Health

భోజనం మధ్యలో నీరు తాగాలా? వద్దా?

can you really drink water while eating

చాలామంది భోజనం సమయంలో నీరు తాగుతుంటారు. ఇలా తాగడం మంచిది కాదని చెబుతుంటారు. ఇది ఇంతవరకు నిజమో తెలుసుకోండి..భోజనం చేసేటప్పుడు చాలామంది నీరు తాగుతుంటారు. ఇది అంత మంచిది కాదని చెబుతారు. అయితే, తగిన మోతాదులో నీళ్లు తాగితే మంచిదే. అంతేకాని ఎక్కువ నీరు తాగకూడదు. దీనివల్ల జీర్ణక్రియ పనితీరు తగ్గుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి భోజనం సమయంలో ఎక్కువనీరు తీసుకోవద్దని చెబతారు. కాబట్టి.. భోజనం ముందు కానీ, తర్వాత అరగంట తేడాతో నీరు తాగాలి. ఒకవేళ మరీ తాగాలనిపిస్తే కొద్దికొద్దిగా మాత్రమే తాగాలి.ఒంట్లో నీటిశాతం తక్కువగా ఉన్నప్పుడే ఇలా నీరు తాగాలనిపిస్తుంది. కాబట్టి భోజనం సమయంలోనే కాకుండా రోజంతా అప్పుడప్పుడు నీరు తాగుతుండాలి. బోజనం సమయంలో మాత్రం తక్కువగా నీరు తాగాలి. ఇక భోజనం మరీ స్పైసీగా ఉన్న నీరు తాగాలనిపిస్తుంది కాబట్టి.. అలా ఉండకుండా ఉప్పు, కారం, మసాలాలు తగ్గించి తినాలి.