Business

చైనా కంపెనీల దెబ్బకు చేతులెత్తేసిన అమెజాన్

amazon shuts down china operations due to tough competition

అమెరికాకు చెందిన ఆన్‌లైన్‌ వ్యాపార దిగ్గజం అమెజాన్‌.. చైనాలో తన ఈ–కామర్స్‌ సేవలను నిలిపివేయనున్నట్లు వెల్లడించింది. అక్కడి ప్రాంతీయ మార్కెట్లో బలపడిపోయిన ఆలీబాబా, జేడీ డాట్‌ కాం, పిన్‌డ్యూడ్యూ సంస్థలతో పోటీపడలేక తన 15 ఏళ్ల మార్కెట్‌ స్థానాన్ని వదులు కోవడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. మార్కెట్‌ వాటాలో ఆలీబాబాకు 58.2 శాతం ఉండగా.. ఆ రెండు సంస్థలకు 22 శాతం వరకు వాటా ఉంది. ఈ మూడింటి జోరుతో అమెజాన్‌ వెనకపడిపోయిన కారణంగా జూలై 18 నుంచి ఈ–కామర్స్‌ సేవల విభాగాన్ని నిలిపివేయనుంది. ఇక మిగిలిన సేవలైన వెబ్‌ సర్వీసెస్, కిండ్లీ ఈ–బుక్స్, క్రాస్‌ బోర్డర్‌ ఆపరేషన్లు యథావిధిగా కొనసాగనున్నాయి.