DailyDose

టిక్‌టాక్‌ను తక్షణమే తొలగించండి–తాజావార్తలు–04/16

indian government orders ban on tik tok app from google and apple app stores

*పాపులర్‌ చైనీస్‌ షార్ట్‌-వీడియో మొబైల్‌ యాప్‌ ‘టిక్‌టాక్‌’ను వెంటనే గూగుల్‌, యాపిల్‌ సంస్థలు తమ యాప్‌స్టోర్ల నుంచి తొలగించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. యాప్‌ను నిషేధించాలంటూ గతంలో మద్రాస్‌ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖ మంగళవారం ఈ నిర్ణయం తీసుకుంది. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని టిక్‌టాక్‌ సంస్థ సుప్రీంను ఆశ్రయించిన మరుసటి రోజే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై విచారణ జరిపింది. తదుపరి విచారణను ఏప్రిల్‌ 22కు వాయిదా వేసింది. దేశంలో టిక్‌టాక్‌ యాప్‌ను తక్షణమే బ్యాన్‌ చేయాలని మద్రాసు హైకోర్టు కేంద్రాన్ని ఏప్రిల్‌ 3న కోరిన‌ విషయం తెలిసిందే. చైనాకు చెందిన వీడియో యాప్ .. పిల్ల‌ల్లో అశ్లీల (పోర్న్) ప్ర‌వృత్తిని పెంచుతోంద‌ని ఇటీవల మద్రాసు కోర్టు పేర్కొన్న‌ది. టిక్‌టాక్ యాప్‌లో ఉన్న వీడియోల‌ను వాడ‌రాదంటూ మీడియాకు కూడా ఆ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. చిన్న చిన్న వీడియోలు తీసి, వాటికి స్పెష‌ల్ ఎఫెక్ట్స్ జోడించి.. టిక్‌టాక్ యాప్‌లో అప్‌లోడ్ చేస్తుంటారు. ఇప్పుడు ఈ యాప్‌కు ఇండియాలో సుమారు 6 కోట్ల మంది యాక్టివ్ యూజ‌ర్లు ఉన్నారు.
*కొర్బలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ… కాంగ్రెస్పై తీవ్ర ఆరోపణలు చేశారు. హింసను ప్రోత్సహించేవారికి సహకారం అందించేలా హస్తం పార్టీ మేనిఫెస్టో ఉందని విమర్శించారు. మోదీలందరూ దొంగలేనన్న రాహుల్ గాంధీ విమర్శలను ఖండించారు మోదీ.నక్సలైట్లను ప్రోత్సహించేలా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. ఇలాంటి మేనిఫెస్టోలతో అధికారం చేపట్టిన వారు ఆదివాసీల జీవితాల్లో అలజడి సృష్టిస్తారని ఆరోపించారు.ఛత్తీస్గఢ్లోని కొర్బ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు మోదీ. నీరవ్ మోదీ, లలిత్ మోదీని ప్రస్తావిస్తూ రాహుల్ చేసిన విమర్శలను తప్పుబట్టారు.
*న్యాయ్ పథకానికి నిధుల కోసం మధ్య తరగతిపై భారం మోపబోమని, మోదీ హయాంలో లబ్ధిపొందిన అంబానీల లాంటి ధనవంతుల నుంచి ఈ నిధులు వస్తాయని రాహుల్ గాంధీ కేరళ కొల్లాం ఎన్నికల సభలో అన్నారు.ప్రధాని నరేంద్రమోదీ 2014 ఎన్నికల హామీలు నెరవేర్చకపోగా ఆశ్రిత పెట్టుబడిదారులకు లక్షల కోట్లు ధారాదత్తం చేశారని ఆరోపించారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.కేరళ కొల్లాంలో ఎన్నికల సభలో ప్రసంగించారు రాహుల్. కాంగ్రెస్ ఇచ్చిన న్యాయ్ హామీపై అధికార పక్షం విమర్శలను తోసిపుచ్చారు.
*కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం లోని కీలేశపురం గ్రామానికి చెందిన పచ్చిగోళ్ళ జోసెఫ్ పెళ్లి చేసుకుంటానని తనని నమ్మించి శారీరకంగా మరియు ఆర్థికంగా వాడుకొని వదిలేశాడని ఇబ్రహీంపట్నం చెందిన భాగ్యలక్ష్మి తనకు న్యాయం చేయాలని కీలేశపురం జోసెఫ్ ఇంటి ముందు బయటాయించింది. భాగ్యలక్ష్మి మీడియా తో మాట్లాడుతూ అతను నన్ను పెళ్ళి చేసుకోవాలంటూ లేదంటే జోసెఫ్ ఇంటి ముందే ఆత్మహత్య చేసుకుంటానని తెలిపింది.గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా నాకు న్యాయం జరగకపోవడం నేను రోడ్డు పైకి వచ్చానని వాపోయింది.
*ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయవాదుల సంఘ ఎన్నికలు ఈ నెల 25న నిర్వహించనున్నట్లు న్యాయవాదుల సంఘ తాత్కాలిక కమిటీ తెలిపింది. 2027 మంది సభ్యులున్న సంఘానికి 25న ఎన్నికతోపాటు ఓట్ల లెక్కింపు కూడా ఉంటుందన్నారు.
*ఎన్నికల విధుల నిర్వహణలో విఫలమైన అధికారులపై కఠిన చర్యలకు రంగం సిద్ధ కృష్ణా, విశాఖ, నెల్లూరు జిల్లాలో జరిగిన ఘటనల్లో సంబంధిత సిబ్బందిపై వేటు పడే అవకాశం ఇప్పటికే కలెక్టర్ల నుంచి నివేదికలు తెప్పించుకున్న సీఈవో పోలింగ్ తర్వాత తలెత్తిన వివాదాల్లో ఆర్వో,ఏఆర్వోలపై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫార్సు ఈవీఎంల భద్రత విషయంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దు రాష్ట్ర వ్యాప్తంగా స్ట్రాంగ్ రూముల్లో ఉన్న వినియోగించిన, వినియోగించని ఈవీఎంలను తరలించొద్దు ఎన్నికల్లో వినియోగించని, రిజర్వ్ ఈవీఎంలను తరలించాల్సి వస్తే ముందస్తు అనుమతితో, అందరి సమక్షంలోనే తరలించాలి స్ట్రాంగ్ రూముల వద్ద భద్రత పెంచాలని డీజీపీని ఆదేశించాం నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఘటనకు బాధ్యులైన వారెవరో విచారణలో తేలుతుంది వాస్తవంగా ఏం జరిగిందో మీడియా కూడా పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు రాష్ట్ర ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది
*గుంటూరు జిల్లా ఇనిమెట్ల ఘటనలో కోడెలపై రాజుపాలెం పోలీసు స్టేషన్ లో కేసు నమోదు. కోడెల ఎన్నికల రోజు బూత్ క్యాప్చరింగ్ కు పాల్పడ్డరని ఫిర్యాదు చేసిన వైసీపీ.కోడెలను మూడవ నిందితునిగా చేర్చిన పోలీసులు.ఆయనతో సహ మరో 22మంది టీడీపీ నాయకుల పై ఎఫ్ఐఆర్ నమోదు.
*లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి రెండో విడుత ఎన్నికల ప్రచారం ఇవాళ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. దేశ వ్యాప్తంగా 12 రాష్ర్టాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఈ నెల 18న రెండో విడుత ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. రెండో విడుతలో భాగంగా 97 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. తమిళనాడులో 39, కర్ణాటకలో 14, మహారాష్ట్రలో 10, ఉత్తరప్రదేశ్‌లో 8, అసోం 5, బీహార్ 5, ఒడిశా 5, ఛత్తీస్‌గఢ్‌లో 3, పశ్చిమ బెంగాల్‌లో 3, జమ్మూకశ్మీర్‌లో 2, మణిపూర్ 1, త్రిపుర 1, పుదుచ్చేరిలోని 1 లోక్‌సభ నియోజకవర్గానికి ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు ఒడిశాలోని 35 అసెంబ్లీ స్థానాలకు కూడా ఏప్రిల్ 18వ తేదీనే ఎన్నికలు నిర్వహించనున్నారు. రెండో విడుతలోని 97 లోక్‌సభ స్థానాలకు 1674 మంది పోటీ పడుతున్నారు. ఒడిశా అసెంబ్లీకి 244 మంది బరిలో ఉన్నారు.
*పాపులర్‌ చైనీస్‌ షార్ట్‌-వీడియో మొబైల్‌ యాప్‌ ‘టిక్‌టాక్‌’ను వెంటనే గూగుల్‌, యాపిల్‌ సంస్థలు తమ యాప్‌స్టోర్ల నుంచి తొలగించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. యాప్‌ను నిషేధించాలంటూ గతంలో మద్రాస్‌ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖ మంగళవారం ఈ నిర్ణయం తీసుకుంది. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని టిక్‌టాక్‌ సంస్థ సుప్రీంను ఆశ్రయించిన మరుసటి రోజే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై విచారణ జరిపింది. తదుపరి విచారణను ఏప్రిల్‌ 22కు వాయిదా వేసింది. దేశంలో టిక్‌టాక్‌ యాప్‌ను తక్షణమే బ్యాన్‌ చేయాలని మద్రాసు హైకోర్టు కేంద్రాన్ని ఏప్రిల్‌ 3న కోరిన‌ విషయం తెలిసిందే. చైనాకు చెందిన వీడియో యాప్ .. పిల్ల‌ల్లో అశ్లీల (పోర్న్) ప్ర‌వృత్తిని పెంచుతోంద‌ని ఇటీవల మద్రాసు కోర్టు పేర్కొన్న‌ది. టిక్‌టాక్ యాప్‌లో ఉన్న వీడియోల‌ను వాడ‌రాదంటూ మీడియాకు కూడా ఆ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. చిన్న చిన్న వీడియోలు తీసి, వాటికి స్పెష‌ల్ ఎఫెక్ట్స్ జోడించి.. టిక్‌టాక్ యాప్‌లో అప్‌లోడ్ చేస్తుంటారు. ఇప్పుడు ఈ యాప్‌కు ఇండియాలో సుమారు 6 కోట్ల మంది యాక్టివ్ యూజ‌ర్లు ఉన్నారు.
