Movies

సురేఖా వాణి భర్త మృతి

surekha vanis husband passed away

ప్రముఖ నటి సురేఖా వాణి భర్త, టీవీ షోల దర్శకుడు సురేష్‌ తేజ మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. సురేఖ, సురేష్‌ ప్రేమ వివాహం చేసుకున్నారు. సురేఖ టీవీ యాంకర్‌గా ఉన్న రోజుల్లో ఆమెను సురేష్‌ ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. ‘మా టాకీస్’, ‘హార్ట్‌ బీట్‌’, ‘మొగుడ్స్‌ పెళ్లామ్స్‌’ వంటి టీవీ షోలకు సురేష్‌ దర్శకత్వం వహించారు. ఈ షోలకు సురేఖ యాంకర్‌గా వ్యవహరించారు. సురేష్‌ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.