NRI-NRT

నాట్స్ వంటల పోటీలో బెల్లం గారె-జున్ను చేసి అదరగొట్టిన డల్లాస్ మహిళలు-NATS2019

special cooking competitions nats 2019 irving gallery news videos

నాట్స్ అమెరికా తెలుగు సంబరాల సందర్భంగా తెలుగువారికి అనేక పోటీలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా డాలస్ తెలుగు మహిళలకు వంటల పోటీలు నిర్వహించింది. ప్రకృతి సిద్ధమైన పదార్థాలను మాత్రమే వాడాలనే నిబంధనతో నిర్వహించిన ఈ పోటీల్లో మహిళలు తమ పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని ప్రదర్శించారు. సంజన కలిదిండి మొదటి స్థానం, రంజని రావినూతల రెండవ స్థానం, శ్రీవాణి హనుమంతు మూడవ స్థానాన్ని, శ్రేష్ఠ విజేతగా స్వాతి మంచికంటిని న్యాయనిర్ణేతలు జ్యోతి వనం, శ్రీలక్ష్మి మండిగలు తెలిపారు. ఆపిల్ -కొబ్బరి బర్ఫీ, కిళ్ళీ కేక్, బెల్లం గారె, జున్ను వంటి రుచులు ఆకట్టుకున్నాయి. సంబరాల్లో నారీ సదస్సు నిర్వహిస్తున్నట్లు సమన్వయకర్త రాజేశ్వరీ ఉదయగిరి తెలిపారు. ఈ పోటీల నిర్వహణకు నారీ సదస్సు సభ్య బృందం రాధ బండారు, గాయత్రి గ్రిరి, లావణ్య ఇంగువ, వాణి ఐద, ప్రత్యూష మండువ, పద్మశ్రీ తోట తదితరులు తమ సహాయ సహకారాలు అందించారు. నాట్స్ సంబరాల సమన్వయకర్త కంచర్ల కిషోర్‌తో పాటు కార్యవర్గ కమిటీ ఈ పోటీల్లో విజేతలను ప్రత్యేకంగా అభినందించింది. మే 24 నుండి 26 వరకు ఇర్వింగ్‌లో నిర్వహించే నాట్స్ సంబరాలకు తరలిరావాలని ఆహ్వానించింది.