Food

సలాడ్లతో ఉల్లాసం-ఉత్సాహం-ఉత్తేజం

salads help in refreshing body mind and soul

వేసవి కాలంలో ద్రవాహారాలే చాలా ఉత్తమమం. అయితే సలాడ్స్‌ లాంటివాటినీ తినడం మంచిదేనని నిపుణులు సూచిస్తున్నారు. వెజిటబుల్‌ సలాడ్‌, ఫ్రూట్‌ సలాడ్‌, గ్రీన్‌ సలాడ్‌, స్ప్రౌట్స్‌ సలాడ్‌ (మొలకెత్తిన విత్తనాలు) ఇలా సలాడ్స్‌ రకరకాలుగా లభిస్తున్నాయి. వీటిలో ఏదైనా ఆరోగ్యమే అంటున్నారు వైద్య నిపుణులు. సలాడ్స్‌లో శరీరానికి కావల్సిన అన్నిరకాల ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. మిగతా ఆహార పదార్థాలలో ఉడకపెడుతున్నప్పుడు కొన్ని ప్రొటీన్లు ఆవిరి అయిపోయే అవకాశం ఉంటుంది.. కానీ సలాడ్స్‌ను మనం పచ్చిగానే తీసుకుంటాం కాబట్టి వాటిల్లో ఉన్న ప్రొటీన్లు పూర్తిగా శరీరానికి అందుతాయి. అధిక బరువుతో బాధపడుతున్న వారు ప్రతిరోజూ సలాడ్‌ తింటే క్రమేపీ బరువు తగ్గుతారు. సలాడ్స్‌లో మొలకెత్తిన విత్తనాలు కలుపుకుంటే అజీర్ణ సమస్యలు తగ్గుతాయి. మలబద్ధకాన్ని సలాడ్‌ నివారిస్తుంది. సలాడ్స్‌లోని ఫైబర్‌, ఫోలిక్‌యాసిడ్‌ రుతు సమస్యలనూ సరిచేసి, సంతాన సాఫల్యతను పెంచుతాయి. సలాడ్స్‌లో క్యాలరీలు, కొవ్వు చాలా తక్కువగా ఉంటాయి. దీనివల్ల గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. చర్మానికి కావల్సిన తేమను సలాడ్స్‌ అందిస్తాయి. దీనివల్ల చర్మం మృదువుగాను, కాంతివంతంగాను తయారవుతుంది. సలాడ్స్‌లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్‌ శరీరంలో ఉన్న ఫ్రీరాడికల్స్‌ సమస్యలను తగ్గిస్తాయి. విటమిన్ల లోపంతో బాధపడుతున్న వారికి సలాడ్స్‌ మంచి పరిష్కారాన్నందిస్తాయి. రోజూ సలాడ్స్‌ తినడం వల్ల శరీరం ఎంతో తేలికగా ఉంటుంది. దీనివల్ల శరీరానికి కొత్త ఉల్లాసం, ఉత్తేజం కలుగుతాయి. సలాడ్స్‌లో ఉండే విటమిన్‌ సి రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. ఇందులోని క్యాల్షియం ఎముకలు, కండరాలకు బలాన్ని ఇస్తాయి.