వేసవి ఎండలో తిరిగేవారికి వడదెబ్బ తగలడం సర్వసాధారణం. అలాంటపుడు ఇంటిపట్టునే చిన్నపాటి చిట్కాలు పాటిస్తే దాన్ని నుంచి త్వరగా కోలుకోవచ్చు.
* చల్లటి నీళ్లలో నిమ్మరసం, ఉప్పు, తేనె కలిపి గంటకోసారి తాగితే తక్షణ ఉపశమనం లభిస్తుంది.
* మేకపాలు తీసుకుని వడదెబ్బ తగిలిన వారి పాదాలకు, చేతులకు మర్దన చేస్తే త్వరగా తగ్గుతుంది.
* నీరుల్లిపాయ రసాన్ని కణతలకు గుండెకు రాసినట్లయితే వడదెబ్బ తగులుతుంది.
* చెమట రూపంలో కోల్పోయిన లవణాలు తిరిగి పొందాలంటే మజ్జిగ, కొబ్బరి, నీళ్లు, నిమ్మరసం వంటివి తరచూ తాగుతూ ఉండాలి.
* పండు చింతకాయ రసానికి ఉప్పు కలిపి తాగితే వడదెబ్బ నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది.
* సబ్జా గింజలు నానబెట్టిన నీటిని తాగడం వల్ల వేడి తాలూకు ప్రభావం తగ్గుతుంది.
వడదెబ్బ తగిలితే సబ్జా గింజలతో…
Related tags :