NRI-NRT

లండన్‌లో ప్రొ.అఖిలేష్‌రెడ్డిపై కేసు

telugu professor facing charges in london

ఏకకాలంలో 2 యూనివర్సిటీల్లో ఉద్యోగం చేసినందుకు లండన్‌లో తెలుగు ప్రొఫెసర్‌ న్యాయ విచారణను ఎదుర్కొంటున్నారు. 2015 సెప్టెంబరు నుంచి 2016 నవంబరు వరకు అఖిలేశ్‌ రెడ్డి అనే తెలుగు ప్రొఫెసర్‌ కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌లో(యూసీఎల్‌) పూర్తిస్థాయి ఉద్యోగిగా పనిచేశారని ద టైమ్స్‌ వెల్లడించింది. ఈ విషయం బయటపడటంతో ఆయనపై యూకే మెడికల్‌ ప్రాక్టీషనర్స్‌ ట్రైబ్యునల్‌ సర్వీసు విచారణ చేపట్టింది. నిద్రకు సంబంధించిన సమస్యలపై ఆయన ఎన్నో పరిశోధనలు చేశారు. శరీరంలోని ఎర్రరక్త కణాలకు వాటి సొంత వేళలు(బాడీ క్లాక్స్‌) ఉంటాయని కనుగొన్నారు.