DailyDose

ఏసిబీకి చిక్కిన మహిళా ప్రాసిక్యూటర్-నేరవార్తలు-04/25

acb catches female public prosecutor in rajendranagar court

Ø హైదరాబాదులోని రాజేందర్ నగర్ కోర్ట్ లో పబ్లిక్ ప్రాసిక్యుటర్ గా పనిచేస్తున్న ప్రసన్న లక్ష్మి రూ.15000 లంచం తీసుకుంటూ ఏసిబీకి పట్టుబడ్డారు
Ø ప్రకాశం జిల్లా ఇండ్లచెరువు గ్రామంలో విద్యత్ వైరు తెగిపడి తొమ్మిది గేదెలు మృతి చెందాయి
Ø నల్లగొండ జిల్లాలో బస్సుల్లో దొంగతనాలకి పాల్పడుతున్న మహిళా దొంగలను పోలీసులు పట్టుకున్నారు
Ø కడప జిల్లా ఏటూరు గ్రామం వద్ద ఐషర్, టాటా ఏస్ వాహనాలు ఎదురెదురుగా ధీకొనడంతో ఇరువురు మృతిచెందారు 13 మందికి గాయాలు అయ్యాయి
Ø అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం రాకెట్ల గ్రామానికి చెందినా సురేష్ అనే యువరైతు పురుగుల మందు తాగి ఆత్మాహత్య చేసుకున్నాడు
Ø ఏలూరులో ప్రముఖ హోటళ్ళపై విజిలెన్స్ అధికారులు దాడులు జరిపి నిల్వ ఉంచిన మాంసాన్ని పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు
Ø గుంటూరు జిల్లా మాచర్లలోని నెహ్రు నగర్ కి చెందిన సిద్దు అనే బాలుడు ఇంటి సమీపంలోని క్వారీ కుంతలోపడి మృతిచెందాడు
Ø శ్రీలంకలో ఈ రోజు కొలంబోకు 40 కిలోమీటర్ల దూరంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఎవరూ గాయపడలేదు
Ø యూపీ, డిల్లీ సీఎంలు యోగి ఆదిత్యనాత్, కేజ్రివాల్, ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవతులను హతమార్చేటందుకు జైషే ముహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రణాలికలు వేసినట్టు నిఘా వర్గాలు పసిగట్టాయి
Ø విశాఖ నగరంలో అప్పు తీర్చలేదని ఇద్దరు వ్యక్తులను కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిన ఫైనాన్స్ వ్యాపారి
Ø సత్తెనపల్లి పట్టణంలో ప్రతి నిత్యం ఇళ్ళల్లోకి దొంగలు ప్రవేశించి విలువైన వస్తువులను అపహరిస్తూ ప్రజలకు దడ పుట్టిస్తున్నారు
Ø తెలంగాణా ఇంటర్ బోర్డ్ ముందు ఐద్వా మహిళా సంఘంతో పాటు మిగిలిన సంఘాల ఆధ్వర్యంలో గురువారం కూడా ఆందోళనలు కొనసాగాయి
Ø డిల్లీ నుండి సాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళే ఎయిర్ ఇండియా విమానంలో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ప్రయాణికులు లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది
Ø హైదరాబాద్ పాతబస్తీలో పదవ తరగతి పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న నరేష్ అనే బాలుడు ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మాహత్యకు పాలుపడ్డాడు
Ø శ్రీనగర్ లో గురువారం భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉర్గావాదులు హతమయ్యారు