Videos

హౌలీ హౌలీ

rakul tabu rocked in hauli hauli video song

‘హౌలీ హౌలీ..’ అంటూ తెగ చిందులేస్తున్నారు అజయ్‌ దేవగణ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, టబు. వీరు ముగ్గురూ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘దే దే ప్యార్‌దే’. అకీవ్‌ అలి దర్శకత్వం వహించారు. కాగా.. ఈ చిత్రంలోని ‘హౌలీ హౌలీ’ అంటూ సాగే మూడో పాటను శుక్రవారం విడుదల చేశారు. ఈ పార్టీ సాంగ్‌లో రకుల్‌, టబు..అజయ్‌తో కలిసి స్టెప్పులేయడం ఆకట్టుకుంటోంది. 50 ఏళ్ల ఆశిష్‌ (అజయ్‌) తన భార్య మంజు (టబు)తో విడిపోయి ఒంటరిగా ఉంటాడు. ఈ నేపథ్యంలో ఆయనకు 26 ఏళ్ల ఆయేషా (రకుల్‌)తో పరిచయం ఏర్పడి ప్రేమపుడుతుంది. ఆయేషాను పెళ్లి చేసుకోవాలనుకున్న క్రమంలో మంజు మళ్లీ ఆశిష్‌ జీవితంలోకి వస్తుంది. అలా మాజీ భార్య, ప్రేయసి మధ్య ఆశిష్‌ ఎలా ఇరుక్కున్నారు? అన్నదే కథ. అన్ని వర్గాలు వారు చూడగలిగే రొమాంటిక్‌ కామెడీ చిత్రంగా ఈ సినిమాను తెరకెక్కించారు. మే 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.