‘గేమ్ చేంజర్’ పేరుతో వెలువరించిన తన ఆత్మకథతో షాహిద్ అఫ్రిది వివాదాలకు కేంద్ర బిందువుగా మారాడు. ఆ పుస్తకంలో గంభీర్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దాని కారణంగా గంభీర్, అఫ్రిది మధ్య వేడి వాతావరణం కొనసాగుతోంది. నువ్వో పిచ్చివాడివంటూ గంభీర్ చేసిన వ్యాఖ్యలపై అఫ్రిది స్పందించాడు. ‘గంభీర్‌కు నిజంగా మతిస్థిమితం సరిగా లేదు. అతను మా దేశం వస్తే నా ఆసుపత్రిలోనే ప్రత్యేకంగా చికిత్స చేయిస్తా. ఒకవేళ అతనికి వీసా సమస్య వస్తే. నేను దగ్గరుండి వీసా ఇప్పిస్తా’ అని అఫ్రిది అన్నాడు. అఫ్రిది తన ఆత్మకథలో గంభీర్ గురించి ప్రస్తావిస్తూ.. అతనికి కావాల్సినంత పొగరు ఉంది. కానీ, ఆటలో గొప్ప రికార్డేమీ లేదని పేర్కొన్నాడు. గంభీర్‌కు అసలు వ్యక్తిత్వమే లేదు’ అని రాసుకొచ్చాడు. అయితే, ఆ తర్వాత గంభీర్ కూడా ఘాటుగానే స్పందించాడు. ‘నువ్వో తమాషా వ్యక్తివి. అది సరే కానీ.. పాకిస్థానీయులకు మా దేశం ఇంకా వైద్య పరమైన వీసాలు జారీ చేస్తూనే ఉంది. నువ్వు వచ్చావంటే నేనే వ్యక్తిగతంగా మానసిక వైద్యుడి దగ్గరికి తీసుకెళ్తా’ అని ట్వీటర్‌లో పేర్కొన్నాడు. అయితే, గంభీర్ ట్వీట్‌పై అఫ్రిది ఇలా స్పందించాడు. దీంతో ఇద్దరూ ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు.
ఇద్దరి పిచ్చివాగుడు

Related tags :