*గుజరాత్‌లోని బీజేపీ నేత ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలతో ఓటర్లను భయాందోళనకు గురిచేశారు.
పోలింగ్‌ బూత్‌లో సీసీ కెమెరాలు పెట్టామని.. మీరు ఎవరికి ఓటు వేస్తున్నారో తమ పార్టీకి తెలిసిపోతుందని బెదిరించారు. ఫతేపూర్‌ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే రమేశ్‌ కటారా ఈ వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా దాహోద్‌ నియోజకవర్గంలోని ఓ గ్రామంలో కటారా పాల్గొని ప్రసంగించారు. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రంపై జశ్వంత్‌ సిన్హా(దాహోద్‌ బీజేపీ అభ్యర్థి) ఫొటో, కమలం గుర్తు రెండూ మీకు కనిపిస్తాయి. వాటిని చూసి వాటికి ఎదురుగా ఉన్న బటన్‌పై నొక్కండి. ఎలాంటి తప్పులు జరగకూడదు. ఈసారి ప్రధాని నరేంద్రమోదీ పోలింగ్‌ బూత్‌ల్లో కెమెరాలను అమర్చారు. ఎవరు బీజేపీకి.. ఎవరు కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేశారో ఆయన చూస్తారు. ఆధార్‌ కార్డుతో పాటు కొన్ని కార్డులపై మీ ఫొటోలు ఉంటాయి. ఈ బూత్‌ పరిధిలో మీలో ఎవరైనా కొంతమంది బీజేపీకి ఓటు వేయలేదని గుర్తించామో ఇక వాళ్లందరికీ ఉద్యోగాలు రావు అని వ్యాఖ్యానించారు.*రెండురోజుల తిరుమల పర్యటనార్ధం, రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న శ్రీలంక ప్రెసిడెంట్ .మైత్రిపాల సిరిసేన, వారి కుటుంబ సభ్యులకు ఘనస్వాగతం లభించింది. జిల్లా కలెక్టర్ పి.ఎస్.ప్రద్యుమ్న , ఎపి ప్రోటోకాల్ అదనపు సెక్రటరీ లెఫ్టినెంట్ కల్నల్ అశోక్ కుమార్, తిరుపతి సబ్ కలెక్టర్ డా.మహేష్ కుమార్, తిరుపతి అర్బన్ ఎస్.పి.అన్బు రాజన్, స్వాగతం పలికిన వారిలో వున్నారు. శ్రీలంక మంత్రి అపోన్స్, శ్రీలంక ఎంబసీ డిప్యూటీ హై కమిషనర్ కృష్ణమూర్తి ఎయిపోర్టు డైరెక్టర్ శివ కుమార్ , ఎయిర్ పోర్ట్ సిఐ ఎస్ ఎఫ్ అధికారి మనీష్, అదనపు ఎస్పీ అనిల్ బాబు, ఎయిర్పోర్టు అధికారులు రాజశేఖర్, బాబీ, తదితరులు విమానాశ్రయం లో ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం శ్రీలంక ప్రెసిడెంట్ వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక కాన్వయ్ వాహన శ్రేణిలో రేణిగుంట విమానమానాశ్రయం నుండి తిరుమల బయలుదేరి వెళ్లారు. బుధవారం ఉదయం తిరుమల శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొంటారు. రాత్రి 8.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్లనున్నారు.
* రాష్ట్రంలో జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ పోలింగ్‌ సందర్భంగా ఎన్నికల విధులను సక్రమంగా నిర్వర్తించడంలో విఫలమైన అధికారులపై విచారణ కొనసాగుతోంది. నెల్లూరు, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో జరిగిన నాలుగు ఘటనల్లో అవకతవకలపై సంబంధిత ఎన్నికల సిబ్బందిపై వేటుకు రంగం సిద్ధమైంది. ఈ ఘటనలపై మూడు జిల్లాల కలెక్టర్ల నుంచి ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది ఇప్పటికే నివేదికలు తెప్పించుకున్నారు. పోలింగ్‌ తర్వాత తలెత్తిన వివాదాల్లో రిటర్నింగ్‌ అధికారులు (ఆర్వో), అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారుల (ఏఆర్వోల)పై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘానికి ద్వివేది సిఫారసు చేశారు.ఈవీఎంల భద్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠినంగా వ్యవహరిస్తామని ద్వివేది తాజాగా మంగళవారం హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా స్ట్రాంగ్ రూములకు తరలించిన పోలింగ్‌ నాటి ఈవీఎంలను కదిలించొద్దని, రిజర్వ్‌ ఈవీఎంలను తరలించాల్సి వస్తే ముందస్తు అనుమతితో, అందరి సమక్షంలోనే తరలించాలని ఆయన తేల్చి చెప్పారు. రాజకీయ పార్టీలు స్ట్రాంగ్ రూముల వద్ద భద్రత పెంచాలని కోరాయని, భద్రత పెంపు సాధ్యాసాధ్యాలపై డీజీపీని వివరణ కోరామని తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వీవీ ప్యాట్‌ స్లిప్పులు దొరికిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, ఘటనకు బాధ్యులెవరో విచారణలో తేలుతుందని తెలిపారు. ఈ వ్యవహారంలో వాస్తవంగా ఏం జరిగిందో మీడియా కూడా పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చన్నారు.
