Politics

పండితపుత్రులు ఎగిరిపడుతున్నారు

KVP Calls Devineni Uma et al PandithaPutras Over Polavaram Issue

పోలవరం ప్రాజెక్టు విషయంలో తాను ఏపీ ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాస్తే, ఏపీ మంత్రి దేవినేని ఉమతో పాటు పోలవరంపై ఓనమాలు కూడా తెలియని పండిత పుత్రులు తనను విమర్శిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు విమర్శించారు. పార్టీ హైకమాండ్ ఆదేశించగానే తోక కాలిన కుక్కల్లాగా మొరగకుండా లేఖలో ఏం ఉందో చదవి స్పందించి ఉంటే బాగుండేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు కేవీపీ ఈరోజు టీడీపీ నేతలకు బహిరంగ లేఖ రాశారు.ఈ వ్యవహారంలో నిజం మాట్లాడటం ఇష్టం లేదో లేక సబ్జెక్టుపై అవగాహన లేదో.. దేవినేని ఉమ కూడా తన లేఖలో పోలవరం ప్రాజెక్టు ఖర్చుపై వేసిన ప్రశ్నలకు జవాబు ఇవ్వలేదని కేవీపీ తెలిపారు. పోలవరం ప్రాజెక్టును ఏపీ తీసుకోవడం ద్వారా ఎంత భారం రాష్ట్రంపై పడుతుందో ఉమ చెప్పలేదన్నారు. ఒకవేళ ఎలాంటి భారం పడకుంటే ఉమ దానిపై స్పష్టత ఇచ్చి ఉండేవారనీ, కానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడం చూస్తుంటే తాను చెప్పింది నిజమేనని ఆయన అంగీకరించినట్లేనని కేవీపీ వ్యాఖ్యానించారు.