NRI-NRT

హ్యూస్టన్‌లో నాట్స్ సంబరాలకు నిధుల సేకరణ

nats 2019 samabralu fund rising in houston kishore kancharla manchikalapudi srinivasa babu

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) ఆధ్వరయంలో మే 24,25,26 తేదీల్లో డల్లాస్‌లో నిర్వహిస్తున్న అమెరికా తెలుగు సంబరాల నిర్వహణకు హ్యూస్టన్‌లో నిధుల సేకరణ నిర్వహించారు. హ్యూస్టన్ నాట్స్ సభ్యులు, స్థానిక ప్రవాస తెలుగు సంఘాల ప్రతినిధులు, ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా డాలస్ నాట్స్ విభాగ సభ్యులు హాజరయి సంబరాల వివరాలు, విశేషాలు అతిథులతో పంచుకున్నారు. సంగీత, నాట్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. శైలజ గ్రంధి వ్యాఖ్యానం, కార్తీక్ గానలహరి అలరించాయి. నాట్స్ సౌత్ సెంట్రల్ జోన్ వైస్ ప్రెసిడెంట్ హేమంత్ కొల్లా సంబరాలు స్పాన్సర్ ప్యాకేజీలపై ప్రసంగించారు. నాట్స్ హ్యూస్టన్ సమన్వయకర్త శ్రీనివాస్ కాకుమాను హ్యూస్టన్ నాట్స్ సేవా కార్యక్రమాలను వివరించారు. హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి అధ్యక్షులు రాము ఉప్పలపాటి, తెలంగాణ అసోసియేషన్ అఫ్ గ్రేటర్ హ్యూస్టన్ ట్రస్టీ జగపతి వీరాటి, వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ తోట, కార్యవర్గ సభ్యులు, అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ బోర్డు అఫ్ డైరెక్టర్ శ్రీధర్ కంచనకుంట్ల, ఐటీసర్వ్ హ్యూస్టన్ అధ్యక్షులు నరేందర్ మొండలరెడ్డి, ప్రముఖ హ్యూస్టన్ గాయని శారదా ఆకునూరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంబరాల నిర్వహణకు విరాళలు అందించిన ప్రతి ఒక్కరికీ నాట్స్ అధ్యక్షులు మంచికలపూడి శ్రీనివాస బాబు, నాట్స్ 2019 సంబరాల సమన్వయకర్త కంచర్ల కిషోర్‌లు ధన్యవాదాలు తెలిపారు.
NATS Fundrising In Houston for 2019 NATS America Telugu Sambaralu In Irving TNILIVE
NATS Fundrising In Houston for 2019 NATS America Telugu Sambaralu In Irving TNILIVE
NATS Fundrising In Houston for 2019 NATS America Telugu Sambaralu In Irving TNILIVE