* గోదావరి బెల్టులో చమురు నిక్షేపాల కోసం అన్వేషణ ఊపందుకుంది. రోజుకు మూడు కిలోమీటర్ల మేర నదీ తీరం వెంబడి ఓఎన్ జీసీ సంస్థ సర్వే చేస్తోంది.ఇప్పటికే ఖమ్మం, భద్రాచలంలో సర్వే పూర్తయింది. ప్రస్తుతం భూపాలపల్లిలో అన్వేషణ జరుగుతోంది. జూన్‌‌ 10 నాటికి సర్వే పూర్తి చేసి కేంద్రానికి ప్రాథమిక నివేదికివ్వాలని అధికారులు అంటున్నారు. నిక్షేపాలున్నయో లేదో త్వరలోనే తెలుస్తుందని చెబుతున్నారు .
* అది 2003 ప్రపంచకప్‌ నాటి సంగతి. అప్పటికి లక్ష్మణ్‌ టెస్టుల్లోనే కాక వన్డేల్లోనూ రాణిస్తున్నాడు. కొన్ని నెలల ముందు వెస్టిండీస్‌ సిరీస్‌లో చక్కటి ప్రదర్శన చేశాడు. ఐతే తర్వాత న్యూజిలాండ్‌ పర్యటనలో మాత్రం విఫలమయ్యాడు. ఆ సిరీస్‌లో మిగతా ఆటగాళ్లూ ఏమంత గొప్పగా రాణించలేదు. ఈ నేపథ్యంలో ప్రపంచకప్‌ జట్టులో లక్ష్మణ్‌ కచ్చితంగా ఉంటాడనే అనుకున్నారంతా. కానీ అప్పటి సెలక్షన్‌ కమిటీ అతడికి పెద్ద షాకిచ్చింది. లక్ష్మణ్‌ను కాదని.. దినేశ్‌ మోంగియాకు జట్టులో చోటిచ్చింది. అతడి ప్రదర్శన చూస్తే పేలవం. ఈ నిర్ణయాన్ని అందరూ తప్పుబట్టారు. ప్రపంచకప్‌లో మోంగియా సాధించిందేమీ లేదు. అప్పుడు లక్ష్మణ్‌ లాగే ఇప్పుడు తెలుగువాడే అయిన అంబటి రాయుడికీ అన్యాయం జరిగిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత నెల ఆస్ట్రేలియాతో సిరీస్‌లో మాత్రమే రాయుడు విఫలమయ్యాడు. అంతకుముందు సిరీస్‌ల్లో రాణించినా అతడికి చోటు దక్కలేదు.
* వన్డే ప్రపంచకప్‌ నిలబెట్టుకోవడం కోసం ఆస్ట్రేలియా బలమైన జట్టును ప్రకటించింది. ఈ జట్టులో మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌, ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ ఏడాది విరామం తర్వాత మళ్లీ పునరాగమనం చేశారు.ఆస్ట్రేలియా జట్టు ఫించ్‌ (కెప్టెన్‌), ఖవాజా, వార్నర్‌, స్మిత్‌, షాన్‌ మార్ష్‌, మాక్స్‌వెల్‌, స్టాయినిస్‌, అలెక్స్‌ కారె, కమిన్స్‌, స్టార్క్‌, రిచర్డ్‌సన్‌, కౌల్టర్‌నీల్‌, బెరెన్‌డార్ఫ్‌, లయన్‌, ఆడమ్‌ జంపా
*దేశానికి సమర్థవంతమైన తీర భద్రత ఉన్నప్పుడే జాతీయ భద్రత సంపూర్ణంగా ఉన్నట్లని భారత సైన్యాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌ పేర్కొన్నారు. సోమవారం విశాఖలోని నావల్‌ డాక్‌యార్డ్‌లో భారత తీర రక్షక దళానికి చెందిన ‘ఐసీజీఎస్‌ వీర’ అధునాతన తీర గస్తీ నౌకను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రపంచంలోని నాలుగో అతిపెద్ద తీర భద్రతా దళంగా భారత్‌ ఆవిర్భవించిందని చెప్పారు. భారత సైన్యం, తీర రక్షక దళాలు సంయుక్తంగా విన్యాసాలు చేయాల్సిన అవసరం ఉందని, ఇరు విభాగాలు సంయుక్తంగా శిక్షణ పొందితే శత్రువులపై ఉమ్మడిగా పోరాడటానికి అవకాశముంటుందని పేర్కొన్నారు.
