ఎపిలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా భగ్గుమంటున్నాయి. రాష్ట్రంలో చాలా చోట్ల సాధారణం కంటే ఆరు నుంచి ఎనిమిది డిగ్రీల వరకూ అధిక ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి. ఈ ప్రభావం మరో మూడు నాలుగు రోజులు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. చిత్తూరు నుంచి విశాఖ వరకూ దాదాపు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలోనూ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు మించి నమోదౌతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలో నిన్న అత్యధికంగా 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉష్ణోగ్రతలకు తోడు వడగాల్పులు కూడా వీస్తుండటంతో జనం అల్లాడుతున్నారు.
భగ్గుమంటున్న ఉష్ణోగ్రతలు
Related tags :