడవుల్లో ఉదయం 6 గంటల సమయంలో ఈ ఎదురుకాల్పులు మొదలయ్యాయని అధికారులు చెప్పారు.
*కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం తోటచర్ల వద్ద జాతీయ రహదారిపై బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు మృతిచెందారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నందిగామ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
*జగిత్యాల జిల్లా కేంద్రంలో నడిరోడ్డుపై ఓ వ్యక్తి గొడ్డలితో దాడి చేసిన ఘటన కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జగిత్యాల పట్టణానికి చెందిన తిప్పర్తి కిషన్‌, అనంతారం గ్రామానికి చెందిన లక్ష్మణ్‌ మధ్య భూవివాదం విషయంలో తరచూ గొడవ జరుగుతోంది.
*ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ సమయంలో రాళ్ల దాడి ఘటనలో 36 మంది నిందితులకు పులివెందుల న్యాయస్థానం రిమాండ్‌ విధించింది. కడప జిల్లా వేంపల్లె మండలం అలవలపాడు పోలింగ్‌ కేంద్రం వద్ద వైకాపా, తెదేపా వర్గాలకు చెందిన కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో నిందితులను అరెస్ట్‌ చేసి కోర్టుకు తరలించినట్లు వేంపల్లె అర్బన్‌ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
*పలువురు యువకులు తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఓ మహిళ సోమవారం వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
* నల్లటి ట్రంకు పెట్టె కేవలం ప్రధాని భద్రతాపరమైన వస్తువులకు సంబంధించినదిగా గుర్తించామని చిత్రదుర్గ జిల్లా అధికారి వినోద్‌ ప్రియ స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచన మేరకు దీనిపై తాము విచారణ చేపట్టామన్నారు. ప్రధాని మోదీ ఈనెల 9న కర్ణాటకలోని చిత్రదుర్గ పర్యటన సందర్భంగా ఓ నల్లటి పెట్టె తరలింపుపై వివాదం చెలరేగిన విషయం విదితమే. ప్రధాని వచ్చిన హెలికాప్టర్‌ నుంచి ఆ పెట్టెను ఇన్నోవా కారులో చేరవేస్తున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి. కాంగ్రెస్‌ పార్టీ దానిలో ఏముందో వెల్లడించాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో జిల్లా అధికారి వినోద్‌ ప్రియ వివరణనిస్తూ ‘ప్రధాని దిగిన ప్రాంతంలోని అన్ని వాహనాలను పరిశీలించాం. హెలికాప్టర్‌ను తనిఖీ చేసేందుకు ఎస్పీజీ అనుమతి ఇవ్వలేదు. పెట్టెను తరలించిన ఇన్నోవా కారు, దాని డ్రైవర్‌ను విచారించాం. ఆ డ్రైవర్‌ చెప్పిన ప్రకారం ఈ పెట్టె భద్రతాపరమైన వస్తువులకు సంబంధించింది…’ అని ఆమె వివరించారు.
*చర్యలు ప్రతి చర్యలు ఉంటాయంటూ నియోజకవర్గ పరిధిలోని తెదేపా నేతలు తనను బెదిరిస్తున్నారని భద్రత కల్పించాలని వేమూరు వేఇకాపా అభ్యర్ధి మెరుగు నాగార్జున రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ దివ్వేడికీ సోమవారం విన్నవించారు. ఈమేరకు సచివాలయంలో దివ్వేదిని కలిసి ఆయన వినతి పత్రం అందించారు.