*దేశీయ పరిజ్ఞానంతో రూపొందిన దీర్ఘశ్రేణి సబ్‌ సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణి ‘నిర్భయ్‌’ను భారత్‌ సోమవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్‌ సమీపంలో ఉన్న సమీకృత పరీక్షా వేదిక (ఐటీఆర్‌) నుంచి ఉదయం 11.44 గంటలకు ఈ పరీక్షను చేపట్టినట్లు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) తెలిపింది. శత్రువుల రాడార్లకు ఆచూకీ దొరకకుండా ఉండేందుకు ఈ అస్త్రం నేల నుంచి కేవలం 100 మీటర్ల ఎత్తులో పయనిస్తుంది. 0.7 మ్యాక్‌ వేగంతో దూసుకెళ్లే సామర్థ్యం ఉంది. తాజా పరీక్షలో ఇది 42 నిమిషాల్లోనే నిర్దేశిత లక్ష్యాన్ని ఛేదించింది.
*కొన్నేళ్లుగా సరైన వర్షాల్లేక అవస్థలు పడుతున్న అన్నదాతలకు తీపి కబురు.. తెలుగురాష్ట్రాలతో పాటు, దేశవ్యాప్తంగా ఈ ఏడాది వర్షాలు బాగానే పడే అవకాశాలున్నాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. వర్షపాతం సాధారణానికి సమీపంలో నమోదు కావచ్చని సోమవారం పేర్కొంది. దీర్ఘకాల సగటు (ఎల్‌పీఏ)లో 96% వర్షపాతం ఈ ఏడాది నమోదయ్యే అవకాశాలున్నాయని ఐఎండీ సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. 1951 నుంచి 2000వ సంవత్సరం వరకు నైరుతి రుతుపవనాల్లో దీర్ఘకాల సగటు వర్షపాతం (ఎల్‌పీఏ) 89 సెం.మీ. ఈ ఏడాది ఇందులో 96% వరకు వానలు పడొచ్చని ఐఎండీ అంచనా. జూన్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్య ఎల్‌పీఏలో 96% నుంచి 104% వర్షాలు పడితే సాధారణ వర్షపాతం అని లెక్కిస్తారు.
*తెలంగాణ హైకోర్టుకు తొలి మహిళా న్యాయమూర్తిగా జస్టిస్‌ గండికోట శ్రీదేవి రానున్నారు. ప్రస్తుతం అలహాబాద్‌ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ శ్రీదేవిని తెలంగాణ హైకోర్టుకు బదిలీ నిమిత్తం సోమవారం సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.
*ఎన్నికల విధుల్లో పాల్గొని, పోస్టల్‌ బ్యాలెట్‌కు దరఖాస్తు చేయలేకపోయిన ఉపాధ్యాయులు, ఉద్యోగులకు అవకాశం కల్పించాలని వైఎస్‌ఆర్‌ ఉపాధ్యాయ సమాఖ్య (వైఎస్‌ఆర్‌టీఎఫ్‌) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రెడ్డి శేఖరరెడ్డి, కె.వెంకటరెడ్డి ప్రకటనలో కోరారు.
*ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్‌) కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 10 శాతం రిజర్వేషన్లను అమలు చేయడానికి దేశవ్యాప్తంగా ఉన్న 158 కేంద్ర విద్యా సంస్థ (సీఈఐ)ల్లో రెండు లక్షలకుపైగా సీట్లను కొత్తగా జోడించనున్నారు.
*ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల వార్షిక ఫలితాలు ఈనెల 18వ తేదీన వెల్లడికానున్నాయి. ఇంటర్‌బోర్డు అధికారికంగా ఈ విషయాన్ని సోమవారం ప్రకటించింది. ఈ మేరకు ఇంటర్‌బోర్డు కార్యదర్శి అశోక్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. నాంపల్లిలోని ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో విడుదల చేస్తామని తెలిపారు. అయితే విడుదల సమయాన్ని మాత్రం ప్రకటించలేదు.
* రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రకటనను ఈనెల 20వ తేదీలోపే వెలువరించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ నాగిరెడ్డి వెల్లడించారు. ఈనెల 18వ తేదీన కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశాన్ని నిర్వస్తామని, ఆరోజు నుంచి 20వ తేదీలోగా ఎప్పుడైనా ఎన్నికల ప్రకటన వెలువడవచ్చని ఆయన పేర్కొన్నారు. ఉన్నతాధికారులతో సోమవారం ఇక్కడ ఎన్నికల సంఘం భవనంలో సమావేశమైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
*ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్‌) కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 10 శాతం రిజర్వేషన్లను అమలు చేయడానికి దేశవ్యాప్తంగా ఉన్న 158 కేంద్ర విద్యా సంస్థ (సీఈఐ)ల్లో రెండు లక్షలకుపైగా సీట్లను కొత్తగా జోడించనున్నారు.
*నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని పోలింగ్‌స్టేషన్‌ 134కు చెందిన వీవీ ప్యాట్‌ స్లిప్పులు ఉన్నత పాఠశాల ఆవరణలోని చెత్తకుప్పలోకి చేరాయి. పాఠశాలకు వచ్చిన విద్యార్థులు వాటిని చూసి తీసుకెళ్లారు. సాంకేతిక సిబ్బంది మాక్‌ పోలింగ్‌ నిర్వహించినప్పుడు వినియోగించిన వీవీ ప్యాట్‌ స్లిప్పులుగా వాటిని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.
*డేటా చౌర్యం కేసులో తెలంగాణ సిట్‌ పట్టు బిగిస్తోంది. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో పలు అంశాలు వెల్లడికాగా.. ఇప్పుడు ఆధార్‌ అధికారులు కూడా తోడవడంతో రాబోయే రోజుల్లో ఇది మరింత సంచలనాత్మకంగా మారే అవకాశం ఉంది.
*తెలుగు ఒక సబ్జెక్టుగా తప్పనిసరి చదవాలన్న చట్టం నేపథ్యంలో వచ్చే ఏడాదికి పాఠ్య పుస్తకాలను విద్యాశాఖ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ చట్టం గత విద్యా సంవత్సరం నుంచి అమలవుతోంది. తెలుగు అమలు ప్రతి ఏటా ప్రాథమిక, ప్రాథమికోన్నత స్థాయిలో ఒక్కో తరగతి పెరుగుతూ వస్తుంది.
*దేశంలో ప్రతి ఒక్కరికీ సమానావకాశం కల్పించడమే నిజమైన జాతీయత అవుతుందని లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు డా.జయప్రకాశ్‌ నారాయణ అన్నారు. ప్రతి ఒక్కరి ఆత్మగౌరవాన్ని కాపాడటం, మానవ విలువల్ని కాపాడటం నిజమైన జాతీయ వాదమన్నారు. ఖమ్మంలో కలాం విజన్‌ కేంద్రం ప్రారంభానికి వచ్చిన ఆయన భక్తరామదాసు కళాక్షేత్రంలో సోమవారం మాట్లాడారు.
*తెలంగాణలో సంక్షేమ గురుకులాల్ని ‘కేజీ టూ పీజీ మిషన్‌’లో భాగంగా కార్పొరేట్‌ విద్యాలయాల స్థాయిలో అభివృద్ధి చేస్తామని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. సోమవారం సచివాలయంలో ఎస్సీ సంక్షేమశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌మిశ్రా, గిరిజనశాఖ ముఖ్యకార్యదర్శి బెనహర్‌ మహేష్‌దత్‌ ఎక్కా, ఎస్సీ సంక్షేమ శాఖ డైరెక్టర్‌ కరుణాకర్‌, ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి ప్రవీణ్‌ కుమార్‌తో కలిసి మంత్రి సమ్మర్‌ సమురాయ్‌ వేసవి శిబిరాన్ని ప్రారంభించారు.
*సామాజిక ఆర్థిక అధ్యయనాల సంస్థ (సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్‌ స్టడీస్‌) నూతన డైరెక్టర్‌గా ప్రొఫెసర్‌ రేవతి బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఆ హోదాలో ఉన్న ప్రొఫెసర్‌ గాలబ్‌ ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ప్రారంభించిన ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ స్టడీస్‌ (ఐడీఎస్‌) సంచాలకుడిగా నియమితులయ్యారు. ఈ సంస్థలు రాష్ట్రాల్లో సామాజిక, ఆర్థిక సంబంధమైన మార్పులపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదికలు అందిస్తుంటాయి.
* సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 40 నుంచి 44 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నల్గొండతో పాటు మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో సోమవారం అత్యధికంగా 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మేళ్లచెరువులో 43.8, రామగుండం 42.8, ఖమ్మం 42, హైదరాబాద్‌లో 40.2 డిగ్రీలున్నాయని; ఖమ్మం జిల్లాలో వడగాడ్పులు వీస్తున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఉష్ణోగ్రతలు ఈ నెల 17 నుంచి కొంతవరకు తగ్గే అవకాశం ఉందని వాతావరణ అధికారి రాజారావు తెలిపారు. మధ్య భారతంలో తుపాను వ్యతిరేక పవనాల కారణంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఇకముందు బలహీనపడవచ్చని పేర్కొన్నారు.
*ప్రైవేటు వైద్యవిద్యా కళాశాలల్లోని పీజీ మెడికల్‌, డెంటల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు.. ధ్రువపత్రాల పరిశీలన, వెబ్‌ కౌన్సెలింగ్‌ తొలి విడత ప్రకటనను వరంగల్‌ కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం జారీచేసింది. యాజమాన్య కోటాలో పీజీ డిగ్రీ, డిప్లొమా సీట్లకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 20, 21 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. అభ్యర్థుల ప్రొవిజనల్‌ మెరిట్‌ జాబితాను ప్రకటించారు. వారు ఉస్మానియా విశ్వవిద్యాలయ క్యాంపస్‌, పీజీఆర్‌ఆర్‌సీడీఈ లోని పరిశీలన కేంద్రాల వద్ద నిర్ణీత తేదీల్లో వెబ్‌ కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని రిజిస్ట్రార్‌ తెలిపారు.
*ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్‌) రిజర్వేషన్లు కేటాయించడంతో, రిజర్వేషన్ల పరిమితి 50% నుంచి 60 శాతానికి చేరిందని, ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని గతంలో మాదిరి బీసీలకు 34% వరకు రిజర్వేషన్లు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు.
*పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి తెలంగాణ పాలిసెట్‌ను మంగళవారం నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,06,380 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. గత ఏడాది కంటే సుమారు 19 వేల దరఖాస్తులు తగ్గాయి. రాష్ట్రంలో 320 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుంది.
*ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాల్లో నేడు ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురవొచ్చని, ఆయా ప్రాంతాల్లో ఈదురు గాలులు వీయొచ్చని, పిడుగులు పడొచ్చని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. మరోవైపు ఎండల తీవ్రత కొనసాగుతుందని వివరించారు.
*ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయవాదుల సంఘానికి ఈ నెల 25న ఎన్నికలు జరగనున్నాయి. హైకోర్టు న్యాయవాదుల సంఘం తాత్కాలిక కమిటీ సోమవారం ఎన్నికల ప్రకటన జారీ చేసింది. 25న ఓటింగ్‌ ప్రక్రియతో పాటు ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుందని కమిటీ పేర్కొంది.
*ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సమాఖ్య (ఏపీటీఎఫ్‌) ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరంలో నిర్వహించనున్న సమావేశాన్ని జయప్రదం చేయాలని రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.వెంకటేశ్వరరావు, జి.హృదయరాజు ఒక ప్రకటనలో కోరారు. 1944లో ఆంధ్ర రాష్ట్ర ప్రాథమికోపాధ్యాయ సమాఖ్యగా ఆవిర్భవించి, 1972లో ఏపీటీఎఫ్‌గా రూపాంతరం చెందిందని వారు వెల్లడించారు.
* పోలీసు నియామకాలు తుది తీర్పునకు లోబడి ఉంటాయని సోమవారం హైకోర్టు పేర్కొంది. పోలీసు నియామకాల్లో భాగంగా నిర్వహించిన పరుగు పందెంలో తమను అనుమతించలేదంటూ దాఖలైన పిటిషన్‌లను సింగిల్‌ జడ్జి కొట్టివేయడంతో అభ్యర్థులు అప్పీళ్లు దాఖలు చేశారు.
*రాజధాని అమరావతిలో సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాల నిర్మాణంలో మరో ముందడుగు పడింది. 50 అంతస్తులుగా నిర్మిస్తున్న ముఖ్యమంత్రి కార్యాలయ భవనానికి డయాగ్రిడ్‌ స్ట్రక్చర్‌ నిర్మాణంలో భాగంగా తొలి కాలమ్‌ను (మధ్యలో ఖాళీగా, చతురస్రాకారంలో రూపొందించిన పొడవైన ఇనుప స్తంభం) సోమవారం అమర్చారు. గుజరాత్‌లో సర్దార్‌ వల్లభ్‌భాయి పటేల్‌ విగ్రహానికి (స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ) స్టీల్‌ ఫ్రేం వర్క్‌ పనులు చేసిన…. ఎవర్సెండాయ్‌ సంస్థ వీటిని సరఫరా చేస్తోంది.
*రాష్ట్రంలో పలువురు సీనియర్‌ సివిల్‌ జడ్జీలను హైకోర్టు బదిలీ చేసింది. వారి స్థానంలో కొత్త వారిని నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
* ‘‘ఎస్‌ఆర్‌ఎం’’ గ్రూప్‌ విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్‌ (ఎస్‌ఆర్‌ఎంజీఈఈఈ-బి.టెక్‌) హెల్త్‌సైన్సెస్‌ (ఎస్‌ఆర్‌ఎంజీఈఈహెచ్‌) అండర్‌ గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో విద్యాభ్యాసానికిగాను ఈ నెల 25 వరకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష -ఎస్‌ఆర్‌ఎంజేఈఈ-2019 నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలు, ఏడు కేంద్రపాలిత ప్రాంతాలు, విదేశాల నుంచి 1,40,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసినట్లు యాజమాన్యం వెల్లడించింది. అభ్యర్థుల కోసం భారత్‌, మధ్యప్రాచ్యంలోని 128 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రవేశపరీక్షలో పొందిన అఖిల భారతస్థాయి ర్యాంకు ఆధారంగా మే 3 నుంచి 10 వరకు కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు.
*హైదరాబాద్‌ యూసుఫ్‌గూడలోని స్టేడియం నుంచి ఈవీఎంల తరలింపు వ్యవహారం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం కావడంతో కొద్దిసేపు కలకలం రేగింది. అయితే లోక్‌సభ ఎన్నికల్లో ఉపయోగించని అదనపు (రిజర్వుడు) ఈవీఎంలను మేడ్చల్‌లోని ప్రధాన గోదాములకు తరలిస్తున్నామని హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి దానకిశోర్‌ తెలిపారు.
