విద్యార్ధులు, యువతకు అత్యంత కీలకమైన సోషల్ మీడియా అంశంపై నాట్స్ సదస్సు ఫ్లోరిడాలోని టంపాలో నిర్వహించారు. ప్రవాస యువతీయువకులు ఈ సదస్సులో పాల్గొని తమ సందేహాలు నివృత్తి చేసుకున్నారు. సోషల్ మీడియా దుష్ప్రభావాలపై నిపుణులు మార్టిన్ స్పెన్సర్ ఈ సదస్సులో వివరించారు. యువత సోషల్ మీడియాలో పెట్టే పోస్టుల పట్ల ఎంత అప్రమత్తంగా ఉండాలనే దానిపై సూచనలు చేశారు. సోషల్ మీడియాకు బానిస కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కాలేజీలో చేరబోయే విద్యార్ధులు, వారి తల్లిదండ్రులకు రజితా నిడదవోలు దిశా నిర్థేశం చేశారు. నాట్స్ టెంపా బే సమన్వయకర్త రాజేశ్ కందురు నేతృత్వంలో ఈ సదస్సు ఏర్పాటు చేశారు.



