NRI-NRT

తెలుగు విద్యార్థులకు $1000 “ఆటా” ఉపకారవేతనాలు

ATA Announces Scholarships To Telugu College Students

అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా ) తెలుగువారి కోసం స్కాలర్ షిప్స్, మ్యాట్రిమోనియాల్ సర్వీసెస్‌ ప్రారంభించింది. నార్త్ కరోలినా లోని ర్యాలీలో ఆటా ప్రెసిడెంట్ పరమేష్ భీంరెడ్డి అధ్యక్షతన ఆటా బోర్డు మీటింగ్‌ జరిగింది. అమెరికాలో నివసిస్తున్న తెలుగు వారి అవసరాలకి అనుగుణంగా ఆటా రూపొందించిన సేవా కార్యక్రమాలని ఈ సమావేశంలో వెల్లడించారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా తెలుగువారికోసం మ్యాట్రిమోనియాల్ సైట్ (http://www.atamatrimony.com/) ని ఆటా ప్రెసిడెంట్ పరమేష్ భీంరెడ్డి ప్రారంభించారు. వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ విధానాన్ని బోర్డు సభ్యులకి చూపించారు. తెలుగు యువతకు విద్యావసరాల కోసం స్కాలర్‌షిప్స్‌ ప్రోగ్రామ్‌ని కూడా బోర్డు ఆమోదించింది. అమెరికాలో ఉన్న 10మంది తెలుగు వారి పిల్లలకు కాలేజీ అవసరాల కోసం ఒక్కొక్కరికి 1000 డాలర్ల చొప్పున అందిస్తామని పరమేష్ తెలిపారు. భువనేశ్ బుజాల (ప్రెసిడెంట్ ఎలెక్ట్) ని ఆటా వేడుకల చైర్‌గా ఆయన నియమించారు. అమెరికాలో ఉంటున్న తెలుగు వారికోసం మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలంటే ఆటాలో తెలుగువారి సభ్యత్వం మరింత పెరగాలని, అందుకోసం ఇక్కడ ఉంటున్న తెలుగువారందరినీ ప్రోత్సహించి సభ్యత్వం చేయించాలని బోర్డు సభ్యులు అభిప్రాయపడ్డారు. ఆటా బోర్డు సమావేశానికి అమెరికాలోని వివిధ నగరాల నుంచి రీజనల్‌ కోఆర్డినేటర్స్ , రీజనల్‌ డైరెక్టర్స్ , రీజనల్‌ అడ్వయిర్స్‌, ఉమెన్స్ కమిటీ చైర్స్, కో చైర్స్, స్టాండింగ్ కమిటీ చైర్స్, కోచైర్స్, ఆటా సభ్యులు పాల్గొన్నారు. దాదాపు 150 మంది వరకు హాజరైన ఈ సమావేశానికి ఏర్పాట్లు చేసిన బోర్డు ఆఫ్‌ ట్రస్టీస్ మధు బొమ్మినేని, సాయి సుదిని, స్టాండింగ్ కమిటీ చైర్స్ పవన్ నోముల, వెంకట్ ఏటుకూరి , రీజనల్ కోఆర్డినేటర్స్ అజయ్ మద్ది, నిహారిక నవలగా కు బోర్డు కృతజ్ఞతలు తెలిపింది.
ATA Announces Scholarships To Telugu College Students
ATA Announces Scholarships To Telugu College Students