*ఏపీ ఎంసెట్‌ హాల్‌ టికెట్లను మంగళవారం నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సెట్‌ కన్వీనర్‌ సాయిబాబు తెలిపారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలను పలు జిల్లాల్లో ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఏర్పాటు చేసినందున సుమారు 10వేల మంది విద్యార్థులకు వారు ఎంపిక చేసుకున్న 3 పరీక్షా కేంద్రాలు కాకుండా సమీపంలోని మరో కేంద్రాన్ని కేటాయించామని చెప్పారు. ఇలా కేంద్రాలు మార్చిన విద్యార్థులకు మధ్యాహ్న సెషన్‌లో పరీక్ష రాసే అవకాశం కల్పించామని వివరించారు.
*విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై అధ్యయనం చేసి, నివేదిక సమర్పించడానికి భారతీయ రైల్వే ప్రత్యేక అధికారిని (ఓఎస్‌డీ) నియమించిన సంగతి తెలిసిందే. విశాఖలో అందుకు సంబంధించిన కార్యాలయాన్ని ఇటీవలే ఏర్పాటు చేసింది. వాల్తేర్‌ డివిజన్‌లో జ్ఞానాపురంవైపు స్టేషన్‌కు సమీపంలో ఉన్న రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌.వి.ఎన్‌.ఎల్‌) కార్యాలయ భవనాన్ని స్వల్పమార్పులు చేసి ఓఎస్‌డీ కార్యాలయంగా మార్చారు. సోమవారం ఈ భవనాన్ని ఏడీఆర్‌ఎం రామచంద్రరావుతో కలిసి ఓఎస్‌డీ శ్రీనివాస్‌ లాంఛనంగా ప్రారంభించారు.
*పోలవరం ప్రాజెక్టు అథారిటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఆర్‌కే జైన్‌ ఆధ్వర్యంలో సభ్యులు ఆర్‌కే గుప్తా, ఏకే ప్రధాన్‌ సోమవారం తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలో జరుగుతున్న ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఉదయం తూర్పుగోదావరి జిల్లా వైపు వెళ్లినవారు… మధ్యాహ్నానికి ఎగువ కాఫర్‌డ్యామ్‌ మీదుగా పోలవరం చేరుకున్నారు.
*ఏపీ నిట్‌ విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది. 2019-20 విద్యా సంవత్సరం నుంచి పీహెచ్‌డీ (డాక్టర్‌ ఆఫ్‌ ఫిలాసఫీ), ఎంఎస్‌ బై రీసెర్చ్‌ (మాస్టర్‌ ఆఫ్‌ సైన్సు) వంటి కోర్సులను నిర్వహించడానికి ముందుకొచ్చింది. ప్రస్తుతం ఈ విద్యా సంస్థలో కొనసాగుతున్న 8 కోర్సులకు సంబంధించిన అభ్యర్థులకు పీహెచ్‌డీలో ప్రవేశాలు కల్పించనుంది. అడ్మిషన్ల నోటిఫికేషన్‌ విడుదలైంది. పీహెచ్‌డీలో అన్ని కోర్సులకు కలిపి 50 సీట్లను, ఎంఎస్‌లో ఎంతమంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నా వారి అర్హతల ఆధారంగా అన్ని సీట్లను ఇవ్వనున్నారు.
*రెండురోజుల తిరుమల పర్యటనార్ధం, రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న శ్రీలంక ప్రెసిడెంట్ .మైత్రిపాల సిరిసేన, వారి కుటుంబ సభ్యులకు ఘనస్వాగతం లభించింది. జిల్లా కలెక్టర్ పి.ఎస్.ప్రద్యుమ్న , ఎపి ప్రోటోకాల్ అదనపు సెక్రటరీ లెఫ్టినెంట్ కల్నల్ అశోక్ కుమార్, తిరుపతి సబ్ కలెక్టర్ డా.మహేష్ కుమార్, తిరుపతి అర్బన్ ఎస్.పి.అన్బు రాజన్, స్వాగతం పలికిన వారిలో వున్నారు. శ్రీలంక మంత్రి అపోన్స్, శ్రీలంక ఎంబసీ డిప్యూటీ హై కమిషనర్ కృష్ణమూర్తి ఎయిపోర్టు డైరెక్టర్ శివ కుమార్ , ఎయిర్ పోర్ట్ సిఐ ఎస్ ఎఫ్ అధికారి మనీష్, అదనపు ఎస్పీ అనిల్ బాబు, ఎయిర్పోర్టు అధికారులు రాజశేఖర్, బాబీ, తదితరులు విమానాశ్రయం లో ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం శ్రీలంక ప్రెసిడెంట్ వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక కాన్వయ్ వాహన శ్రేణిలో రేణిగుంట విమానమానాశ్రయం నుండి తిరుమల బయలుదేరి వెళ్లారు. బుధవారం ఉదయం తిరుమల శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొంటారు. రాత్రి 8.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్లనున్నారు.