Kids

తప్పు చేస్తే యముడికి అయినా శిక్ష తప్పదు

Lord Shivas Curse To Lord Yama

సూర్యుని పుత్రుడు యముడు. బహు సుందరాంగుడు.అసలు పేరు
‘యమ’ . అతని అందచందాలు , శౌర్యప్రతాపాలను చూసి దేవలోక అప్సర్సలంతా యముని
చుట్టూ తిరిగేవారు.

ఆ కారణంగా వ్యామోహంలో పడిన కాలదేవుడు తన
విధులను సక్రమంగా
నిర్వర్తించ లేకపోయాడు.
యమలోకపు విధులన్నీ అస్తవ్యస్తమయ్యాయి. భూలోకవాసులలో మృతులే లేకుండాపోయారు.

రాబోయే విపత్కర పరిస్థితి ని గ్రహించిన
లయకారుడైన పరమేశ్వరుడు ,తన శక్తి తో యమధర్మరాజు యొక్క సుందరదేహాన్ని , రూపాన్ని పూర్తిగా మార్చివేశాడు.
కోర పళ్ళు , కారు నలుపు
శరీరం, మొరటు మీసాలు, ఎర్రటి కళ్ళు, తల మీద రెండు కొమ్ములతో యముని ఆకారం చూడడానికే
భయంకరంగా మారింది. తన వికార రూపాన్ని చూసుకుని,యముడు
తన పాత సుందర రూపం ప్రసాదించమని శివుడిని దీనంగా వేడుకున్నాడు.

కానీ ఈశ్వరుడు ఏమీ బదులు చెప్పక తన ధ్యానంలో నిమగ్నుడయ్యాడు.

చేసేదిలేక యముడు భూలోకానికి వెళ్ళి విష్ణువు కోసం తపస్సు చేసి, ఆయన దయతో పోగొట్టుకొన్న రూపాన్ని తిరిగి పొందాలనుకొన్నాడు.

భూలోకానికి చేరి తపస్సుకోసం తనకు అనువైన స్థలాన్ని అన్వేషిస్తూ దక్షిణ దిశగా పయనించాడు.
అక్కడ ఒక ప్రదేశం తనను ఆకర్షించగా, ఆ పర్వత
చరియ వద్ద ఆశీనుడై
శ్రీ మహావిష్ణువు గురించి
తపస్సు మొదలు పెట్టాడు.

కొంతకాలం గడిచాక యముని తపస్సు కి మెచ్చి, శ్రీ మహావిష్ణువు
ప్రత్యక్షమయ్యాడు.
యముడు సాష్టాంగ
నమస్కారం చేసి‌,తను రూపం పోగొట్టుకున్న విషయం తెలిపి తనని కాపాడమని ప్రార్ధించాడు.
‘ ఎంతో ఉన్నతమైన ,బాధ్యత గల పదవి నిర్వహిస్తున్న నీవు నీ అందానికి గర్వపడి, వ్యామోహంలోపడి నీ కర్రవ్యాన్ని పూర్తిగా విస్మరించావు. అందువలన కలిగిన ఫలితం యిది.శివుడి ఆదేశాలను అనుభవించక తప్పదు.’ అని కొన్ని వరాలను యిచ్చాడు.మహవిష్ణువు యిచ్చిన వరాలు , యమునికి తృప్తిని యివ్వలేదు.

తన కోరపళ్ళను, నల్లటి దేహ ఛ్ఛాయను మార్చి తన పాత సుందరదేహాన్ని అనుగ్రహించమని
వేడుకొన్నాడు.

‘కాలదేవా ! నీవు సత్యలోకానికి వెళ్ళి నప్బుడు నువ్వు బ్రహ్మదేవుని అవమానించే విధంగా ప్రవర్తించినందు వలన
యీ ఘోర రూపం యెప్పటికీ వుండేలాలిఖించాడు విధాత.
బ్రహ్మ విధిలిఖితాన్ని
నేను మార్చలేను.
అయినా చింతించకు.
ఈ రూపం వలన జీవులకు నీపై అపరిమిత భయ ,భక్తులను పెంచుతుంది. నీ విధులను సక్రమంగా నిర్వర్తించడానికి సహాయకారి అవుతుంది. నీ యీ కోర పళ్ళవలన లోకంలో వ్యాధులు యేర్పడి తద్వారా మరణాలు సంభవించి
నీ వృత్తి ధర్మానికి తోడ్పాటును యిస్తాయి’సహాయకారిగా అని ఆనుగ్రహించాడు
శ్రీ మహావిష్ణువు.

యమధర్మరాజు కోరల వలన ఆషాఢ మాసం,భాద్రపద
మాసాలలో అధిక వ్యాధులు సంభవిస్తాయని అంటున్నాయి శాస్త్రాలు.

ఆదిలో యముడు అందంగానే వుండేవాడని
తిరువారూరు పురాణం
చెప్తోంది.

కాశీలో మరణిస్తే ముక్తి,
తిరువారూరు లో జన్మిస్తేనే ముక్తి అనే
నానుడి వుంది.
పుట్టుక ,మరణం
మనిషి చేతిలో లేదు.

అంతా భగవత్ చిత్తం.
తిరువారూరు లో పుట్టిన
వారందరూ శివగణాలే.
యముని కి యిక్కడ పని
లేదు.

అందుకే ఇక్కడ యముడు చండేశ్వర పదవి నిర్వహిస్తున్నాడు.
జడలు , గడ్డం మొదలైన
వాటితో, మోకాళ్ళ మీద
తల వంచి, ప్రశాంతంగా
ప్రసన్న వదనంతో అందంగా దర్శనమిస్తున్నాడు యముడు.

ఈ తిరవారూరు దేవాలయంలో చండికేశ్వరుడు ఆది చండికేశ్వరుని గా దర్శనమిస్తున్నాడు.

ఈ ఆలయంలో మూల విగ్రహం త్యాగరాజేశ్వరుని దర్శించి, ప్రాకార ప్రదక్షిణం
చేసి, “ఋణాఋణేశ్వర” బంగారు విగ్రహాన్ని ప్రత్యేక సన్నిధిలో దర్శిస్తాము.

ఈ విగ్రహం ప్రక్కనే ప్రత్యేక
సన్నిధిలో, ప్రసన్న ముఖంతో,వ్యత్యాసమైన
ముఖంతో యమధర్మరాజు ని దర్శిస్తాము.
ఈ రూపమే ఆదిలో యముడు వున్న రూపమని పురాణం చెప్తోంది.

ఈ రూపంలో యముని
యెక్కడా దర్శించలేము.
తిరువారూరు లోని యీ
యమధర్మరాజు ని
వైశాఖ పౌర్ణమి రోజున
పూజించి , ఆరాధిస్తే
మనశ్శాంతి లభిస్తుంది
అని ఐహీకం.
వైశాఖ పౌర్ణమి రోజున తిరువారూరు యమధర్మరాజు కు ప్రత్యేక పూజలు జరుపుతారు.