Politics

తూత్తుకుడి ఎవరికి దక్కుతుంది?

thoothukudi parliament seat 2019 results

తమిళనాడులో తూత్తుకూడి లోక్ సభ స్థానం పై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. అభ్యర్ధుల గెలుపోటములపై స్టెరిలైట్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ కాలుష్య కారక పరిశ్రమను మూసివేయాలని ఆందోళన చేపట్టిన స్థానికుల పై గత ఏడాది మే నెలలో పోలీసులు జరిపిన కాల్పుల్లో పదమూడు మంది మరణించారు. స్థానికులు జీర్ణించుకోలేని ఈ అంశం చుట్టూనే ప్రస్తుతం ప్రధాన పార్టీల ఎన్నికల ప్రచారం జరుగుతోంది. పరిశ్రమను తెరవాలని ఉద్యోగులు కోరుతుంటే శాశ్వతంగా మూసివేయాలని ఆందోళన చేపట్టిన స్థానికుల పై గత ఏడాది మే నెలలో పోలీసులు జరిపిన కాల్పులలో పదమూడు మంది మరణించారు. స్థానికులు జీర్ణించుకోలేని ఈ అంశం చుట్టూనే ప్రస్తుతం ప్రధాన పార్టీల ఎన్నికల ప్రచారం జరుగుతోంది పరిశ్రమలు తెరవాలని ఉద్యోగులు కోరుతుంటే శాశ్వతంగా మూసివేయాలని దీనికి వ్యతిరేకంగా పోరాడుతున్నవారు పట్టుదలతో ఉన్నారు. తూత్తుకూడి విఐపీ నియోజకవర్గంగా మారడానికి ప్రధాన కారణం డీఎంకే అభ్యర్ధిగా కరుణానిధి కుమార్తె, రాజ్యసభ ఎంపీ కనిమోళీ పోటీ చేస్తుండడమే. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తుండడం ఆమెకి ఇదే తొలిసారి. కనిమోళీ తల్లిదీ ఈ ప్రాంతమే. అన్నాడీఎంకే కూటమి తరుపున భాజపా రాష్ట్ర అధ్యకురాలు తమిలళీసై సౌందరరాజన్ ఈమెకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఈమె కాంగ్రెస్ సీనియర్ నేత కుమారి అనంతన్ కుమార్తె కావడం గమనార్హం. కేంద్ర ప్రభూత్వ విజయాలు, డీఎంకే కూటమి పై ఉన్న వ్యతిరేకతే కలిసివస్తాయని భావిస్తున్నారు. కనిమోళీ ముందునుంచే ఈ స్థానం పై దృష్టి కేంద్రీకరించి ఎంపీ నిధులతో అభివృద్ధి పనులు చేసారు. కనిమోళీ తల్లిదీ, తమిళ్ సై సౌందరరాజన్ లది స్థానికంగా బలమైన నాడార్ సామాజిక వర్గమే. 30% మైనారిటీర్టీలతో పాటు మత్స్యకారుల ఓట్లు కీలకం. ఈ నియోజకవర్గంలోని స్టెరిలైట్, శ్రీబైగుండం, పన్నంబాలై పురాట్చి, సుబ్బరాయపురం, ముదలూరు, కటాక్షీపురం, పల్లకురిచ్చి, అలహప్పపురం, పడుక్కపత్, మేలనడువకురిచి, తామరమోళీ, ఈడచ్చివులై, కడకుళం, అతిశయపురం, పెరియతాలై, పెరియనాయకపురం ప్రాంతాల్లో పర్యాటన సాగింది. భాజపా కాకుండా అన్నాడీఎంకే అభ్యర్ధి పోటీలో ఉండుంటే పోటీ మరింత రసవత్తరంగా మారేదని తూత్తుకూడి వాసులు అంటున్నారు. భాజపా అభ్యర్ధి కి అన్నాడీఎంకే స్థాయిలో ప్రచారం జరగలేదని చెబుతున్నారు. స్టెరిలైట్ పరిశ్రమపై ఆధారపడి 20 వేల కుటుంబాలు ఉన్నాయి. వీరివి దాదాపు 75 వేలవరకు ఓట్లు గెలుపోటములపై ప్రభావాన్ని చూపుతాయని స్థానిక ద్వితీయశ్రేణి నెత ఒకరు చెప్పారు. ఇక్కడ డబ్బు ప్రభావం ఎక్కువ. ఇప్పటి వరకు సుమారు 3 కోట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.