Sports

గుడ్‌బై గంగూలీ

ganguly bids goodbye to cac

క్రికెట్‌ సలహా మండలి(సీఏసీ)కి దాదా గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సీఏసీ సభ్యుడిగా ఉంటూనే ఐపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్‌కు సలహాదారుగా పనిచేస్తున్నాడు. విరుద్ధ ప్రయోజనాల అంశంతో దాదాపై ఓ అభిమాని ఫిర్యాదు చేశాడు. ఇప్పటికే సౌరభ్‌కు నోటీసులు జారీ చేసిన అంబుడ్స్‌మన్‌.. తన ముందు నేరుగా హాజరు కావాలని ఆదేశించారు. దీంతో శనివారం బీసీసీఐ అంబుడ్స్‌మన్‌ డీకే జైన్‌ ముందు దాదా హాజరు కానున్నాడు. దీంతో గంగూలి రెండింట్లో ఏదో ఒకటి వదులుకోవాల్సిన పరిస్థితుల్లో సీఏసీని దూరం కానున్నట్లు సమాచారం దాదాతో పాటు సచిన్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌ కూడా సీఏసీలో సభ్యులుగా ఉన్నారు. ముంబయి జట్టుకు సచిన్‌, హైదరాబాద్‌ జట్టుకు లక్ష్మణ్‌ సలహాదారులుగా ఉన్న విషయం తెలిసిందే. సౌరభ్‌ చివరిగా 2017లో ఛాంపియన్స్‌ ట్రోఫీకి సంబంధించి సీఏసీ సమావేశానికి హాజరయ్యాడు. ఆ తర్వాత సీఏసీతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదు. అందుకే సీఏసీ.. దాదా విషయంలో గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. దాదా ఏమైనా చెప్పాలనుకుంటే అంబుడ్స్‌మన్‌ ముందు చెప్పుకోవచ్చని సూచించింది. దీంతో దాదా దిల్లీతో కొనసాగాలంటే సీఏసీకి దూరం కావాల్సి ఉంటుంది. అయితే, దాదా సీఏసీకి గుడ్‌బై చెప్పి దిల్లీ జట్టుతోనే ఉండేందుకు మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది.