Business

భారతీయ బ్యాంకుల్లో కనీస బ్యాలెన్స్ కష్టాలు

How to escape from minimum balance penalties by banks in India

SBI, HDFC, ICICI మినిమం బ్యాలెన్స్: పెనాల్టీ తప్పించుకోండి! ప్రభుత్వ, ప్రయివేటురంగ బ్యాంకుల్లోని సేవింగ్ అకౌంట్ కస్టమర్లు తమ తమ బ్యాంకుల్లో కనీస నగదు (మినిమం బ్యాలెన్స్) ఉండాలి. ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నుంచి మొదలు ప్రయివేటు రంగ బ్యాంకు దిగ్గజాలు హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐలు యావరేజ్ మినిమం మంత్లీ బ్యాలెన్స్ విషయంలో తమ తమ రూల్స్ ఫాలో అవుతున్నాయి. మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకుంటే పెనాల్టీ ఉంటుంది. ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకులలో ఎక్కడ ఎంత మినిమం బ్యాలెన్స్ ఉంటే పెనాల్టీ తప్పించుకోవచ్చో చూడండి.

*** SBI మినిమం బ్యాలెన్స్:
మెట్రో, అర్బన్ ప్రాంతాల్లో SBI సేవింగ్స్ అకౌంట్ కలిగి ఉన్నవారు తమ తమ ఖాతాల్లో రూ.3,000 మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. సెమీ అర్బన్, రూరల్ బ్రాంచీల్లో వరుసగా రూ.2,000, రూ.1,000 ఉండాలి. మంత్రీ యావరేజ్ ఇంతకు తగ్గితే జరిమానా విధిస్తారు.

*** ICICI మినిమం బ్యాలెన్స్:
మెట్రో, అర్బన్ ప్రాంతాలలో ICICI సేవింగ్స్ అకౌంట్‌లో కనీసం రూ.10,000 ఉండాలి. సెమీ అర్బన్ ప్రాంతాలలో యావరేజ్‌గా రూ.5,000 ఉండాలి. రూరల్ ప్రాంతాల్లో రూ.2,000 ఉండాలి. గ్రామీణ్ లొకేషన్స్‌లలో మినిమం బ్యాలెన్స్ రూ.1,000 ఉండాలని ఈ బ్యాంక్ వెబ్ సైట్ వెల్లడిస్తోంది.

*** HDFC మినిమం బ్యాలెన్స్:
మెట్రో, అర్బన్ ప్రాంతాలలో HDFC సేవింగ్స్ అకౌంట్‌లో కనీసం రూ.10,000 ఉండాలి. సెమీ అర్బన్ బ్రాంచీలలో కనీసం రూ.5,000 ఉండాలి. రూరల్ బ్రాంచీలలో కనీసం రూ.2,500 ఉండాలి. లేదా రూ.10,000 ఫిక్స్‌డ్ డిపాజిట్ కలిగి ఉండాలి. కనీస మెచ్యూరిటి పీరియడ్ ఏడాది ఒక్కరోజు ఉండాలి.