Movies

నా పార్టీ గుర్తు ప్లేట్‌

plate is my party symbol says alia bhatt in kapil sharma show

కపిల్‌ శర్మ షోలో ఆలియా పాల్గొన్నారు. ప్రస్తుతం ఆమె నటిస్తున్న ‘కళంక్‌’ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ఆమె తన సహనటులతో ఆ షోలో సందడి చేశారు. షోలో భాగంగా కపిల్‌ శర్మ ఆమెను ఆటపట్టించారు. ఈ క్రమంలో ఆలియాను రాజకీయ పార్టీ స్థాపిస్తే తన పార్టీ గుర్తు ఏంటని ఆయన ప్రశ్నించారు. దీనికి ఆలియా స్పందిస్తూ..‘నేను రాజకీయాల్లోకి వస్తే నా పార్టీ గుర్తుగా ప్లేట్‌ను ప్రతిపాదిస్తాను. ఎందుకంటే ఈ గుర్తును ఇంతవరకు ఎవరూ ఎంచుకోలేదు కాబట్టి. మన నిత్య జీవితంలో ప్లేట్‌కు ఎంతో ప్రాధాన్యం ఉంది’ అని చెప్పుకొచ్చింది. వరుణ్‌ ధావన్‌ మాత్రం చెడ్డీ అని చెప్పారు. దీంతో అక్కడున్న వారంతా అవాక్కయి ఒక్కసారిగా నవ్వడం ప్రారంభించారు.