Devotional

మేడారం తేదీలు ఖరారు

medaram sammakka sarakka jathara 2019 dates confirmed

తెలంగాణలో మేడారం సమ్మక్క- సారలమ్మ జాతర తేదీలు ఖరారయ్యాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5 నుంచి 8వ తేదీ వరకూ జాతర ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 5న సారలమ్మ, గోవిందరాజు, పడిగిద్దరాజు, 6న సమ్మక్కలు గద్దెపైకి రానుండగా, 7వ తేదీన గద్దెలపైకి ఇద్దరు వన దేవతలు చేరనున్నారు. 8వ తేదీన సమ్మక్క, సారలమ్మలు వన ప్రవేశం చేస్తారు.