Food

పుట్టగొడుగు ఆరోగ్య గొడుగు

the health benefits of mushrooms

శరీరానికి అవసరమైన ప్రొటీన్లు పుట్టగొడుగుల్లో పుష్కలంగా ఉన్నాయి. సాధారణంగా ప్రొటీన్లు అంత సులువుగా జీర్ణం కావు.. కానీ, పుట్టగొడుగుల్లోని ప్రొటీన్లు మాత్రం, అత్యంత సులువుగా 60 ఏళ్లు దాటిన వారిలో సహజంగానే మెదడు కణాలు క్షీణించిపోతుంటాయి. ఫలితంగా మతిమరుపును కలిగించే డిమెన్షియా వ్యాధి మొదలవుతుంది. అయితే వారానికి రెండు సార్లు, మొత్తం 300 గ్రాముల ఉడికించిన పుట్టగొడుగులు తిన్నవారిలో ఈ సమస్య 50 శాతం దాకా తగ్గిపోతోందని పరిశోధకులు కనుగొన్నారు. అయితే వారంలో రెండు దఫాలే కాకుండా తక్కువ మోతాదులో ఇంకా ఎక్కువ సార్లు వీటిని తినే వారికి పుట్టగొడుగుల వల్ల కలిగే ప్రయోజనం అధికంగా ఉంటుందని కూడా వారు వెల్లడించారు. మెదడు కణాల క్షయం వల్ల వృద్దుల్లో తలెత్తే సమస్యల్లో మతిమరుపు రావడంతో పాటు భాషా సామర్థ్యం తగ్గిపోతుంది. ఏకాగ్రత లోపిస్తుంది. అయితే పుట్టగొడుగులు ఈ లోపాల్ని చాలా వరకు పూరిస్తాయి. పుట్టగొడుగుల్లో ప్రత్యేకించి మన శరీరం తనకు తానుగా ఉత్పత్తి చేసుకోలేని ఒక అరుదైన అమినో యాసిడ్‌ ఉంటుంది. అది ఈ విశేష ప్రయోజనాలన్నీ కలిగిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ,ప్రత్యేకించి వృద్దులు పుట్టగొడుగులను ఆహారంగా తీసుకోవడంలో ప్రత్యేక శ్రద్ద వహించాలని పరిశోధకులు నొక్కి చెబుతున్నారు.