DailyDose

మంత్రి ఇంటిని ముట్టడించిన విద్యార్ధులు-తాజావార్తలు-04/24

intert students block telangana ministers house

Ø విద్యార్థుల జీవితాలతో చలగాటం ఆడుతున్న తెలంగాణా ఇంటర్ బోర్డ్ అధికారులను సస్పెండ్ చేయాలని నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ కరీంనగర్ లో మంత్రి ఈటెల రాజేందర్ ఇంటిని ముట్టడించారు
Ø ఇంటర్ జవాబుపత్రాలు ఉచితంగా రీకౌంటింగ్, పరిశీలనా చేయాలని సిఎం కేసిఆర్ ఆదేశాలిచ్చాఋ. ఈ రోజు కేసిఆర్ ఇంటర్ బోర్డ్ అవకతవకలపై సమీక్ష జరిపారు
Ø 50 ఏళ్లుగా సినీనటుడు ప్రభాస్ కుటుంబీకులకు చెందినా భూమి వివాదంలో హైకోర్ట్ ఆయని అనుకూలంగా తీర్పు ఇచ్చింది
Ø తాను ప్రధాని అవుతానని అనుకోలేదని సైన్యంలో పనిచేయాలని కోరుకున్నానని ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు
Ø అమెరికా ఆంక్షల మూలంగా పెట్రోల్ ధరలు లీటరుకు రూ.10 పెరుగుతాయని ఆందోళన వ్యక్తం అవుతుంది
Ø మే 23న జరిగే ఓట్ల లెక్కింపుపై ఏపీ ప్రధాన కర్యాదర్శి ఎల్ వి సుబ్రహ్మణ్యం పలు సూచనలు చేసారు
Ø వారణాసిలో మోడీ పై నిజామాబాద్ కు చెందిన పసుపు రైతులు పోటీ చేయటంలేదని రైతు సంఘం ప్రకటించింది
Ø ఈవీఎంలు భద్రపరిచిన ప్రదేశాల వద్ద నాలుగు అంచెల పటిష్టమైన భద్రత ఉందని దీనిపై ఆపోహలు వద్దని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది ప్రకటించారు
Ø అవకతవకలకు నిలయమైన ఇంటర్ బోర్డ్ ను రద్దు చేయాలని ముఖ్యమంత్రి కేసిఆర్ ఆలోచిస్తునట్లు సమాచారం
Ø ఇక నుండి పెళ్లి పత్రికల్లో వధువు వరుడు పుట్టిన తేదీలు తప్పనిసరిగా ముద్రించాలని రాజస్థాన్ ప్రభుత్వం బాల్యవివాహాలను నిరోధించే దిశగా ఆదేశాలిచ్చింది
Ø దేశంలో అత్యంత ధనవంతులైన ఎంపీగా క్రికెట్ క్రీడాకారుడు గౌతం గంభీర్ గుర్తింపబడ్డాడు
Ø బెంగాల్ సీఎం మమత బెనర్జీ తనకు మంచి స్నేహితురాలని ప్రధాని మోడీ ప్రకటించారు
Ø వోటింగ్ లిస్టులో పేరులేనప్పటికి తమిళ నటుడు శివ కార్తికేయన్ వోటువేయటం పట్ల ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. ఆయనపై చేర్యాలకు ఆదేశించింది
Ø ఎన్నికల సంఘం శైలి పట్ల మంత్రి సోమిరెడ్డి నిరసన వ్యక్తపరిచారు. తానూ తన శాఖ అధికారంతో సమీక్ష జరుపుతానని ఎన్నికల సంఘం ఏమచేస్తుందో చూస్తానని ఛాల్లెంజ్ చేసారు
Ø సినీనటుడు బండ్ల గణేష్ తెరాసలో చేరుతున్నట్లు వార్తలు వచ్చాయి