Agriculture

భారత ఆహార రంగంలో అపార ఉద్యోగవకాశాలు

indian food processing industry has lot of employment opportunities

భారత్‌లో మొత్తం పారిశ్రామిక వృద్ధి రేటు 7% గా ఉంటే ఆహార ప్రాసెసింగ్‌ రంగం మాత్రం 23% వృద్ధి రేటుతో వేగంగా పరిధిని పెంచుకుంటోంది. దీంతో అనేక ఉద్యోగావకాశాలు వస్తున్నాయి. ఫుడ్‌ టెక్నాలజిస్ట్‌, న్యూట్రీషనల్‌ థెరపిస్ట్‌, ప్రొడక్ట్‌/ ప్రాసెస్‌ డెవలప్‌మెంట్‌ సైంటిస్ట్‌, క్వాలిటీ మేనేజర్‌, సైంటిఫిక్‌ ల్యాబొరేటరీ టెక్నీషియన్‌, చెఫ్‌, ప్రొడక్షన్‌ మేనేజర్‌, పర్చేజింగ్‌ మేనేజర్‌, రిసెర్చ్‌ సైంటిస్ట్‌, టాక్సికాలజిస్ట్‌ వంటి ఉద్యోగాలు లభిస్తాయి. సంస్థలు: ప్రభుత్వ ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖా విభాగాలు, క్యాడ్బరీ ఇండియా, పార్లే ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌, ప్రియా ఫుడ్స్‌ – ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌, రస్నా ఇంటర్నేషనల్‌, నెస్లే ఇండియా లిమిటెడ్‌, బ్రిటానియా ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌, గుజరాత్‌ అంబుజా ఎక్స్‌పోర్ట్స్‌ లాంటి ప్రముఖ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ కంపెనీలు ప్రధానంగా ఉద్యోగాలు ఇస్తున్నాయి